పాలమూరు పై ప్రగల్భాలు తప్పా పైసా లేదు
•కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరుపై లేదు
•కిసాన్ కాంగ్రెస్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి
రాష్ట అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో దక్షిణ తెలంగాణ అయినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తూ పాలమూరు - రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల నీరందించే ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదని చల్లా శ్రీకాంత్ రెడ్డి మండి పడ్డారు.
జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులయిన కోయిల్ సాగర్, నెట్టెంపాడు, జూరాల, ఆర్టీఎస్. కల్వకుర్తి, రాజీవ్ భీమా ఎత్తిపోతలకు సైతం బడ్జెట్ లో అరకొరగా కేటాయించారు. ఈ బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా నిర్మాణం పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ పై వివక్షత చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,ఆశిస్తున్నా స్థాయిలో నిధులు విడుదల చేయాలేదు. పాలమూరు ప్రాజెక్టును ఉద్దరిస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రాజెక్టులలో తుమ్మలు మొలుస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం పనులను పూర్తి చేసినా..మిగిలిన 20 శాతం పనులను కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు. కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు పై లేక పోవడంతోనే రైతులకు నష్టం జరుగుతుంది.
జిల్లాకు నిధులు కేటాయింపులో కొసరి కొసరి విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్నప్పటికి ఆయకట్టు రైతుల జీవితాలు బీడు పొలంలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ దారులు సతమతమవుతున్నా రు.
ఇప్పటికీ తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టినా నేటికీ మహబూబ్ నగర్, రంగా రెడ్డి జిల్లాకు తీరని నష్టమే చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి పాలమూరు ప్రాజెక్టు కు కేంద్రం జాతీయ హోదా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు మాయ,మోసపు మాటలు చెప్పుతూన్నాయి. ఈ బడ్జెట్ పేద, రైతు, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా అసంతృప్తికి, నిరుత్సాహానికి గురి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశారు.
Feb 07 2023, 17:11