Andrapradesh

Jun 03 2022, 11:07

“ఈ స్థలం మాదే.. అన్యాయంగా లాక్కోకండి సారూ”.. కర్నూలు జిల్లాలో ఓ కుటుంబం ఆవేదన

“యాభై ఏళ్లుగా ఆ స్థలంలో కట్టెలు వేసుకుని జీవనోపాధి పొందుతున్నాం.. ఆ స్థలం మాదే సార్.. అన్యాయంగా ఆ స్థలాన్ని మా దగ్గర నుంచి లాక్కోకండి.. మా కడుపు కొట్టకండి”.. అంటూ ఓ మహిళ కన్నీటిపర్యంతమైన ఘటన కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మండలం గుడిపాడులో జరిగింది. గ్రామానికి చెందిన మీనాక్షమ్మ అనే మహిళ.. తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలు వేసుకుంది. అయితే ఆ స్ధలంలో రైతు భరోసా(Raitu Bharosa) పాలకేంద్రం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రెవెన్యూ అధికారులు మీనాక్షమ్మ ఇంటి వద్దకు జేసీబీతో చేరుకుని కట్టెలు తొలగించే ప్రయత్నం చేశారు. ఇంటి ముందు ఉన్న స్ధలం తమదేనని, యాభై ఏళ్ల నుంచి ఆ స్ధలంలో కట్టెలు వేసుకుంటున్నామని మీనాక్షమ్మ ప్రాధేయపడినా రెవెన్యూ సిబ్బంది కనికరించలేదు. దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని మీనాక్షమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు అప్రమత్తమై మీనాక్షమ్మను అడ్డుకున్నారు. అంతే కాకుండా అక్కడే ఉన్న మీనాక్షమ్మ కుమార్తెలను మహిళా కానిస్టేబుల్ చున్నీతో కట్టి, స్ధలం దగ్గరకు వెళ్లకుండా చేశారు. తమను విడిచి పెట్టాలని మీనాక్షమ్మ కూతుళ్లు మహిళా పోలీసులను అడిగినా వాళ్లు చలించలేదు. స్ధలం ఖాళీ చేశాకే వారిని విడిచిపెట్టారు.

స్థానిక వైసీపీ నేతల మాటలు విని, స్థలాన్ని ఖాళీ చేస్తున్నారని మీనాక్షమ్మ కుటుంబంసబభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. తహసీల్దారు గీతాప్రియదర్శిని మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబరు 75లోని 24 సెంట్ల ప్రభుత్వ స్థలంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పాలకేంద్రం నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అందులోని కొంతభాగంలో వారు కట్టెలు వేసుకున్నారన్నారు. వారి వద్ద ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పట్టాలూ లేవన్నారు. అర్హతలు పరిశీలించి వేరే చోట వారికి ఇంటిస్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.


Andrapradesh

Jun 02 2022, 18:27

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ_

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. జగన్ తో పాటు ప్రధాని మోడీని ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలవనున్నారు..


Andrapradesh

Jun 02 2022, 15:56

అమరావతి

నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా..?...దివ్యవాణి, సినీ నటి.

అచ్చెన్నాయుడు లాగా పార్టీ లేదు బొక్కా లేదు అని అన్నానా..?

నేనేదో అన్నానని నన్ను తప్పు పట్టిన వాళ్లు.. పార్టీ లేదు బొక్కా లేదన్న అచ్చెన్నని ఏం శిక్షించారు..?

సాధినేని యామిని లాగా నేనేం విమర్శలు చేయలేదే..?

నాలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారు.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి డాగ్స్ లా ఉంటున్నారు.

నారీ-భేరీకి డబ్బులు తీసుకుని మేకప్ చేసుకుని కూర్చొవడం లేదు.

చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడడం లేదు.

చంద్రబాబు నా తండ్రి లాంటి వారు.

నేను బాలకృష్ణ కంటే పెద్ద హీరోనే.

చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే.. ఆయనకంటే ముందు నేనే కౌంటర్ ఇచ్చాను.

గౌరవం లేని చోట ఉండలేను.

రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నా.

నేనేం తేడాగా మాట్లాడలేదే..?

మతమార్పిడుల విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు క్రైస్తవులు ఆగ్రహనికి గురయ్యారు.

క్రైస్తవులు పడే బాధలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోయాను.

నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్ మీట్ పెట్టించారు.. నేను చాలా బాధ పడ్డాను.

నెమ్మదిగా టీడీపీలో నా డౌన్ ఫాల్ మొదలైంది.

ప్రెస్ మీట్లు పెట్టడానికి నలుగురు దగ్గరకు తిప్పుతున్నారు.

