మండలంలో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా - మాముళ్ళ మత్తులో అధికారుల సహాకారం
ఇసుక మాఫియాకు అధికారుల అండదండలున్నాయనే అనుమానాలు
మామూళ్ల మత్తులో ఉండి.. ఇసుక మాఫియాకు అధికారుల సహకారం
సంబంధిత అధికారులకు సమాచారం అందించిన.. పట్టింపులేని ధోరణి
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
అధికారుల అండదండలతో మండలంలో చెలరేగి పోతున్న ఇసుక మాఫియా దందా మూడు పువ్వులు ఆరు కాయలు గా కొనసాగుతున్న నిమ్మకు నీరెత్తిన చందంగా మాముళ్ళ మత్తులో సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొందరు ప్రజాప్రతినిధులు అక్రమ సంపాదనే లక్ష్యంగా ఎంచుకొని మండలం చుట్టూ ఉన్న వాగుల ద్వారా ఇసుకను తరలించి ఒక రహస్య ప్రదేశంలో డంప్ చేసి.ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను విక్రయిస్తూ.లక్షలాది రూపాయల ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ.. సంబంధిత అధికారుల అండదండలు ఉండడంతో.. మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉండడం వలన ఇసుక మాఫియా కు రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తుండడం గమనార్హం. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఒక గ్రామం వాగు నుండి ఒక ప్రజా ప్రతినిధి ఏలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండానే ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం నిర్మించుకుంటున్న కట్టడానికి ఇసుకను తరలించడం పట్ల రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని పలుసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. మాకు సమాచారం ఇచ్చినట్లుగానే మిగతా శాఖలకు చెందిన అధికారులకుసమాచారం ఇవ్వాలంటూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కొందరు అధికారులు అయితే ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని మీరే పట్టుకోండి అంటూ హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Feb 16 2023, 08:12