4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ ప్రారంభించిన ఈ మెుబిలిటీ వీక్‌లో భాగంగా జరిగిన ఈవీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ మేరకు రంగారెడ్డిలోని మోమిన్‌పేట్ మండలం ఎంకతాలలో మెుబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
మెుబిలిటీ వ్యాలీ ప్రారంభించిన అనంతరం సుస్థిరతపై పలు చర్చా కార్యక్రమాల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మెుబిలిటీ సదస్సులో భాగంగా బాష్ వంటి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈవీ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్ ఉన్నాయని.. త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లస్టర్స్ ఏర్పాటుకు పిలుపునిస్తామని చెప్పారు. రాష్ట్రంలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలకు ఎంతో మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు.









అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, పలువురు నాయకులు...

Feb 06 2023, 21:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.8k