ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు


బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(సిద్దిపేట):- ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తా,ఇందిరానగర్,భారత్ నగర్,శ్రీనగర్ కాలనీలలో సోమవారం ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతర పోరాటం చేస్తుందన్నారు.కాలనీలలోని ప్రజలకు అండగా బిజెపి కార్యకర్తలు ఉండాలని సూచించారు.కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజా దీవెనతో మెజార్టీ సీట్లలో బిజెపి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు.మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట, యువతను నిరుద్యోగ భృతి పేరిట కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.అధిక కరెంటు చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకు తింటుందని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిజెపియే ప్రత్యామ్నాయమని అన్నారు.రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ 14,15 ఫైనాన్స్ కింద కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.సిద్దిపేట అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. హరితహారం లో భాగంగా నాటిన కొనొకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా అధికారులుపట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు.హరితహారం పేరుతో అక్రమాలు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశాల్లో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఉపేందర్ రావ్,గుండ్ల జనార్ధన్, తొడుపునూరి వెంకటేశం,శ్రీనివాస్,గాడిపల్లి అరుణ రెడ్డి,బోమ్మగోని పద్మ,ఇంద్రాణి,విజయ,నీలం దినేష్ ,లక్కర్సు కృష్ణ, కేమ్మసారం సంతోష్ కుమార్,కమ్మ శ్రీనివాస్,బోగీ శ్రీనివాస్,రాగం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సిఎమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారి చొరవతో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బిజేపి మండల ఉపాద్యక్షుడు

Street Buzz news సిద్దిపేట జిల్లా:   ;(దౌల్తాబాద్):- దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం లోని మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన కే. బాబు కు మంజూరైన సి.ఎమ్.ఆర్.ఎఫ్. ₹- 24000/- వేల రూపాయల చెక్కును పంపిణీ చేసిన బిజేపి మండల ఉపాద్యక్షుడు గడ్డమీది స్వామి. అనంతరం ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లోని బలుగు బలహీన వర్గాల నిరుపేదలకు బాసరగా నిలుస్తున్న ఎమ్మెల్యే గారు నిరుపేదలు కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటే వారికి సి.ఎమ్. ఆర్.ఎఫ్ అఫ్ కింద తిరిగి ఆర్థిక సాయం అందజేయడంలో దుబ్బాక ఎమ్మెల్యే గారు ముందు ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామస్వామి గౌడ్, బూత్ అధ్యక్షులు బాబు,గ్రామ కార్యకర్తలు సంజీవరెడ్డి, స్వామి, మురళి, నవీన్, రవి, ధర్మారెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ 19 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి


ఎఐఎఫ్బి రాష్ట్ర నాయకులు అందె బీరన్న,ఎఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(చేర్యాల):- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-AIFB పార్టీ 19వ జాతీయ మహాసభల ను హైదరాబాద్ నగరంలోని సుందరయ్య కళా నిలయంలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న సందర్బంగా జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను చేర్యాల మండల పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా బృందం ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేతాజీ శుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1940 జూన్ 18 నుండి 22 వరకు నాగపూర్ లో జాతీయ మహాసభలు నిర్వహించి 'భారత ప్రజలకే సర్వాధికారాలు' అనే నినాదంతో 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 'ను రాజకీయ పార్టీగా ప్రకటించారని గుర్తు చేశారు..ఈ జాతీయ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టడంలో ఈ మహాసభలు ఉపయోగపడతాయాని వారన్నారు.ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేర్యాల మండల పట్టణ కార్యదర్శి ఒగ్గు తిరుపతి, జిల్లా నాయకులు ఆత్మకూరి హరికృష్ణ,నంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

భారాస బాహుబలి బడ్జెట్ ఇదేనా !

పి,డి,ఎస్,యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్

Street Buzz news తెలంగాణ రాష్ట్రం: 

దేశ భవిష్యత్తు నిర్మితం అయ్యేది తరగతి గదుల్లోనే అనే మాటలు తరచుగా వింటుంటాం.ఈ మాటలను సమాజ అభివృద్ధిని కాంక్షించే వారే కాదు ,అభివృద్ధి నిరోధకులు కూడా అంటుంటారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కోవలోకి వస్తున్నారు.

ఒక ఇంజనీర్ తప్పు వల్ల నిర్మాణం కూలిపోతుంది.ఒక డాక్టర్ తప్పు చేస్తే రోగి ప్రాణాలు పోతాయి.అలాగే విద్యకు సరైన బడ్జెట్ కేటాయించకుండా ,తగిన తోడ్పాటును అందించకపోతే వ్యవస్థే తారుమారు అవుతుందనేది జగమెరిగిన సత్యమే.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఈ పరిస్థితులే కళ్ళెదుట కనపడుతున్నాయనే దానికి మొన్న బడ్జెట్ లో విద్యారంగానికి నిర్ణయించిన కేటాయింపులే నిదర్శనం .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో విద్య రంగానికి 11% పైగా నిధులను కేటాయిస్తే అసెంబ్లీ సమావేశాల్లో గగ్గోలు పెట్టి, తెలంగాణ ప్రాంతములో ప్రభుత్వ విద్య వ్యవస్థను ఉన్నతీకరించాలనీ అరిచిన అసెంబ్లీ టైగర్లు నేడు తెలంగాణ స్వరాష్ట్రంలో అతి తక్కువగా 6% నిధులను కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు.సమైక్యాంధ్ర పరిపాలనలో నష్ట పోయిన ప్రతి విషయాన్ని నేడు వడ్డీతో సహా అభివృద్ధి చేసుకునే సదవకాశం తెలంగాణలో ఉన్నదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక మీటింగ్స్ లో ప్రకటించి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.ప్రభుత్వ విద్య రంగాన్ని పట్టించుకునే బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం క్రమ క్రమంగా పక్కకు తప్పుకుంటుది.ఇందులో భాగంగానే మొన్నటి రాష్ట్ర బడ్జెట్ లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాన రూ/2,90,396 కోట్లు కేటాయించి దీనిలో విద్యకు రూ/ 19,093 కోట్లు (6.57%) కేటాయించింది.మన పక్క రాష్ట్రాలైన ఢిల్లీలో విద్య రంగానికి 23% ,బీహార్ లో 18%,రాజస్థాన్ లో 17%,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 14% నిధులు కేటాయించారు.కానీ తెలంగాణ లో మాత్రం 6.7% కేటాయించి దీనిలో పాఠశాల విద్యకు రూ/16092 కోట్లు కోట్లు, ఉన్నత విద్యకు రూ/ 3001 కోట్లు కేటాయించి, ఇప్పటికే వెంటిలేషన్ పై ఉన్న విశ్వవిద్యాలయాల అభివృద్ది కొరకనీ రూ/500 కోట్లను కేటాయించారు.ఇవి విశ్వ విద్యాలయాలలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం సరిపోవు అని వాళ్లు నియమించిన వివిధ విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సలర్లే తెలుపుతున్నారు.ఒక్క ఉస్మానియ విశ్వ విద్యాలయాన్ని ప్రక్షాళన చేసేందుకే సుమారు రూ/300 కోట్లు అవసరం అవుతాయని విద్యవేత్తలు సూచిస్తున్నారు.తెలంగాణ ,పాలమూరు,మహాత్మా గాంధీ,కాకతీయ,శాతవాహన లాంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి మరింత ఖర్చు అవుతుంది .

రాష్ట్రంలో 1,002 ప్రభుత్వ గురుకులాల ఉన్నాయని వాటిలో ఐదున్నర లక్షల 59 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని అసెంబ్లీలో తెలిపిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి వాటిలో ఎన్ని గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయో,వాటిలో చదువుతున్న విద్యార్థులు ఏ విధమైన సమస్యలను ఎదుర్కుంటున్నారో, వాటి అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించాలో తెలియదా? అనే విషయాన్ని గమనించాలి.

సంక్షేమానికి పెద్దపీట వేసామని ప్రకటించుకున్న భారాస నాయకులు రాష్ట్రంలో ఉన్న సంక్షేమ వసతి గృహాల మాటే మరిచారు.ఎన్నికల్లో గెలిచిన రెండేండ్లకే ముఖ్యమంత్రి,మంత్రుల, స్పీకర్ల,మండలి చైర్మన్ జీత భత్యాలను రూ/ రెండు లక్షల 80 వేలకు అలాగే ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల జీతభత్యాలను తొంబై ఐదు వేల నుండి రెండు లక్షల 30 వేలకు పెంచుకున్న నాయకులు, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్,కాస్మొటిక్ చార్జీలను పెంచలేదు.ప్రస్తుతం మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు రూ/ 951 ,ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ/ 1050 చెల్లిస్తున్నారు.పోస్ట్ మెట్రిక్ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు రూ/ 1500 అందిస్తున్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ మెస్ చార్జీలతో చికెన్,కోడి గుడ్డు,నిత్యావసర సరుకుల కొనలేక వార్డెన్లు అప్పులు చేసి హాస్టళ్లను నెట్టుకు వస్తున్నారు.ఫలితంగా సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు పౌష్ఠిక ఆహారం మరియు సరైన మౌలిక సదుపాయాలు అందుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.అనేక హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి,కొన్నింటికిసొంత భవనాలు ఉన్నప్పటికీని శిధిలావస్థ దశకు చేరుకున్నాయి.ఫలితంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన నడమ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో సంక్షేమ హాస్టళ్ల అభివృద్ది గురించి ప్రస్తావనే లేదు. బడ్జెట్ లో విద్యకు తీవ్ర కోతలు విధించి కొండగట్టు దేవస్థాన అభివృద్ది నిమిత్తం రూ/ 100 కోట్లను కేటాయించారు.గత బడ్జెట్ లో యాదాద్రి దేవస్థాన అభివృద్ధికి రూ/ 780 కోట్లు కేటాయించి సనాతన,వైదిక ధర్మ పరిరక్షకుడిగా హిందువుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శక్తియుక్తులను ఉపయోగించారు.సమాజ అభివృద్ధికి దోహదపడే విద్య,వైద్య,వ్యవసాయ రంగాలను మినహాయించి పెట్టుబడులు తెచ్చే విషయాలన్నింటికీ అసెంబ్లీ బడ్జెట్ లో సింహా భాగాన్ని కేటాయించారు.ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన ఉపకార వేతనాలు,బోధన రుసుములు మాత్రం కోట్లల్లో పెండింగ్ లో ఉంచారు. భారాస ప్రవేశపెట్టిన సుమారు 3 లక్షల కోట్ల బాహుబలి బడ్జెట్ లో ప్రభుత్వ విద్య సంస్థలలో కనీస అవసరాలు అయిన టాయిలెట్లు ,మరుగుదొడ్లు,మంచినీటి సౌకర్యాల కల్పన ,విద్యార్థులకు సరిపడా ఫాకల్టీ కేటాయింపులు,ప్రయోగ శాలలు తదితర అంశాల ఊసే ఎత్తలేదు.మొన్నటికి మొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకర్గము సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్స్ సౌకర్యం లేక విద్యార్థినిలు రోడ్డెక్కారు.ఎక్కడ టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తోందో అని విద్యార్థులు మాత్రలు వేసుకొని తరగతులు వింటున్న దయనీయమైన స్థితి రాష్ట్రంలో దాపురించింది.

ఇవేవీ పాలకులకు పట్టవు.ఎంతసేపు ప్రభుత్వ ఖజానా నిపుకునే ధ్యాసలోనే ప్రభుత్వాలు ఉంటున్నాయి.

ఈ విధమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు.?

విద్యార్థి అమరవీరుల ఆత్మ బలిదానాల పై అందలమెక్కిన పాలకులు వారి త్యాగాలను, ఆకాంక్షలను మరిచి పూర్తి భిన్నంగా వ్యహరిస్తున్నారు.విద్యారంగానికి సంబంధించి కొఠారి కమిషన్ తో పాటు అనేక ఇతర కమిషన్లు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ లో 30% కి తగ్గకుండా నిధులను కేటాయించాలని సిఫార్సులు చేశాయి. వీటి దిశగా ప్రభుత్వము ఆలోచించాల్సిన తక్షణ బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది.పాలకులు చెప్తున్న బంగారు తెలంగాణలో విద్యార్థులు కూడా భాగమే అని గుర్తించి ,విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

వ్యాసకర్త

-ఎస్.వి.శ్రీకాంత్ (M.A,LLB)

PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సెల్:7330889605

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రభుత్వాలు ప్రైవేటుగా మారుతున్నాయి


- మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం.

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(నారాయణరావు పేట):- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా విజయవంతం కావడంతో, అదే పరంపరగా తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ & పిసిసి కలసి ప్రతి ఇంటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటికరణను నిరసిస్తూ హాత్ సే హాత్ జోడో కార్యమాన్ని నారాయణరావుపేట మండలంలోని మాల్యల గ్రామములో మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సిద్దిపేట నియోజకవర్గ నాయకులు దరిపల్లి చంద్రం, డా.సూర్యవర్మ, బొమ్మల యాదగిరి, దేవులపల్లి యాదగిరి, గంప మహేందర్ గార్లు విచ్చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి మాల్యల గ్రామంలో ప్రతి గడప గడపకి తిరుగుతూ హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని అంశాల్లో విఫలం చెందాయని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి పేదవారు బతకడమే కష్టంగా తయారయ్యిందని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను రోజుకోటి అమ్ముతూ దేశాన్ని చిన్న భిన్నం చేస్తున్నారని, ప్రజలు చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో మరింత అద్వాన్నంగా ఈ సమాజం దోపిడీకి, అన్యాయానికి గురై సామాన్యులు బతకడమే కష్టం అవుతుందని ఈ సందర్భంగా అన్నారు.అలాగే మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం మాట్లాడుతూ పేరుకే కొత్త ఈ మండలం ఏర్పాటు చేశారని, ఇంకా అనేక శాఖలు, అధికారుల నియామకాలు జరగలేదు, ఇంకా ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం మూడు మండల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని మల్యాల గ్రామంలో ఇండ్లు లేని అనేక కుటుంబాలకు ప్రభుత్వం గృహ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమముద్దీన్, మైనారిటీ నాయకులు కలీముద్దీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు చింతల రాజ్ వీర్, వివిధ మండలాల అధ్యక్షులు గణేష్, రాములు, శంకర్, భిక్షపతి, గాయస్, అజ్జు యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరి శంకర్, ఉపాధ్యక్షులు గురిజల రంగా రెడ్డి,అనిల్ కుమార్, ఎస్సి సెల్ ఏటి బాల్ రాజ్, సీనియర్ నాయకుడు బండారి ఎల్లయ్య, మాసి రెడ్డి అంజి రెడ్డి, రాచెల్లి లింగయ్య, లక్కీ రెడ్డి జనార్దన్ రెడ్డి, బోకురి అనిల్ కుమార్, మహిపాల్ రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, దొతి శ్రీనివాస్, రంగయ్య, సి ఎచ్ మల్లారెడ్డి, ఎమ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి -సమాన పనికి సమాన కూలి కల్పించాలి

సిఐటియు ఉమ్మడి కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య

                    

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(కుకునూర్ పల్లి) :- మండలకేంద్రమైన కుకునూర్ పల్లి లో ఏర్పాటు చేసినహమాలీ కార్మికుల సమావేశంలో సిఐటియు కొండపాక ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న గ్రామీణ హమాలీ కార్మికులకు ఒకే కూలీ రేటు నియమించి, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి కార్మికులకు ఎలాంటి సంక్షేమ బోర్డు లేకపోవడంతో వారికి రావలసిన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు అమలు చేయాలని, అదే మాదిరిగా సాధారణ మరణం పొందితే రెండు లక్షలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. బరువులు మోసి మోసి 40 సంవత్సరాలకే వృద్ధాప్యంలోకి నిట్టబడుతున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత హమాలీలను గుర్తించి వారికి ఈ,ఎస్,ఐ,పి,ఎఫ్ గుర్తింపు కార్డులు 50 సంవత్సరాల నిండిన ప్రతి కార్మికునికి రూ. 5000లు పెన్షన్ ఇచ్చి వారు పనిచేస్తున్న ప్రాంతాలలో సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కుకునూర్ పల్లి మండల హమాలి వర్కర్ సమావేశం లో సిఐటియు మండల నాయకులు హమాలి కార్మికులు మీసా ఐలయ్య,ముచ్చర్ల బిక్షపతి, ముచ్చర్ల రమేష్, కర్ణాకర్, అశోక్, మల్లయ్య, నర్సింలు, కనకయ్య,ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులను ఖండించండి - సిఐటియు మండల కార్యదర్శి

            

అమ్ముల బాల్ నర్సయ్య సిఐటియు మండల కార్యదర్శి.                                      

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(కొండపాక) :- అక్రమ అరెస్ట్ లను ఖండించాలంటూ సిఐటియు మండల కార్యధర్శి అమ్ముల బాల్ నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ  ఇండ్లు,ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య అనిమండిపడ్డారు.రాష్ట్రంలో నిరసన తెలియజేసే హక్కు లేకుండా చూస్తున్నారని అన్నారు.ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తుంటే రాత్రికి రాత్రి వచ్చి అత్యుత్సాహంతో అరెస్టు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. పోరాటాలను అణచివేయాలని చూడడము మంచిది కాదన్నారు. ఎంత ఆనచాలని చూస్తే అంత పోరాటాలు లేస్తాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన పేదలందరికీ తమ తమ గ్రామాలలో డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని,స్థలముండిఇల్లునిర్మించుకుందామనుకునే అర్హులకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.

సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నియామాకాల్లో ప్రలోభాలకు లోను కావద్దు


- అభ్యర్థులకు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపిఎస్ హితవు

Street Buzz news కృష్ణా జిల్లా:

ప్రస్తుతం జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ నియామకాల్లో ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకూడదనీ, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి.జాషువా ఐపిఎస్ అధికారి తెలియచేసారు. ఏ విధమైన సిఫారసులు ఒత్తిడులూ, ఆర్ధికపరమైన అవనియామకకతవకలకు తావు లేకుండా నియామకం ఖచ్చితంగా జరుగుతుంది అని, అభ్యర్థులను ఎవరైనా రికమండేషన్లు, లంచం ద్వారా నియామకం ఇప్పిస్తామంటూ సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. రాతపరీక్షలకు సిలబస్ కు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలనీ, దేహదారుఢ్య పరీక్షలకు కూడా తగురీతిన ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సంపొదించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలనీ సూచించారు. ఏధమైనదళారీలు , ఇతర శక్తుల ప్రమేయం లేకుండా నియామకం జరిగుతుంది. కావున, ఎవరైనా అభ్యర్ధులను ప్రలోభాలకు గురి చేయుటకు ప్రయత్నించినచో సదరు విషయాన్ని పోలీసువారి దృష్టికి తక్షణమే తీసుకురావాలని సూచించారు.  ఇటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతూ, సదరు మోసగాళ్ళపై చట్టటరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ నిధులు వెంటనే విడుధల చేయాలంటూ ఏఐటియూసి ధర్నా


- ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్

సిద్దిపేట కార్మిక శాఖ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(సిద్దిపేట):- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట సహాయ కార్మిక శాఖ కార్యాలయం ముందు గంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణం, సహజ మరణం, మెటర్నిటి, మ్యారేజి బెనిపెట్లు, ఇతర పెండింగ్ క్లెయిమ్స్ 2018 నుండి 2023 జనవరి 31 వరకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల అడ్డాల వద్ద అన్ని వసతులతో షెడ్లు కట్టించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ.5వేల పించను ఇవ్వడంతో పాటు, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించి క్లెయిమ్స్ నిదులు విడుదల చేయాలని, చిన్న చిన్న పొరపాట్లు సరిచేసే అధికారం నోడల్ ఆఫీసర్ కు ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 10 లక్షలు, సహజ మరణానికిరూ.5 లక్షలు, పెండ్లి కానుకకు రూ.1 లక్ష, మెటర్నిటీ రూ.50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులకు స్కాలర్ షీప్ లు అందించాలన్నారు. నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్స్ ధరలను నియంత్రించాలని,కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులను సలహా బోర్డులో నియమించాలని, ఈ శ్రమ్ పోర్టల్లో కూడ భవన నిర్మాణ కార్మికులను నమోదు చేయించాలన్నారు. సకాలంలో రెన్యువల్ చేసుకోని వారికి ఆరు నెలల పాటు అనుమతించాలని,నూతనంగా బోర్డులో పేర్లు నమోదు చేసుకునే భవన నిర్మాణ కార్మికులకు రేషన్ కార్డులు జత చేయాలన్న నిబంధనను, కార్మికులు క్లెయిమ్స్ చేసుకున్న సందర్భంలో రేషన్ కార్డు నిబంధనను తొలగించాలన్నారు. జిల్లాలోని నోడల్ ఆఫీసర్, ఏ.ఎల్.ఓ ల పనివిధానం వల్ల కార్మికులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పరిష్కరించాలని

లేని పక్షంలో కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్, జిల్లా నాయకులు ఈరి భూమయ్య, గజ్జల సురేందర్, తిగుళ్ల కనకయ్య, ఒరుసు అనిల్, మోడీ చంద్రయ్య, లక్ష్మీ, అనంత, రాజయ్య, లింగం, రాములు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో ప్రతి ముదిరాజ్ యువత ముందుకు రావాలి

మత్స్యకార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ నియోజకవర్గం) :- మంగోల్ గ్రామంలో ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి భాను కుమార్ ముదిరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగోల్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన మత్స్య సహకార సంఘం సభ్యత్వానికి అందరు కలిసి వినియోగించుకోవాలని కోరారు.మత్స్యకారులకి ప్రభుత్వం అండగా నిలిచింది అన్నారు. గ్రామంలో ముదిరాజ్ కుటుంబమే అత్యధిక ఓట్లు ఉన్నవాళ్లు అని తెలిపారు. ప్రతి ముదిరాజ్ బిడ్డ గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. రాజకీయాల్లో ప్రతి ముదిరాజ్ యువత ముందుకి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో మంగోల్ ముదిరాజ్ సంఘం పెద్దలు మరియు యువత పాల్గొన్నారు.