పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మంత్రి హరీష్ రావు పని తీరు


ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్*

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(సిద్దిపేట):- జిల్లా కేంద్రం లో గల ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘం కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి ఫొటోస్ దిగగానే సరిపోదని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. నిజంగా ప్రభుత్వా ఆసుపత్రిలో 66%మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేకపోతే మీరు అసెంబ్లీ లో చెప్పుకోవడానికి ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారో ప్రజలకు తెలియ జేయాలనీ ఆయన అన్నారు. మీకు కనుక దమ్ముంటే నాతో ఒక్కసారి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రండి నేను అక్కడ జరుగుతున్న అన్యాయం ని చూపిస్తానని ఏ,ఐ,పి,ఎస్,యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు. మీకు పేద ప్రజల పై సవతి తల్లి ప్రేమ ఉందని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు కానీ, సిద్దిపేట లో కూడ మీరు మెడికల్ మాఫియా కి సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటని ఆయన అన్నారు. మీరు నిజంగా వైద్య శాఖ మంత్రి అయితే మీకు తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలపై ప్రేమ ఉంటే ఈ దొంగ రాజకీయాలు మాని మాతో ఒకసారి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని కరకండిగా ఆయన మంత్రిని కడిగేశారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే చదువు రాని దద్దమ్మ లతో టెస్టులు చేయించి ఎవరిని ఆగం చేద్దామని మీ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. లంచాలు తీసుకొని సదువు సంధ్య లేని దద్దమ్మలకి అవుట్ సోర్సింగ్ జాబ్ లు ఇచ్చి పేద ప్రజలని ఇబ్బంది పెట్టె బదలు ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయొచ్చు కదా హరీష్ రావ్ అని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మండిపడ్డారు. ఇప్పటికైనా లంచాలు తినడం మానేసి చిత్త శుద్ధితో మీ పని మీరు సక్రమంగా చేయాలనీ ఆయన అన్నారు. ఇప్పటికి లంచాలు మింగిన కాడికి చాలు మేము గనక ఒక్క ఆర్,టీ,ఐ వేసి సమాచారం లాగితే నువ్వు ఉండవని నీకు ఆ మంత్రి పదవి ఉండదని ఆయన అన్నాడు. నీ మంత్రి పదవి మేము పెట్టిన బిక్ష అని ఆయన అన్నాడు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 2 గంటలపాటు పవర్ సప్లై ఉండదా డీజిల్ కు పైసల్ తక్కువ పడ్డాయా అని ఆయన గోంతేత్తి గర్జించారు. ఈ కార్యక్రమంలో ఏ,ఐ,పి, ఎస్,యు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఒగ్గు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, శివ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది*. 

Street Buzz news. హైదరాబాద్: - ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్‌ అలియాస్‌ అబ్దుల్‌. హుమాయున్‌నగర్‌ వాసి మాజ్‌హసన్‌ ఫరూఖ్‌, సైదాబాద్‌ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్‌ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్‌ చేయటం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటుమందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.ఉగ్రకుట్రలకు సంబంధించి జాహెద్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2005లోనే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసులో జైలుకెళ్లాడు. 2004లో రైట్‌వింగ్‌ కార్యకర్తల హత్యకు కుట్రతోపాటు 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ అతడిపై కేసులున్నాయి. 2005 నుంచి 2017 వరకు జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న విడుదలయ్యాడు. విడుదలయ్యాక కూడా జాహెద్‌ ఉగ్ర ప్రణాళిక రచనల్లో మునిగితేలినట్లు ఇటీవలే హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

విద్య హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి


 Street Buzz news సిద్దిపేట జిల్లా:

(సిద్దిపేట):- కార్పొరేట్ విద్యా సంస్థలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు కేటాయించాలి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ  విద్యారంగాన్నినిరుపేద విద్యార్థులకు విద్యనందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తే విధంగా వ్యవహరిస్తున్నాయని అభివృద్ధి అంటే భవనాలు కాదని విద్య వైద్యం అందినప్పుడే దాన్ని అభివృద్ధి అంటారని విద్య వైద్యానికి గాలికి వదిలేసి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో నిరుద్యోగులను చేస్తుందని ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థలకు దారదత్తం చేసి ప్రభుత్వ విద్య వ్యవస్థకు నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇది పేస్టు పేజీ ఉచిత విద్య అనే మాటలు చెప్పి విద్య వ్యవస్థను విద్యాసంస్థలకు నిర్లక్ష్య ధోరణిగా ప్రభుత్వం చూస్తుందని ఇప్పటికైనా పేదవారికి కనీస విద్యా వైద్యం అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాటం చేసి విద్యా వ్యవస్థను కాపాడడాని ముందుంటుదన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

