ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయండి
అనంతపురం జిల్లా స్పందనలో జిల్లా కలెక్టర్ ను కోరిన సాకే హరి
అనేక ఏళ్లుగా భర్తీకి నోచుకోని ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి జే,ఏ,సీ అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
అనంతరం సాకే హరి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్య కారణంగా మరుగున పడ్డాయన్నారు.ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారాని ఎదురుచూస్తున్నారని వాపోయారు.సుప్రీమ్ కోర్టు సైతం భర్తీ చేయాలని లేదంటే సరైన వివరణ ఇవ్వని వారిపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ద్వార 10వేలు పైచిలుకు ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.పాలనే ముగుస్తున్న పట్టించుకోలేదన్నారు.
అడిగిన వారిని అరెస్టులు,కేసులతో భయపెడుతున్నారు. ముఖ్యంగా విశ్వ విద్యాలయాల్లో పేరుకుపోయిన బ్యాక్ లాగ్ పోస్టులు అధికారుల కుట్రలతోనే అగాయని,ఎస్సీ,ఎస్టీలకు ఉద్యోగాలు వస్తే అభివృద్ధి చెందుతారనే కక్ష కట్టి సాధిస్తున్నారు.ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ రంగాల్లో ఖాళీగున్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ బాధితులను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జే,ఏ,సీ నాయకులు మన్నల శివయ్య.రేకల కుంట రామాంజనేయులు.ముత్యాలమ్మ.రామకృష్ణ.గణేష్ నాయక్.కొర్రపాడు నాగేంద్ర.చెన్న కేశవ.కందుకూరు రాము.గోపాల్ పాల్గొన్నారు.
Feb 06 2023, 21:14