కొఠారీ కమీషన్ కు తూట్లు పొడవద్దు


ఎఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు

 Street Buzz news :సిద్దిపేట జిల్ల్లా: 

(చేర్యాల):- దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే నిర్మాణం అవుతుందని అన్న కొఠారీ కమిషన్ మాటలకు తూట్లు పొడువద్దని ఎఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు.ఈ విషయమై ఆదివారం మీడియాతో పుల్లని వేణు మాట్లాడుతూ .రేపు (సోమవారం) జరిగే రాష్ట్ర బడ్జెట్ నిధుల విషయంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని,

భారీగా గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయనే నిజాన్ని గ్రహించడం లేదని, తెలంగాణ రాష్ట్రం కోసం వర్సిటీ విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేశారని,ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా 2018-19లో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చిన దుర్మార్గపు విధానాలు రాష్ట్ర ప్రభుత్వానివి అని మండి పడ్డారు. పేద మధ్యతరగతి వారికి వారి జీవన విధానం మెరుగుపరచుకోవడానికి కావాల్సిన ఆయుధం విద్య ఒక్కటే కాబట్టి కార్పొరేట్‌కి దీటుగా పాఠశాలను తీర్చిదిద్దాలని,కార్పొరేట్ పాఠశాలలను జాతీయం చేయాలని,ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకు వచ్చిన విద్యా విప్లవం, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆధునికీకరణను స్ఫూర్తిగా తీసుకోవాలని,విద్య ఒక హక్కుగా అందరికీ అందాలన్న కేరళ ప్రభుత్వం లాంటి విధానాలను మరియు కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని ఈ బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం మూడు లక్షల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.