హాత్ సే హాత్ పాదయాత్రను విజయవంతం చేద్దాం
రేవంత్ రెడ్డి తలపెట్టిన
హాత్ సే హాత్ పాదయాత్రను విజయవంతం చేద్దాం
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
(మొగుళ్ళపల్లి) :- పేద ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనిఅందుకోసం ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ పాదయాత్రను విజయవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ అడవి బిడ్డల హక్కుల కోసం ఆఖరి ఊపిరి వరకు పోరాడిన సమ్మక్క, సారలమ్మల ఆశీస్సులతో భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గడ్డమీద నుండి ఫిబ్రవరి 6న ఉదయం 9 గంటలకు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించి పాదయాత్రను విజయవంతం చేయాలని సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు, పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..ఈ పాదయాత్ర కొనసాగుతుందని సుదర్శన్ గౌడ్ తెలిపారు.
Feb 06 2023, 08:46