పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కులలో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలి
•PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కుల లో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలని మీడియా సమావేశం లో PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయదుర్గం డివిజన్ కార్యదర్శి:మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ* ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టంలోని రాయలసీమ హక్కుగా వచ్చినటువంటి అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి 2016 నవంబర్ లో డీపీర్ లో చెప్పిన విదంగా తక్షణ కర్తవ్యం గా మొత్తం 902 కోట్లకు పైగా నిధులను కేటాయింపు అవసరమని ఈ నిధులను దశల వారీగా కేటాయిస్తామని డీపీర్ ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామం దగ్గర రైతుల నుంచి 495 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. ఇందులో నూతన భవనాలను నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రహరీ గోడల నిర్మించడానికి 9 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు దానిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు.
కనుక, రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో నూతన భవనాలను నిర్మించుటకు బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు యూనివర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి చదువు కొరకు వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.నిజానికి,టీచింగ్ స్టాప్ 49 మంది,నాన్ టీచింగ్ స్టాప్ 51 మంది అవసరం ఉన్నా ఇంతవరకు భర్తీ చేయలేదు.2016 నవంబర్ కేంద్రం సమర్పించిన డీపీర్ లో చెప్పిన విధంగా 2023 కంతా పూర్తిగా భవనాలు నిర్మించి, నూతన భవనాల్లో అడ్మిషన్లు చేపట్టి, బోధన తరగతులు ప్రారంభం అవ్వాలి.
కానీ, ఇప్పటి వరకు అసలు రెగ్యులర్ రిజిస్టార్ ని కూడా నియమించ లేదంటే రాయలసీమ పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కనుక, పి డి ఎస్ యు,గా ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కండస్తున్నాము, రానున్న కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి నూతన భవనాన్ని పూర్తి చేయాలి, పూర్తిస్థాయిలో స్టాప్ ని రిక్రూట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము నిధులు కేటాయింపు జరగనియెడల కచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకొని , PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అనీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.
Feb 07 2023, 14:13