హాత్ సే హాత్ పాదయాత్రను విజయవంతం చేద్దాం

రేవంత్ రెడ్డి తలపెట్టిన

హాత్ సే హాత్ పాదయాత్రను విజయవంతం చేద్దాం

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 

(మొగుళ్ళపల్లి) :- పేద ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనిఅందుకోసం ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ పాదయాత్రను విజయవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ అడవి బిడ్డల హక్కుల కోసం ఆఖరి ఊపిరి వరకు పోరాడిన సమ్మక్క, సారలమ్మల ఆశీస్సులతో భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గడ్డమీద నుండి ఫిబ్రవరి 6న ఉదయం 9 గంటలకు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించి పాదయాత్రను విజయవంతం చేయాలని సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు, పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..ఈ పాదయాత్ర కొనసాగుతుందని సుదర్శన్ గౌడ్ తెలిపారు.

భూపాలపల్లిలో బీసీ ఎమ్మేల్యేని గెలుపించుకుందాం

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: -

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోని బీసీలంతా కలిసికట్టుగా పనిచేసి బీసీ అభ్యర్థిని గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. ఆదివారం మహేందర్ గౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతి రోజు బీసీ గళం విప్పి, బీసీల హక్కులకై పోరాటం చేస్తున్న కొంత మంది నాయకులు ఎన్నికలు వచ్చే సరికి బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా అగ్ర కుల అభ్యర్థులకు మద్దతిస్తున్నారని, ఈ విధంగా చేయటం వల్ల బీసీలు చట్టసభల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారని, దీంతో బీసీల బతుకులు మారటం లేదన్నారు. ఇప్పటికైనా బీసీలు వాస్తవాలు గ్రహించి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని అన్నారు.భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని, ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలందరిని ఏకం చేసి బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్పీ పోరాడుతుంది ౼. బీఎస్పీ పార్టీలో భారీగా చేరికలు

బీఎస్పీ పార్టీలో భారీగా చేరికలు

 కండువా కప్పి బీఎస్పీ పార్టీలోకి ఆహ్వానించిన గజ్జి జితేందర్ యాదవ్

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

( మొగుళ్లపల్లి):- మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, యువకులు ఆదివారం బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు గజ్జి జితేందర్ యాదవ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జితేందర్ యాదవ్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పోరాడుతుందని, దళిత, బహుజన, బీసీ సోదరులంతా బీఎస్పీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో అగ్రవర్ణాల పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మండల జిలేందర్, దూడపాక జిలేందర్, బచ్చల రామస్వామి, బొచ్చు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం


టేకుమట్ల ఎస్ఐ చల్ల రాజు 

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 

శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని టేకుమట్ల ఎస్ఐ చల్ల రాజు అన్నారు. ఆదివారం ఎస్ఐ చల్ల రాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం 24 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ ప్రజలకు చేరువయ్యామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలకు బానిసై వారి బావి భారత జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కొఠారీ కమీషన్ కు తూట్లు పొడవద్దు


ఎఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు

 Street Buzz news :సిద్దిపేట జిల్ల్లా: 

(చేర్యాల):- దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే నిర్మాణం అవుతుందని అన్న కొఠారీ కమిషన్ మాటలకు తూట్లు పొడువద్దని ఎఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు.ఈ విషయమై ఆదివారం మీడియాతో పుల్లని వేణు మాట్లాడుతూ .రేపు (సోమవారం) జరిగే రాష్ట్ర బడ్జెట్ నిధుల విషయంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని,

భారీగా గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయనే నిజాన్ని గ్రహించడం లేదని, తెలంగాణ రాష్ట్రం కోసం వర్సిటీ విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేశారని,ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా 2018-19లో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చిన దుర్మార్గపు విధానాలు రాష్ట్ర ప్రభుత్వానివి అని మండి పడ్డారు. పేద మధ్యతరగతి వారికి వారి జీవన విధానం మెరుగుపరచుకోవడానికి కావాల్సిన ఆయుధం విద్య ఒక్కటే కాబట్టి కార్పొరేట్‌కి దీటుగా పాఠశాలను తీర్చిదిద్దాలని,కార్పొరేట్ పాఠశాలలను జాతీయం చేయాలని,ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకు వచ్చిన విద్యా విప్లవం, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆధునికీకరణను స్ఫూర్తిగా తీసుకోవాలని,విద్య ఒక హక్కుగా అందరికీ అందాలన్న కేరళ ప్రభుత్వం లాంటి విధానాలను మరియు కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని ఈ బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం మూడు లక్షల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.