Sajjala Ramakrishna: రాష్ట్రాభివృద్ధికి.. మూడు రాజధానులే మార్గం..
Sajjala Ramakrishna Reddy On 3 Capitals: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులే మార్గమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు..
ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు.. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు.
Feb 05 2023, 19:14