4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ ప్రారంభించిన ఈ మెుబిలిటీ వీక్‌లో భాగంగా జరిగిన ఈవీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ మేరకు రంగారెడ్డిలోని మోమిన్‌పేట్‌ మండలం ఎంకతాలలో మెుబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. కార్యక్రమంలో ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

మెుబిలిటీ వ్యాలీ ప్రారంభించిన అనంతరం సుస్థిరతపై పలు చర్చా కార్యక్రమాల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మెుబిలిటీ సదస్సులో భాగంగా బాష్‌ వంటి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈవీ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్ ఉన్నాయని.. త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లస్టర్స్ ఏర్పాటుకు పిలుపునిస్తామని చెప్పారు. రాష్ట్రంలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలకు ఎంతో మద్దతు ఇస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.

అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే (Manikrao Thakre) ఆహ్వానం మేరకే ఆయన్ను కలిశానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. ఠాక్రేతోపాటు తాను కూడా హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు ఆహ్వానిస్తామని చెప్పారు. పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు.

ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేయాలంటూ కొందరు ఆహ్వానిస్తున్నారని, అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని రేణుకా చౌదరి అన్నారు.

ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయండి

అనంతపురం జిల్లా స్పందనలో జిల్లా కలెక్టర్ ను కోరిన సాకే హరి

అనేక ఏళ్లుగా భర్తీకి నోచుకోని ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి జే,ఏ,సీ అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

అనంతరం సాకే హరి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్య కారణంగా మరుగున పడ్డాయన్నారు.ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారాని ఎదురుచూస్తున్నారని వాపోయారు.సుప్రీమ్ కోర్టు సైతం భర్తీ చేయాలని లేదంటే సరైన వివరణ ఇవ్వని వారిపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ద్వార 10వేలు పైచిలుకు ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.పాలనే ముగుస్తున్న పట్టించుకోలేదన్నారు.

అడిగిన వారిని అరెస్టులు,కేసులతో భయపెడుతున్నారు. ముఖ్యంగా విశ్వ విద్యాలయాల్లో పేరుకుపోయిన బ్యాక్ లాగ్ పోస్టులు అధికారుల కుట్రలతోనే అగాయని,ఎస్సీ,ఎస్టీలకు ఉద్యోగాలు వస్తే అభివృద్ధి చెందుతారనే కక్ష కట్టి సాధిస్తున్నారు.ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ రంగాల్లో ఖాళీగున్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ బాధితులను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జే,ఏ,సీ నాయకులు మన్నల శివయ్య.రేకల కుంట రామాంజనేయులు.ముత్యాలమ్మ.రామకృష్ణ.గణేష్ నాయక్.కొర్రపాడు నాగేంద్ర.చెన్న కేశవ.కందుకూరు రాము.గోపాల్ పాల్గొన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కులలో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలి

•PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కుల లో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలని మీడియా సమావేశం లో PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయదుర్గం డివిజన్ కార్యదర్శి:మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ* ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టంలోని రాయలసీమ హక్కుగా వచ్చినటువంటి అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి 2016 నవంబర్ లో డీపీర్ లో చెప్పిన విదంగా తక్షణ కర్తవ్యం గా మొత్తం 902 కోట్లకు పైగా నిధులను కేటాయింపు అవసరమని ఈ నిధులను దశల వారీగా కేటాయిస్తామని డీపీర్ ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామం దగ్గర రైతుల నుంచి 495 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. ఇందులో నూతన భవనాలను నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రహరీ గోడల నిర్మించడానికి 9 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు దానిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు.

కనుక, రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో నూతన భవనాలను నిర్మించుటకు బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు యూనివర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి చదువు కొరకు వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.నిజానికి,టీచింగ్ స్టాప్ 49 మంది,నాన్ టీచింగ్ స్టాప్ 51 మంది అవసరం ఉన్నా ఇంతవరకు భర్తీ చేయలేదు.2016 నవంబర్ కేంద్రం సమర్పించిన డీపీర్ లో చెప్పిన విధంగా 2023 కంతా పూర్తిగా భవనాలు నిర్మించి, నూతన భవనాల్లో అడ్మిషన్లు చేపట్టి, బోధన తరగతులు ప్రారంభం అవ్వాలి.

కానీ, ఇప్పటి వరకు అసలు రెగ్యులర్ రిజిస్టార్ ని కూడా నియమించ లేదంటే రాయలసీమ పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కనుక, పి డి ఎస్ యు,గా ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కండస్తున్నాము, రానున్న కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి నూతన భవనాన్ని పూర్తి చేయాలి, పూర్తిస్థాయిలో స్టాప్ ని రిక్రూట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము నిధులు కేటాయింపు జరగనియెడల కచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకొని , PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అనీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మంత్రి హరీష్ రావు పని తీరు

•ఏ.ఐ.పి.ఎస్.యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్

ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం లో గల ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘము ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ గారు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి ఫొటోస్ దిగగానే సరిపోదని, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషంట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు.

నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో 66%మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేకపోతే మీరు అసెంబ్లీ లో చెప్పుకోవడానికి ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారో ప్రజలకు తెలియ జేయాలనీ ఆయన అన్నారు. మీకు కనుక దమ్ముంటే నాతో ఒక్కసారి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి రండి నేను అక్కడ జరుగుతున్న అన్యాయం ని చూపిస్తానని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ గారు మంత్రి హరీష్ రావు గారిపై సవాల్ విసరడం జరిగింది. మీకు పేద ప్రజల పై సవతి తల్లి ప్రేమ ఉందని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు కానీ, సిద్దిపేట లో కూడ మీరు మెడికల్ మాఫియా కి సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటని ఆయన అన్నారు. మీరు నిజంగా వైద్య శాఖ మంత్రి అయితే మీకు తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలపై ప్రేమ ఉంటే ఈ దొంగ రాజకీయాలు మాని మాతో ఒకసారి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి రమ్మని కరకండిగా ఆయన మంత్రిని కడిగేసారు.

ఏదైనా ఎమర్జెన్సీ కేస్ ఉంటే సదువు రాని దద్దమ్మ లతో టెస్టులు చేయించి ఎవరిని ఆగం చేద్దామని మీ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. లంచాలు తీసుకొని సదువు సంధ్య లేని దద్దమ్మలకి అవుట్ సోర్సింగ్ జాబ్ లు ఇచ్చి పేద ప్రజలని ఇబ్బంది పెట్టె బదలు ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయొచ్చు కదా హరీష్ రావ్ అని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ గారు మండిపడ్డారు. ఇప్పటికైనా లంచాలు తినడం మానేసి చిత్త శుద్ధితో మీ పని మీరు సక్రమంగా చేయాలనీ ఆయన ఆదేశించారు. ఇప్పటికి లంచాలు మింగిన కాడికి చాలు మేము గనక ఒక్క ఆర్ టీ ఐ వేసి సమాచారం లాగితే నువ్వు ఉండవు ని మంత్రి పదవి ఉండదని ఆయన అన్నాడు. ని మంత్రి పదవి మేము పెట్టిన బిక్ష అని ఆయన అన్నాడు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో 2 గంటలపాటు పవర్ సప్లై ఉండదా డీజిల్ కు పైసల్ తక్కువ పడ్డాయా అని ఆయన గోంతేత్తి గర్జించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏ ఐ పి ఎస్ యు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఒగ్గు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, శివ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ponguleti: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ పొంగులేటి సవాల్

తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని..

దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్ర్తం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. వారి గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారట అని వ్యాఖ్యానించిన పొంగులేటి.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల అభీష్టం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. .

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరగణంపై ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశాలతో బహిష్కరణ వేటు వేస్తున్నట్లు ఆ పార్టీ వైరా మండల, పట్టణ అధ్యక్షులు ప్రకటించారు. ఆ మేరకు వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, వైరా పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్తో పాటు మిట్టపల్లి నాగేశ్వరరావు (రైతుబంధు మండల అధ్యక్షులు), గుమ్మా రోశయ్య (మాజీ మార్కెట్ కమిటి చైర్మన్), ఇటికల మురళీ (సర్పంచ్ అష్టగుర్తి) బహిష్కరణకు గురైన వారిలో ఉన్నారు.

Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)పై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రస్తావనకు వచ్చింది..

పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు.

ఆరోజే తాము ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విచారణ జరగనందున తమకు ఇప్పటి నుంచి కనీసం 2 వారాల సమయం ఇస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫు న్యాయవాదులకే ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమర్థించారు..

ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

- బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్

అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, పలువురు నాయకులు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం 30 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు నల్ల గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం 2,90,396 లక్షల కోట్ల బడ్జెట్లో 65 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 6,229 కోట్లు కేటాయించి బీసీల గొంతుకోసి తీరని అన్యాయం చేశారన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం బీసీల బడ్జెట్ తగ్గించుకుంటూనే వస్తుందన్నారు. ఈ బడ్జెట్తో బీసీలకు ఒరిగిందేమీ లేదని 65 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు శాతం నిధులు బడ్జెట్లో కేటాయిస్తే ఏవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర సంపద సృష్టించేది, ఉత్పత్తి చేసేది బీసీలని, సగానికిపైగా పన్నులు కట్టేది బీసీలన్నారు. అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ నిధులు రెండున్నర కోట్ల బీసీ జనాభాకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇప్పటికే గ్లోబరైజేషన్ లిబరైజేషన్ మార్పుల తర్వాత పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరగడంతో పెద్ద పరిశ్రమలు కంపెనీలు రావడంతో చేతివృత్తులు కులవృత్తులు దెబ్బతిన్న కారణంగా బీసీల బ్రతుకులు రోడ్ల పాలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని 30 వేల కోట్లు కేటాయించి బీసీలపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. అంతేకాకుండా బీసీ సబ్ ప్లాన్, బీసీ బంధును తక్షణమే ప్రవేశపెట్టి అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, బీసీ యువజన సంఘం నాయకులు యలిజాల రమేష్, బట్టు శ్రీశైలం, రవీందర్, విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు

ఆసరా పింఛన్లు 12,000 కోట్లు

దళిత బంధు 17, 700 కోట్లు

బీసీ సంక్షేమం 6,229 కోట్లు

గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు

బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,

నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,

విద్యుత్ రంగం 12, 727 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.

ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..

దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..

గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..

బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..

వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..

షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు

పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..

విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..

రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..

హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..

పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..

రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు..

హోంశాఖకు రూ.9,599 కోట్లు..

మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు..

మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..

రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..

రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు

2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు.

అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు.