భూపాలపల్లిలో బీసీ ఎమ్మేల్యేని గెలుపించుకుందాం
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోని బీసీలంతా కలిసికట్టుగా పనిచేసి బీసీ అభ్యర్థిని గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. ఆదివారం మహేందర్ గౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతి రోజు బీసీ గళం విప్పి, బీసీల హక్కులకై పోరాటం చేస్తున్న కొంత మంది నాయకులు ఎన్నికలు వచ్చే సరికి బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా అగ్ర కుల అభ్యర్థులకు మద్దతిస్తున్నారని, ఈ విధంగా చేయటం వల్ల బీసీలు చట్టసభల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారని, దీంతో బీసీల బతుకులు మారటం లేదన్నారు. ఇప్పటికైనా బీసీలు వాస్తవాలు గ్రహించి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని అన్నారు.భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని, ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలందరిని ఏకం చేసి బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Feb 06 2023, 08:24