ఇoడ్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ

తిప్పర్తి: ఇoడ్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ 

కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు అన్నారు.

కంటి వెలుగు శిబిరం పరిశీలన 

పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తిప్పర్తి ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. సోమవారం తిప్పర్తి మండలంలోని ఇoడ్లురు కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ స్థానిక సర్పంచ్ మార్త శ్రీదేవి సైదులు కలిసి ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని.. వాటిని ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలు గు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్ మెంట్ తిప్పర్తి కంటి వెలుగు టీం 2. క్యాంప్ మెడికల్ ఆఫీసర్ ఫీర్దొస్ ఫార్ఖదా, నెత్ర విద్య సహాయక నిపుణులు షేక్ కలీమ్, సూపర్వైజర్లు గ్రామ ఉపసర్పంచ్ పోలేపోయిన శ్రీను, గ్రామపంచాయతీ కార్యదర్శి P. రాధ, మామిడి నాగరాజు, వార్డ్ మెంబర్లు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 13వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నల్గొండ బిసి సంక్షేమ సంఘం నాయకులు

తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రము లో అమరవీరుల స్తూపం వద్ద బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు అసెంబ్లీ సాక్షిగా పెట్రోలు పోసుకొని అమరుడైన సిరిపురం యాదయ్య కాంస్య విగ్రహాన్ని టాంక్ బండ్ పై పెట్టాలని ,అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి,జిల్లా కార్యదర్శి వడ్డేబోయిన సైదులు,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షుడు మునస ప్రసన్న కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి ఖదీర్, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, బక్కతట్ల వెంకన్న యాదవ్, కంభంపాటి శంకర్ దుర్గా , చల్లాకోటి యాదవ్, పున్న వీరేశం, గుర్రం వెంకన్న, చిలుకూరి శ్రీను,వల్లకీర్థి శ్రీనివాస్, జెరిపోతుల వెంకన్న గౌడ్, గంజి అంజయ్య, గంజి నరేష్, ముస్తాఫ, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణం లో ఈనెల 21 వ తారీకు నుండి డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ

Press Note

నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ.

ఎల్లుండి (21 ఫిబ్రవరి) నుంచి ప్రారంభం. శనివారం (26 ఫిబ్రవరి) సాయంత్రం 5 గంటల వరకు గడువు. 

నల్గొండ శాసన సభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో ధరఖాస్తు స్వీకరణ కు 12 కేంద్రాల ను ఏర్పాటు చేయనున్న మున్సిపల్ కమిషనర్. 

వార్డుల వారీగా ధరఖాస్తు ల స్వీకరణ. 

3, 4 వార్డులకు కలిపి ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు. 

వెనువెంటనే ధరఖాస్తు ల విచారణ ప్రారంభం. మరియు అర్హుల లైన లబ్ధిదారుల ఎంపిక. కలెక్టర్ ఆదేశాల తో 12 ఎంక్వైరీ టీమ్ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఆర్డీవో . 

* గృహ నిర్మణా శాఖ వారు రూపొందించిన ధరఖాస్తు ఫారం ల ను మాత్రమే ఉపయోగించి ధరఖాస్తు చేయాలని, అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద ధరఖాస్తు ఫారాలను అందుబాటు లో ఉంచవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి.

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్‌ నమోదుకు కొత్త నిబంధన

పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్‌ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్‌ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలి­యజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శా­ఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్‌ ప్రభాకరన్‌ ఆదేశాలు జారీ చేశారు.

 

వయసును బట్టి దరఖాస్తు ఫారం

► ఐదేళ్లలోపు పిల్లలకు కొత్తగా ఆధార్‌ కార్డుల జారీ లేదా ఆధార్‌లో వారి వివరాల అప్‌డేట్‌ చేసేందుకు ఒక రకమైన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 

► ఐదు ఏళ్లకు పైబడి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వేరే దరఖాస్తు ఫారం నమూనాను యూఐడీఏఐ సంస్థ విడుదల చేసింది. 

► 18 ఏళ్ల పైబడిన వారికి మరో ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుందని పేర్కొంది. 

► ఈ మేరకు మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలతో పాటే విడుదల చేసింది. 

► ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మూడు రకాల దరఖాస్తు ఫారాల విధానం అమలులోకి రాగా.. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

అర్హత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి-------- సిఐటియు

అర్హత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి-------- సిఐటియు

  జీవనోపాధి కోసం పట్టణానికి వలస వచ్చి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ అర్హత కలిగిన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

        ఆదివారం తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) నల్లగొండ పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని నిర్ణయించినందున అందులో అర్హత కలిగిన కమ్మరి ,వడ్రంగి కార్మికులందరూ మార్చి 3న తాసిల్దార్ కి దరఖాస్తు చేసుకున్నారని వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో వేలాదిమంది అర్హత కలిగిన పేదలు ఉన్నారని వారికి భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి 120 గజాల చొప్పున పంపిణీ చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు 

 సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్పెంటర్ వర్కర్ల కూలి రేట్లు పెరగాల్సి ఉందని అందుకోసం మార్చి 1న కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ పట్టణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు

   యూనియన్ పట్టణ అధ్యక్షుడు సెలవు సైదాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి దాసోజు ప్రభు చారి, సోమయాచారి, జనార్ధన చారి, సురేష్, శ్రీనివాసచారి , ఆంజనేయులు, వెంకన్న,  నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు

 నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు..మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు...

 ఈ సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో... భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు..

 అలాంటి దేవ దేవుని సన్నిధిలో ఈరోజు భక్తి ప్రపత్తులతో.. నిష్ట నియమాలతో..అత్యంత వైభవంగా మహాశివరాత్రి జరుపుకుంటున్నామని..

 మొదటిసారిగా నల్గొండ పట్టణ పురవీధుల్లో పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించామని....

ముఖ్యమంత్రి కేసీఆర్.. దత్తత తీసుకున్న ఈ నల్లగొండ నియోజకవర్గం లో.. దేవాలయాలకు.. మహర్దశ వచ్చిందని... 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఛాయా సోమేశ్వరాలయాన్ని అభివృద్ధి పరుస్తున్నామని.. ఇటు ఛాయా పచ్చల వెంకటేశ్వర ఆలయాలను అభివృద్ధి పరుస్తూ..

 ట్యాంక్ బండ్, శిల్పారామం,తీగల వంతెనతో... ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణ ఏర్పాటు కాబోతుందని...

 వచ్చే సంవత్సరం నాటికి కృష్ణా హారతి ఏర్పాటు చేయనున్నామని .. కంచర్ల తెలియచేశారు.

 నల్లగొండ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నానని... భక్తులకు,మహాశివరాత్రి ఈ సందర్భంగా..

శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు...

నల్గొండ పట్టణంలోని తన నివాసం వద్ద ప్రియతమా నేత కేసిఆర్ గారి జన్మదిన సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం అన్నదానం చేశారు...

ఆ భగవంతుని దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు

ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు వహించి పరిపాలనలో కొత్త నమూనాను రూపొందించిన నిరంతర తపస్వి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిపారు

రానున్న రోజుల్లో దేశ పురోభివృద్ధి చెందాలంటే దేశ రాజకీయాలలో కెసిఆర్ గారు ముఖ్య పాత్ర వహించి దేశ భవిష్యత్తును మార్చాలని ఆకాంక్షించారు...

రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర కోట్ల జనాభా ఆకాంక్షను నెరవేర్చి వారి అభ్యున్నతికి కృషి కోసం అహర్నిశలు పాటుపడుతున్న మహోన్నతమైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిపారు

కేసీఆర్ జన్మదిన సందర్భంగా నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు డప్పు సప్పులతో నృత్యలు చేశారు...

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం యాదవ్ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు పోలే వెంకటాద్రి ముక్కమల్ల వెంకన్న యాదవ్ నారీ నరసింహ పోలోజు వెంకటాచారి, కర్నాటి మల్లేష్ గోనె వాసు రావు సతీష్ అలుగుబెల్లి సైదిరెడ్డి జిల్లా పెళ్లి ఇంద్ర ఆంజనేయులు కట్ట శ్రీనివాస్ కంచర్ల శ్రవణ్ గౌడ్ కొండాపురం అరుణ్ కొప్పు మహేష్ పాక సాయి మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు... తదితరులు పాల్గొన్నారు.

మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు

మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు

జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ భాస్కరరావు గారి సమక్షంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ(ఇండియన్)

మీ సేవ, చందు మీ సేవ, మరియు పవన్ మీ సేవ. కేంద్రాలు వినియోగదారుల నుండి అదనపు వసూళ్లకు పాల్పడుతుండడంతో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మానవతా వాది అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేయగా సంబంధిత మీసేవ కేంద్రాల నిర్వాహకులకు షో కాజ్ నోటీసులు జారీ చేసి అంతర్గత విచారణ అనంతరం ఈరోజు పిర్యాదు దారు అయిన శ్రీ సాదిక్ పాషా గారి సమక్షంలో జాయింట్ కలెక్టర్ గారు సదరు మీ సేవా కేంద్రాల అక్రమ వసూళ్లపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే నిర్భయంగా తమకు పిర్యాదు చేస్తే అటువంటి వారిపై విచారణ జరిపి కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని తెలుపుతూ అక్రమాలకు పాల్పడ్డ సదరు నిర్వాహకులకు ఎటువంటి శిక్ష వేయాలో పిర్యాదుదారు అయిన సాదిక్ పాషా గారినే అడగడంతో వారు మానవతా దృక్పథంతో మొదటి తప్పుగా భావించి మందలించి మరలా తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఒక్కొక్కరికి 2000/- రూపాయలు జరిమానా విధిస్తూ భవిష్యత్తులో మళ్ళీ వీరిపై పిర్యాదు వస్తే వీరి కేంద్రాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తు ప్రతి మీసేవా కేంద్రాల్లో రేట్ల పట్టిక స్పష్టంగా పెద్ద అక్షరాల్లో ఉండేలా ఏర్పాటు చేసి పిర్యాదు చేయడానికి స్థానిక అధికారి పేరు మరియు ఫోన్ నంబరు వినియోగదారులకు కనపడేలా ఏర్పాటు చేయాలని సదరు అధికారులను ఆదేశించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, జాతీయ వినియోగదారుల హక్కుల సంస్థ కార్యదర్శి శ్రీ ఎం.డి. సాదిక్ పాషా, జాతీయ మానవ హక్కుల మండలి సభ్యులు జి.జనార్ధన్, జి.కరుణాకర్, వినియోగదారుల హక్కుల సంస్థ సలహాదారు శ్రీ మదగోని భిక్షపతి గారు మరియు పాత్రికేయుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

   నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

   నల్లగొండ పట్టణములొ రోడ్ల మరమ్మతులు గత ఆరు నెలల నుండి కొనసాగడం వలన పట్టణ ప్రజలు ధూళి, దుముకు గురి అయి అనారోగ్యం పాలవుతున్నారు. మరమతులను త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినారు. తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంల నేడు జరిగినది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడినారు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగిసిన నల్గొండ జిల్లాలో కొంతమంది రైతులకు పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం ఇంకా అందలేదని ప్రభుత్వం స్పందించి వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది. ధరణి పోర్టల్ లో తవ్వే కొద్ది సమస్యలు వెలుగు చూస్తున్నాయి భూవిస్తీర్ణములో మార్పులకు అవకాశం లేకపోవడం, కొత్త పహాని అందుబాటులో ఉండడం లేదని ధరణి లోని సమస్యలనువెంటనే పరిష్కరించాలని తీర్మానించనైనది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా 24 గంటలు రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదు, దానితో పంటలు ఎండి పోయే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 24 గంటలు కరెంటును సరఫరా చేయాలని తీర్మానించనైనది. వచ్చే సాధారణ ఎన్నికలలో నల్గొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాలని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రేపు తేదీ17-2-2023 న హైదరాబాదులో జరగబోయే రాష్ట్ర కమిటీ సమావేశానికి పంపడం. జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మారే బోయిన శ్రీధర్ ఉపాధ్యక్షులు సాతీరు యాదయ్య, కార్యదర్శి పులి పాపయ్య, వై పాపిరెడ్డి, కిరణ్ కుమార్ విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా//

ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు

సిర్పూర్

స్తానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాదితుడు

సీసీ ఫూటేజి ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు