మండలంలో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా - మాముళ్ళ మత్తులో అధికారుల సహాకారం


 ఇసుక మాఫియాకు అధికారుల అండదండలున్నాయనే అనుమానాలు

 మామూళ్ల మత్తులో ఉండి.. ఇసుక మాఫియాకు అధికారుల సహకారం

 సంబంధిత అధికారులకు సమాచారం అందించిన.. పట్టింపులేని ధోరణి

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

అధికారుల అండదండలతో మండలంలో చెలరేగి పోతున్న ఇసుక మాఫియా దందా మూడు పువ్వులు ఆరు కాయలు గా కొనసాగుతున్న నిమ్మకు నీరెత్తిన చందంగా మాముళ్ళ మత్తులో సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొందరు ప్రజాప్రతినిధులు అక్రమ సంపాదనే లక్ష్యంగా ఎంచుకొని మండలం చుట్టూ ఉన్న వాగుల ద్వారా ఇసుకను తరలించి ఒక రహస్య ప్రదేశంలో డంప్ చేసి.ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను విక్రయిస్తూ.లక్షలాది రూపాయల ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారని  ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ.. సంబంధిత అధికారుల అండదండలు ఉండడంతో.. మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉండడం వలన ఇసుక మాఫియా కు రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తుండడం గమనార్హం. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఒక గ్రామం వాగు నుండి ఒక ప్రజా ప్రతినిధి ఏలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండానే ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం నిర్మించుకుంటున్న కట్టడానికి ఇసుకను తరలించడం పట్ల రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని పలుసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. మాకు సమాచారం ఇచ్చినట్లుగానే మిగతా శాఖలకు చెందిన అధికారులకుసమాచారం ఇవ్వాలంటూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కొందరు అధికారులు అయితే ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని మీరే పట్టుకోండి అంటూ హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంబేద్కర్ జయంతి, వర్దంతి రోజున సెలవు దినం గా ప్రకటించి అధికారికంగా కార్యాక్రమాలు నిర్వహించాలి

  

 Street Buzz news సూర్యాపేట జిల్లా:  

(హుజూర్ నగర్ ):- హుజూర్ నగర్ పట్టణం లో అంబేద్కర్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్ మాట్లాడుతూ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దేశం కోసం అహర్నిశలు కృషిచేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కుల రహిత బేదాలు లేకుండా స్త్రీలు పురుషులు అందరూ సమానులే అని ప్రజాస్వామ్యంలో ప్రతి పేదవాడు చదువుకోవాలని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ప్రతి విషయంలో ఎంతో క్షుణ్ణంగా భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు.మరి ఇలాంటి గొప్ప మహనీయుడి వర్ధంతి, జయంతి వేడుకలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సెలవు దినముగా ప్రకటించి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని అదేవిధంగా మద్యం షాపులు మటన్ షాపులకు సెలవు ప్రకటించాలని ప్రతి ఆఫీసుల్లో అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకొని వారి చిత్రపటానికి వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని హుజూర్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోలపూడి యోహాన్ అన్నారు.

విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యా కేసు నమోదు చేయాలి


కార్పోరేటు విద్యాసంస్థలలో వరుస ఆత్మహత్యల పై న్యాయ విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ బి రాష్ట్ర ప్రధానాకార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి.

Street Buzz news కరీంనగర్ జిల్లా:

(కరీంనగర్ ):- హైదరాబాద్ లోని కార్పోరేటు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మ హత్య కు కారుకులైన శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యాకేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా స్టుడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధానాకార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ మార్కులు, ర్యాంకుల కోసం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం విధ్యార్థులను తీవ్ర ఓత్తిడి కి గురిచేస్తూ ఫలితాలే లక్ష్యంగా మానసిక వేదనకు గురిచేయడం బాదాకరం అని అన్నారు. కార్పోరేట్ కాళాశాలలో వారి లాభం కోసం తప్ప విద్యార్థి సంక్షేమం కోసం పట్టించుకోకుండ వ్యవహరిస్తున్నారని శ్రీ చైతన్య విద్యాసంస్థలో ఇది మొదటి ఆత్మహత్య కాదని, ఇలా ప్రతి సంవత్సరం ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసేంతవరకు ఏఐఎస్ బి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం అని హెచ్చరించారు ఈ ఘటనకు కారుకులైన వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేట్ విద్యాసంస్థలలో విద్యార్థులు మానసికా వేదనకు గురికాకుండా ఉండేందుకు ఆవగాహన సదస్సును నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐఎస్ బి నాయకులు రమేష్ యాదవ్, హరీష్,వినయ్, విజయ్,వాసు తదితరులు పాల్గోన్నారు.

