సామ కృష్ణారెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి
Street Buzz news రంగారెడ్డి జిల్లా:
(చేవెళ్ల):- దేవుని ఎర్రవల్లి గ్రామానికి సంబంధించినా సామా కృష్ణా రెడ్డి అనే ఇతను ఈ దేశ మహారాజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి, రిజర్వేషన్, రాష్ట్రపతి గురించి, కించెపరిచే విదంగా చేవెళ్ల న్యూస్ అనే వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ పెట్టారని కాబట్టి ఇతని పైన ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని సోమవారం వివిధ ప్రజా సంఘాల నాయకులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ముట్టడించారు. దాదాపు 2 గంటలకు పైగా సమయం అవుతున్నా అర్థ రాత్రి అయినా సామా కృష్ణారెడ్డి ని అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడినుండి వెళ్ళబొమని బిస్మించి కూర్చున్నారు.వారు మాట్లాడుతూ దేవునిఎర్రవల్లి గ్రామ సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి తమ్ముడు సామ కృష్ణారెడ్డి ఇతనికి ఏం తెలుసు భారత రాజ్యాంగం విలువ దానిలోని ఒక్కపెజిని కూడా సరిగ్గా చదవనికే రాని దద్దమ్మ ఎవడో వెనక ఉండి చెబితే ఇలాంటి చెత్త పోస్ట్ లు పెడతాడా? పైగా లైక్,, సపోర్ట్ చేయాలని పోస్ట్ చేశాడని ,భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి గురించి భారత రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము గార్ల గురించి, రిజర్వేషన్ల గురించి అవమానిస్తూ చేసిన పోస్టు చేసిన కారణంగా అతని పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని అన్ని ప్రజా సంఘాలు చేవెళ్ళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. FIR చేసే వరకు వినేది లేదని పట్టు పట్టిన సంఘాల నాయకులు.
Feb 21 2023, 22:41