నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కళాశాలను వెంటనే సీజ్ చేయాలి
•లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం
•PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు: మల్లెల ప్రసాద్
నారాయణ విద్యాసంస్థల వేధింపులకు మరో విద్యార్థినీ బలాన్మరనానికి పాల్పడడం జరిగింది. అనంతపురం జిల్లా సమీపంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆ కళాశాలపై నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది,
దీనిపై ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గం లో పి డి ఎస్ యు విద్యార్థి సంఘo ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిడిఎస్యు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలలో ప్రతి ఏడాది ఫీజుల ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, దీనిపై అనేక సంఘాల పలుమార్లు విద్యాధికారులను హెచ్చరించిన
నారాయణ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల రాత్రి కూడా అదేవిధంగా నారాయణ కళాశాలల పై నుంచి దూకి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది, ఇలాంటి ఇంకొకసారి పునరావృతం కాకుండా వెంటనే దీనికి కారకులైనటువంటి నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు: మల్లెల ప్రసాద్. కనేకల్ మండలం అధ్యక్షుడు: శ్యాం ప్రసాద్ సుమంత్ పాల్గొన్నారు.
Feb 07 2023, 15:46