Formula-E Race: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత ఎవరంటే?
హైదరాబాద్: నెక్లెస్ రోడ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్ ముగిసింది..
భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్‌నే(డీఎస్ పెన్‌స్కే రేసింగ్) నిలిచాడు.
ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ(ఎన్‌విజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్‌విజన్ రేసింగ్) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించడు..
Feb 11 2023, 18:45