రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా విస్మరించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా విస్మరించిన ప్రభుత్వం - గిద్దె రాజేష్
Street Buzz news సూర్యాపేట జిల్లా:
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం 10000 వేల కోట్లతో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాల్సిన ఆర్థిక మంత్రి హరీష్ రావు పైసా ఇవ్వకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరించారు వెంటనే ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సవరించి 10000 కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం కృష్ణానగర్ గ్రామంలో సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావులు తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న 30 లక్షల మంది వికలాంగుల సంక్షేమానికి 10000 కోట్లతో నిధులు కేటాయించాల్సిన ఉన్న పైసా కూడ ఇవ్వకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరించారనీ వెంటనే ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి 10000 కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనీ 2,90,396 వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ప్రతిపాదించిందింన ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో 2016 RPD చట్టం ప్రకారం 5 శాతం నిధులు అంటే 10,584.25 కోట్లు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా వికలాంగుల సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో విస్మరించిందని రాష్ట్రంలో 44.12 లక్షల మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆసరా పింఛన్లకు 12,000 కోట్లు కేటాయించిందనీ ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య పెంచిన ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్లో నిధులను ఎందుకు ఇవ్వలేదని బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వికలాంగుల సంక్షేమం కోసం మాత్రం పైసా కేటాయించలేదని రాష్ట్రంలో వికలాంగుల వివాహ ప్రోత్సాహకం స్వయం ఉపాధి రుణాలు పరికరాల కోసం ఎదురుచూస్తున్న వికలాంగుల సమాజానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదో మంత్రి హరీష్ రావు స్వష్టం చేయాలని రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న 30 లక్షల మంది వికలాంగుల సంక్షేమానికి దళిత బంధు తరహాలోని ప్రతి వికలాంగుడికి 15 లక్షల రూపాయలతో వికలాంగుల బందు పథకాన్ని ప్రవేశపెట్టాలని పోరాటాలు చేస్తున్న వికలాంగుల సమాజానికి మంత్రి ఏం సమాధానం చెప్తారో చెప్పాలనీ తను ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించి మంత్రి హరీష్ రావు పదివేల కోట్లతో వికలాంగుల బందు లాంటి పథకాలకు నిధులు కేటాయించాలని లేకుంటే మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గమైన సిద్దిపేట గడ్డ నుంచే వికలాంగుల సమాజం సింహగర్జనకు సిద్ధమవుతుందని మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా మారాలని తాపత్రయపడుతున్నట్లు ప్రస్తుతం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చెప్తుందని అందుకే వికలాంగుల సంక్షేమ శాఖకు బడ్జెట్లో ఆయన నిధులు కేటాయించలేదన్నట్లు తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నేడు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ సిద్దిపేటలో ఆయన పతనానికి పునాదులు వేసినట్లు ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తగరం రాంబాబు స్వాతి మనస్వి తగరం గౌతమ్ ఊరుకొండ శరణ్య వాసంశెట్టి నవదీప్ మేడిపల్లి సరోజిని తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2023, 10:06