ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్
Street Buzz news కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:
చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను అధిగమించడానికి చేయవలసిన కృషికోసం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకోవాలన్న ప్రతిపాదనను 2007, నవంబరు 26న జరిగిన ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, ఎ/ఆర్ఈఎస్/62/10 పై తీర్మానించగా 2009, ఫిబ్రవరి 20న తొలిసారిగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపబడింది.ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం విధులు విలువలు, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, భద్రత, ఆర్థిక సామాజిక పురోభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఎటువంటి వివక్షత పాటించకుండా సామాజిక న్యాయం అమలయ్యేలా చూడడం.అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు ఏర్పాటుచేయడం, సామరస్య వాతావరణం సాధించడం, వివిధ దేశాలమధ్య సమాన ప్రాతిపదికపై సంబంధాలు నెలకొల్పడం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థలు ఈ దినోత్సవం రోజున సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కొరకు ప్రచారం చేస్తాయి. సెమినార్లు, సమావేశాలు జరుగుతాయి. పేదలకు సహాయం చేయడానికి నిధులు సేకరించబడతాయి.ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాగ్మారే అభిషేక్
Feb 20 2023, 16:10