ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్లక్ష్యం
●RSP సిద్దిపేట జిల్లా నాయకులు గడిపే సుజిత్ ●
Street Buzz news సిద్దిపేట జిల్లా:: హుస్నాబాద్ ):- హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నిర్లక్ష్యం వల్ల పేదలకు చెందవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈరోజు డబ్బులకు ఇచ్చిన వారికి చెందుతున్నాయని RSP పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రివలేషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకుడు గడిపే సుజిత్ కుమార్ మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వార్డ్ బిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని అని చెప్పడం సిగ్గుచేటని మండి పడ్డారు. వెంటనే పేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ లను అన్నింటిని అర్హులైన పేదలకు ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల నాయకులు మధురవేణి అజయ్ ,సాయి నరేష్, దుర్ముట్ల శివ,చందు,గద్ద శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Feb 17 2023, 07:44