బిఆర్ఎస్ ను ఓడిస్తాం - రామరాజ్యాం స్థాపిస్తాం


 తెలంగాణలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారుతున్నారు

 కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుంది

 అన్ని పార్టీలు కలిసి బిజెపిని ఓడించే కుట్ర

 ధరణి పేరుతో నలుగురు కలెక్టర్ల దోపిడీ

 కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్న కలెక్టర్ల బండారం బయటపెడతాం

 బూత్ కార్నర్ల మీటింగులతో చరిత్ర సృష్టిస్తాం

 బిజెపిని సునాయాసంగా అధికారంలోకి తీసుకొస్తాం: చెవ్వ శేషగిరి యాదవ్

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

 ;( మొగుళ్జళపల్లి):- హిందుత్వ వాతావరణం వచ్చిందని..80 శాతం ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నారని.. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం కుట్రలు చేస్తున్నారని అయినప్పటికీ వెనుకంజ వేయకుండా బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసి గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలతో రామరాజ్యాన్ని సాధించి తీరుతామని బిజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు చెవ్వ శేషగిరి యాదవ్ అన్నారు. మంగళవారం శేషగిరి యాదవ్ మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగోలుగా సంపాదించి కేసీఆర్ కుటుంబానికి దోచిపెడుతున్నారని, అందుకు ప్రతిఫలంగా ప్రమోషన్లు పొందుతున్నారని శేషగిరి యాదవ్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో నిర్వహిస్తున్న బూత్ కార్నర్ల మీటింగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి చరిత్ర సృష్టించబోతుందని, రాష్ట్రంలో సునాయాసంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పుల్వామా అమరుల త్యాగాలను దేశం ఎన్నటికి మరువదు

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు జోహార్లు.

- యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి.

Street Buzz news పెద్దపల్లి జిల్లా:

( గోదావరిఖని  ఫిబ్రవరి14 ):- పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి ఘనంగ నివాళులు అర్పించారు. 14 ఫిబ్రవరి 2019న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్‌పై జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లేథాపోరా వద్ద వాహనంలో వచ్చిన ఆత్మాహుతి దాడిచేశారు అని అన్నారు. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు అని తెలిపారు. పుల్వామా ఘటన జరిగి నేటికి నాలుగు యేళ్లు అయిన సందర్బంగా దేశసేవలో వీరమరణం పొందిన వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాలను దేశం ఎన్నటికి మరువదని వారి శౌర్యమే నేటి భారతయువతకు స్పూర్తిదాయకం అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి అన్నారు.
మండలి డిప్యూటీ చైర్మన్ ను కలసి శుభాకాంక్షలు తెలిపిన ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Street Buzz news హైదరాబాద్ : 

(హైదరాబాద్ ):- రాష్ట్ర ముదిరాజ్ యువ నాయకుడు తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి భాను కుమార్ సోమవారం ముదిరాజ్ మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారిని వారి ఇంట్లో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులకు సముచిత గౌరవం ఇస్తున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రవంగా ఎన్నికైన బండ ప్రకాష్ గారికి అభినందనలు తెలియజేశారు. ముదిరాజులకు సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో భాను కుమార్ ముదిరాజ్ గారి బృందం పాల్గొన్నారు.

అదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

అదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలంటూ ఎస్,బీ,ఐ బ్యాంక్ ముందు ధర్నా చేస్తున్ సిపిఐ నాయకులు

