ఈనెల 9న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి: పాలడుగు ప్రభావతి

ఈనెల 9న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి

    పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపు.

  

ఇంటి స్థలాలు ఇంటి నిర్మాణం కి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈ రోజు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది.ఈ సందర్భంగా ప్రభావతీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలు ఇంటి స్థలాలు లేక స్థలమున్న ఇల్లు నిర్మాణం చేసుకోలేక సతమత మవుతున్నారని ఇరుకైన ఇండ్లలో కాలం వెల్లదీస్తున్నారని ఇంటి స్థలాల సమస్యపై ఐక్య ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామాని వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని వాగ్దానాలు చేశారని బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని అన్నారు. నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును లూటీ చేస్తుందని పెట్టుబడుదారులకు అప్పనంగా కట్టిపెడుతుందని పేదల సంక్షేమానికి రూపాయి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని అయినప్పటికీ చిత్తశుద్ధితో వాటిని పేదలకు అందివ్వ లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు సమీకరించినున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

   జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ జిల్లా ఆఫీసు బేరర్స్ తుమ్మల పద్మ ,భూతం అరుణ, కారంపూడి ధనలక్ష్మి ,జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి సుల్తానా ,గోలి వెంకటమ్మ , సైదమ్మ ,నాగమణి, శాంతమ్మ , తదితరులు పాల్గొన్నారు.

ఆర్ కృష్ణయ్య గారి తనయుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నలగొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు

ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.