పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మంత్రి హరీష్ రావు పని తీరు
ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్*
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(సిద్దిపేట):- జిల్లా కేంద్రం లో గల ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘం కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి ఫొటోస్ దిగగానే సరిపోదని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. నిజంగా ప్రభుత్వా ఆసుపత్రిలో 66%మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేకపోతే మీరు అసెంబ్లీ లో చెప్పుకోవడానికి ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారో ప్రజలకు తెలియ జేయాలనీ ఆయన అన్నారు. మీకు కనుక దమ్ముంటే నాతో ఒక్కసారి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రండి నేను అక్కడ జరుగుతున్న అన్యాయం ని చూపిస్తానని ఏ,ఐ,పి,ఎస్,యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు. మీకు పేద ప్రజల పై సవతి తల్లి ప్రేమ ఉందని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు కానీ, సిద్దిపేట లో కూడ మీరు మెడికల్ మాఫియా కి సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటని ఆయన అన్నారు. మీరు నిజంగా వైద్య శాఖ మంత్రి అయితే మీకు తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలపై ప్రేమ ఉంటే ఈ దొంగ రాజకీయాలు మాని మాతో ఒకసారి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని కరకండిగా ఆయన మంత్రిని కడిగేశారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే చదువు రాని దద్దమ్మ లతో టెస్టులు చేయించి ఎవరిని ఆగం చేద్దామని మీ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. లంచాలు తీసుకొని సదువు సంధ్య లేని దద్దమ్మలకి అవుట్ సోర్సింగ్ జాబ్ లు ఇచ్చి పేద ప్రజలని ఇబ్బంది పెట్టె బదలు ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయొచ్చు కదా హరీష్ రావ్ అని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మండిపడ్డారు. ఇప్పటికైనా లంచాలు తినడం మానేసి చిత్త శుద్ధితో మీ పని మీరు సక్రమంగా చేయాలనీ ఆయన అన్నారు. ఇప్పటికి లంచాలు మింగిన కాడికి చాలు మేము గనక ఒక్క ఆర్,టీ,ఐ వేసి సమాచారం లాగితే నువ్వు ఉండవని నీకు ఆ మంత్రి పదవి ఉండదని ఆయన అన్నాడు. నీ మంత్రి పదవి మేము పెట్టిన బిక్ష అని ఆయన అన్నాడు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 2 గంటలపాటు పవర్ సప్లై ఉండదా డీజిల్ కు పైసల్ తక్కువ పడ్డాయా అని ఆయన గోంతేత్తి గర్జించారు. ఈ కార్యక్రమంలో ఏ,ఐ,పి, ఎస్,యు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఒగ్గు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, శివ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Feb 06 2023, 18:24