2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు.

అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు.

KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్‌

నాందేడ్‌: దేశ పరిస్థితులను చూసిన తర్వాత తెరాసను భారాస (BRS)గా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) అన్నారు. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు..

పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్‌ (Nanded)లోని సచ్‌ఖండ్‌ బోడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్రలోని పలువురు నాయకులకు భారాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్‌, పూలే వంటి మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మహారాష్ట్ర అని అన్నారు.

''దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఆ మేరకు మార్పులు రాలేదు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్‌ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే 'అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌' నినాదంతో భారాస వచ్చింది. భారత్‌ బుద్ధి జీవుల దేశం.. ఎన్నాళ్లో ఎదురు చూశాం. ఇప్పుడు సమయం వచ్చింది. నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.'' అని కేసీఆర్‌ అన్నారు..

అధికారమిస్తే.. 24 గంటల విద్యుత్‌

దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. భారాసకు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చిన మార్పు..దేశమంతా రావాల్సిన అవసరముందన్నారు. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు భారాసను గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, కిసాన్‌ సర్కార్‌ రావాలన్నారు. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..

వరంగల్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు..

'హాత్ సే హాత్ జోడో' అభియాన్ లో భాగంగా రేవంత్ ఈ యాత్ర చేపడుతున్నారు.

తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్‌ఆర్ స్ఫూర్తితో తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో వైఎస్‌ఆర్‌ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2004లో టీడీపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాకతీయ రాజులపై వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసమే తన పాదయాత్రను మేడారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా..

సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరుతారు

వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు.

ఉదయం 10 గంటలకు ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు

12 గంటలకు పాదయాత్ర ప్రారంభం

మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర

మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం

ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి పాదయాత్ర

సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం

పస్రా జంక్షన్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్

తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి మళ్లీ పాదయాత్ర

రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకోనున్న రేవంత్ పాదయాత్ర

రాత్రికి రామప్ప గ్రామంలోనే బస

Sajjala Ramakrishna: రాష్ట్రాభివృద్ధికి.. మూడు రాజధానులే మార్గం..

Sajjala Ramakrishna Reddy On 3 Capitals: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులే మార్గమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు..

ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

అంతకుముందు.. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు.

Bopparaju Venkateswarlu: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 26వ తేదీ డెడ్‌లైన్..

Bopparaju Venkateswarlu Deadline To AP Government: ఉద్యోగుల సమస్యలను ఈనెల 26వ తేదీలోపు పరిష్కరించాలని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతలోపు సమస్యలపై చీఫ్ సెక్రెటరీకి లేఖ రాస్తామని తెలిపారు. ఏపీ అమరావతి జేఏసి రాష్ట్ర మహాసభ ముగిసిందని తెలియజేసిన ఆయన.. ఈ మహాసభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ 94 సంఘాల నుంచి 100 సంఘాలకు పెరిగిందని.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల మహాసభ ఎప్పుడూ జరగలేదని అన్నారు..

మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారని.. అసలు ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, దాంతో ఉద్యోగుల జీవితాలు దారుణంగా తయారైందని ఫైర్ అయ్యారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కార్డు కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందని మండిపడ్డారు. డీఏలు ఇచినట్టే ఇచ్చి, ఆ వెంటనే వాటిని వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై మనసు పెట్టకపోవడం వల్లే.. పరిష్కారం కావట్లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులుగా పని చేసి.. రూ. 2,500 సంపాదించే వారికి కూడా రేషన్ కార్డు పోయిందని వాపోయారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదని.. సీఎం స్వయంగా పరిష్కరిస్తారని ఎదురు చూసినా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతులు మెరుగుపరచాలి : PDSU రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్

•ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లో సంక్షేమ హాస్టల్ లో సరిపడ వసతులు లేవు కాబట్టి ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి. సన్నబియ్యం పంపిణీ చేయాలి. హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతులు మెరుగుపరచాలి. బెడ్ సీట్, ట్రంకు పెట్టెలు,పంపిణీ చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ ట్యాబ్ ఇవ్వాలి.హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలి. సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, నాణ్యత లేని భోజనం చేస్తున్నారు అనీ సరిఅయిన మెన్ ప్రకారం చెయ్యకుండా సరిపడా బెంచీలు, కుర్చీలు, త్రాగునీరు మరియు ఉపాధ్యాయుల కొరత కూడ అక్కడ అక్కడ స్కూల్ లో లేని పరిస్థితి ఉంది.

అంతే కాకుండా హాస్టల్ లో వార్డెన్ కూడా లేని దుస్థితి ఏర్పడింది, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా 8 వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ కూడ పంపిణీ చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా సంక్షేమ హాస్టల్ లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని,పక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలను బహిరంగ సభలను, జరిగే కార్యక్రమాలను తప్పకుండా అడ్డుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు.. కండువా క‌ప్పి ఆహ్వానించిన కేసీఆర్

భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో నాందేడ్ సులు భారీ సంఖ్య‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

నాందేడ్ వసూలు జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ అంబేద్క‌ర్‌, మ‌ర‌ఠ్వాడా పోరాట‌ యోధుల‌కు సీఎం కేసీఆర్ నివాళులు

బీఆర్ఎస్ నాందేడ్‌ స‌భా వేదికపై డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌ర‌ఠా యోధుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు.

మహిళల విద్యాభ్యున్నతికి కృషి చేసిన అన్న బావుసాట్, అహల్యబాయి హోవల్కర్,

మరఠ్వాడ పోరాట యోధులు చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, లోకమాన్య తిలక్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్ర‌హాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

బీఆర్ఎస్ స‌భ‌లో యువ‌త జోష్‌

నాందేడ్ బీఆర్ఎస్ స‌భ‌లో ఓ యువ‌తి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మ‌రాఠీకి చెందిన గోదాతీర్ అనే ప‌త్రిక‌లో స్థానిక నాయ‌కుడు ఇచ్చిన కేసీఆర్ యాడ్‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కేసీఆర్ లాంటి నాయ‌కుడు ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని ఆ యువ‌తి పేర్కొంది.

రైతుల‌, యువ‌త ప‌ట్ల కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలిపింది. యూత్ మ‌ద్ద‌తు కేసీఆర్‌కు త‌ప్ప‌క ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది...

Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రగతి భవన్‌లో ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన

ఈ సమావేశంలో రేపు(జనవరి 6) శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది. కేబినెట్‌ భేటీ తరువాత సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌ పర్యటనకు వెళ్లనున్నారు.