భూపాలపల్లి గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం- కీర్తి రెడ్డి
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
(మొగుళ్ళపల్లి):- రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డమీద కాషాయ జెండా ఎగరబోతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి చందుపట్ల కీర్తి - సత్యపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ మొగుళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు చేవ్వ శేషగిరి యాదవ్ అధ్యక్షతన జరిగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి- సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో బిజెపి బూతు స్థాయిలోని కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేసి భూపాలపల్లి లో బిజెపి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు కార్నర్ మీటింగ్ లో ప్రజా క్షేత్రంలో ఎండ గట్టెందుకు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ చేయాలని, అర్హులైనటువంటి నిరుపేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని, ఇంటికి ఒకరి కాకుండా అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వాలని, పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని, దళితులకు ఇచ్చినటువంటి దళిత బందును రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి, బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, పర్లపల్లి ఎంపీటీసీ దొంగల రాజయ్య, జిల్లా కార్యదర్శి అన్నం శ్రీనివాస్, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు బండారి రవీందర్, జిల్లా నాయకులు పులి రత్నాకర్ రెడ్డి, మునిగంటి మల్లారెడ్డి, నాంపల్లి చంద్రమోహన్, తూముల సురేష్, వడిజ ధనేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శలు మోరే వేణుగోపాల్ రెడ్డి, బండారి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు పోతుగంటి సాయిలు, పెండ్లి మల్లారెడ్డి, బల్గూరి కిషన్ రావు, పిఎసిఎస్ డైరెక్టర్ తిరుపతిరావు, మండల కార్యదర్శి తేప్పరాజు కిసాన్మోర్చ మండల అధ్యక్షుడు అన్నం దేవేందర్ రెడ్డి,బీ జే వై ఎం మండలాధ్యక్షుడు బత్తిని శ్రీధర్ గౌడ్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు వంగ రవి, మండల నాయకులు వైనాల ప్రియాంక, శివకుమార్, మామునూరి నర్సయ్య, కక్కర్ల వీరన్న, పులి కోమల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, యారాసందీప్, మంద రమణారెడ్డి, ఎలిగేటి తిరుపతి, శ్రీ పెళ్లి రమేష్, బైరగోని మధుకర్, రవి, రేలా హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.
Feb 07 2023, 08:18