పార్టీ బలోపేతం దిశగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సమావేశం
•నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా కార్యదర్శి చిట్యాల మండల ఇంచార్జ్ వేదాంతం గోపీనాథ్ గారు మరియు బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొన్నారు.
ఈ బూత్ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి గోపీనాథ్ గారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మనదేశంలో ఎంత చిన్న గ్రామమైన పట్టణాలకు చిట్టచివరిలో ఉన్న ప్రతి చిన్న గ్రామాలను కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలు కిందిస్థాయి వరకు అందే విధంగా నరేంద్ర మోడీ గారు పథకాలను ప్రవేశపెట్టారు.
ఇట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలాగా ప్రతి బిజెపి కార్యకర్త ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారికి ఏ రకమైన పథకాలు అందుతున్నాయి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సవివరంగా తెలియపరచి వారికి అందే విధంగా చూడాలని చెప్పారు. వేంబాయి గ్రామంలో బిజెపి బూత్ కమిటీ ని ఏర్పాటు చేసుకొని పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని తెలంగాణలో రానున్నది
బిజెపి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఉయ్యాల ప్రశాంత్ గౌడ్, పామనగుండ్ల వెంకన్న గౌడ్, గురిజ వెంకన్న గౌడ్, కొంపెల్లి శివ, సిద్ధగోని అశోక్, గుండు లింగస్వామి, పంతంగి బిక్షం, లింగస్వామి గౌడ్, చింతకాయల రాము, పవన్, పాలకూరి వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2023, 18:47