Pawan Kalyan: సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పవన్..
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక శుభాకాంక్షలు (Special Greetings) చెప్పారు..
ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్ (Tweet) చేశారు. అప్పులతో 'ఆంధ్ర (Andhra)' పేరు మారుమోగిస్తున్నందుకు... సీఎం జగన్‌కు 'నా ప్రత్యేక శుభకాంక్షలు .. keep it up' అంటూ వ్యంగంగా అభినందనలు తెలిపారు. ''మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోవద్దు.. రాష్ట్ర సంపద, ప్రగతి 'కుక్కల'కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు.. ఎప్పటికీ అవే స్పూర్తి.. సీఎం అప్పు రత్నా'' అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై కొంత కాలంగా విమర్శల వేడి పెంచారు. సోషల్ మీడియా (Social Media), ట్వీట్ల (Tweets) ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గత తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు అంటూ పవన్ తన ట్వీట్‌లో జగన్ ప్రభుత్వంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ ఎక్కడా ఏ సభలోనైనా ప్రసంగించినప్పుడు పవన్ పేరును ప్రస్తావించకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్ళలు చేస్తారు. అలాగే పవన్ సోషల మీడియా వేదికగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తారు. అందులో భాగంగానే ఇవాళ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్‌పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Feb 07 2023, 16:07