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(చేర్యాల):- ఆదాని స్టాక్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని కోరుతూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ఎస్ బీఐ బ్యాంకు ముందు సిపిఐ ఆధ్వర్యంలో గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడీబీ చీఫ్ మేనేజర్ రాంబాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ భారతదేశ కుబేరులైన అదాని స్టాక్స్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించి కుంభకోణాన్ని వేలికి తీసి ఆ డబ్బును పేద ప్రజలకు డబ్బులు పంపిణీ చేయాలని, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకులకు ఎగవేత చేసిన అదాని, అంబానీ, విజయ్ మాల్యా, లాంటి బడా పెట్టుబడిదారులకు అప్పులు మాఫీ చేశారే తప్ప పేద ప్రజల రుణాలు మాఫీ మాత్రం చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ దేశ సంపన్నులైన అదాని స్టాక్స్ కుంభకోణంపై పార్లమెంటరీ జెయింట్ కమిటీ ద్వారా విచారణ జరిపించి కుంభకోణాన్ని వెంటనే వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గూడెపు సుదర్శన్, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పొన్నబోయిన మమత, ఈరి సత్యవ్వ, ముస్త్యాల శంకరయ్య, ఎండీ. షాదుల్ల, శెట్టె అయిలయ్య,పల్లా సీతారామయ్య, ఇరుమల్ల రాజు, కె. నర్సయ్య, బట్ రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు


బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(సిద్దిపేట):- ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తా,ఇందిరానగర్,భారత్ నగర్,శ్రీనగర్ కాలనీలలో సోమవారం ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతర పోరాటం చేస్తుందన్నారు.కాలనీలలోని ప్రజలకు అండగా బిజెపి కార్యకర్తలు ఉండాలని సూచించారు.కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజా దీవెనతో మెజార్టీ సీట్లలో బిజెపి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు.మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట, యువతను నిరుద్యోగ భృతి పేరిట కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.అధిక కరెంటు చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకు తింటుందని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిజెపియే ప్రత్యామ్నాయమని అన్నారు.రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ 14,15 ఫైనాన్స్ కింద కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.సిద్దిపేట అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. హరితహారం లో భాగంగా నాటిన కొనొకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా అధికారులుపట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు.హరితహారం పేరుతో అక్రమాలు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశాల్లో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఉపేందర్ రావ్,గుండ్ల జనార్ధన్, తొడుపునూరి వెంకటేశం,శ్రీనివాస్,గాడిపల్లి అరుణ రెడ్డి,బోమ్మగోని పద్మ,ఇంద్రాణి,విజయ,నీలం దినేష్ ,లక్కర్సు కృష్ణ, కేమ్మసారం సంతోష్ కుమార్,కమ్మ శ్రీనివాస్,బోగీ శ్రీనివాస్,రాగం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సిఎమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారి చొరవతో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బిజేపి మండల ఉపాద్యక్షుడు

Street Buzz news సిద్దిపేట జిల్లా:   ;(దౌల్తాబాద్):- దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం లోని మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన కే. బాబు కు మంజూరైన సి.ఎమ్.ఆర్.ఎఫ్. ₹- 24000/- వేల రూపాయల చెక్కును పంపిణీ చేసిన బిజేపి మండల ఉపాద్యక్షుడు గడ్డమీది స్వామి. అనంతరం ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లోని బలుగు బలహీన వర్గాల నిరుపేదలకు బాసరగా నిలుస్తున్న ఎమ్మెల్యే గారు నిరుపేదలు కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటే వారికి సి.ఎమ్. ఆర్.ఎఫ్ అఫ్ కింద తిరిగి ఆర్థిక సాయం అందజేయడంలో దుబ్బాక ఎమ్మెల్యే గారు ముందు ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామస్వామి గౌడ్, బూత్ అధ్యక్షులు బాబు,గ్రామ కార్యకర్తలు సంజీవరెడ్డి, స్వామి, మురళి, నవీన్, రవి, ధర్మారెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ 19 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి


ఎఐఎఫ్బి రాష్ట్ర నాయకులు అందె బీరన్న,ఎఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(చేర్యాల):- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-AIFB పార్టీ 19వ జాతీయ మహాసభల ను హైదరాబాద్ నగరంలోని సుందరయ్య కళా నిలయంలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న సందర్బంగా జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను చేర్యాల మండల పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా బృందం ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేతాజీ శుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1940 జూన్ 18 నుండి 22 వరకు నాగపూర్ లో జాతీయ మహాసభలు నిర్వహించి 'భారత ప్రజలకే సర్వాధికారాలు' అనే నినాదంతో 'ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 'ను రాజకీయ పార్టీగా ప్రకటించారని గుర్తు చేశారు..ఈ జాతీయ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టడంలో ఈ మహాసభలు ఉపయోగపడతాయాని వారన్నారు.ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేర్యాల మండల పట్టణ కార్యదర్శి ఒగ్గు తిరుపతి, జిల్లా నాయకులు ఆత్మకూరి హరికృష్ణ,నంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.