టీడీ జనార్జన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు.*

నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.

కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని నాకు చాలా మంది చెప్పినా వినలేదు.

మహానాడు వేదిక మీద కూర్చొవడానికి వీల్లేదు.. మాట్లాడే అవకాశం లేదు.

చంద్రబాబును ఉద్దేశించి నేను కామెంట్లు చేయడం లేదు.

ఈ ప్రభుత్వం మీద నేను విమర్శలు చేసినా.. నన్ను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు.

పార్టీలో నా డబ్బుతో నేను ఖర్చు పెట్టుకుని పని చేశాను.


Andrapradesh

Jun 02 2022, 15:53

అన్నమయ్య జిల్లా....

పందెనికి కాదేదీ అనర్హం అన్న రీతిలో పందుల పోటీలు...

అన్నమయ్య జిల్లా రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం లో జరిగిన అరుదైన పందెం...

నూతన సాంప్రదాయానికి తెర లేపిన దిగువ అబ్బవరం గ్రామస్తులు...

కడప జిల్లా... అన్నమయ్య జిల్లా పందుల మద్య పందేలు...

తెల్లవారుజామున ఆరు గటలకే పోటీలు మొదలు...

అన్నమయ్య జిల్లా పంది రెండు లక్షల రూపాయలు బహుమతి గెలిచినట్లు సమాచారం...

ఇవేమీ పోటీలంటు ముక్కున వేలేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు...


Andrapradesh

May 31 2022, 15:13

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత

పోలీస్ స్టేషన్ ముందే కర్రలు, రాళ్లతో దాడులు.. 

మద్యం మత్తులో నలుగురి వ్యక్తుల మధ్య మొదలైన గొడవ.. చివరికి, రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుటనే వందలాది మంది రోడ్డుపైకొచ్చి రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లె మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుడుపల్లె మండలంలోని చీకటిపల్లె, కోట చెంబగిరి గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఏపీ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బిసానత్తం వద్ద మద్యం తాగారు.

తిరుగు ప్రయాణంలో ఒంటిపల్లె వద్ద మద్యం మత్తులో వీరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించగా, రెండు గ్రామాల పెద్దలు శనివారం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం పోలీసుల ఎదుట సర్ది చెప్పేందుకు గ్రామస్తులు మరోసారి ప్రయత్నించారు.

ఈ సమయంలో ఒక వర్గానికే న్యాయం చేస్తున్నారంటూ మరో వర్గ ప్రజలు రోడ్డును దిగ్బంధించి నిరసనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మరోసారి రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి మూడు గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని, కర్రలతో దాడి చేసుకున్నారు.

గుడుపల్లె మండల పరిధిలోని చీకటిపల్లె గ్రామం ఓ వర్గం కాగా, మరో వర్గం వైపు ఒంటిపల్లె, కోటచెంబగిరి గ్రామస్తులు నిలిచారు. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన 12 మందికి గాయాలయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం కాక.. గుడుపల్లె ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సీఐలు సూర్యమోహన్, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు అందరినీ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్‌ రెండు వర్గాలకు నచ్చజెప్పి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట దాడులకు పాల్పడ్డ రెండు వర్గాలపై మూడు కేసులు నమోదు చేసినట్లు కుప్పం గ్రామీణ సీఐ సూర్యమోహన్‌ తెలిపారు.


Andrapradesh

May 31 2022, 14:39

మిస్సింగ్ కేసులో మహిళ శవం వెంకటాపురం చెరువులో...

తిరుపతిలో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేసి సూట్‌కేసు‌లో కుక్కి చెరువులో పడేశాడు. ఈ దారుణ ఘటన 5 నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి కొర్లగుంటకు చెందిన పద్మ అనే యువతిని కుటుంబ సభ్యులు వేణుగోపాల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇచ్చి 2019లో పెళ్లి చేశారు. అయితే, పెళ్లి అయిన నాలుగు నెలలుకే పద్మను మానసికంగా, శారీరకంగా హింసించి చిత్రహింసలు పెట్టారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నాలుగో రోజే పద్మ శరీరంపై వాత పెట్టాడని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పద్మను భర్త కొట్టి చంపి, భార్య మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ చేపల చెరువులో పడేశాడు. తర్వాత, ఏమీ తెలియనట్లు తన భార్య తప్పిపోయిందంటూ జనవరిలో వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తమదైన శైలిలో విచారణ చేసిన పోలీసులు.. ఐదు నెలల తర్వాత పద్మ మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు. ఈ క్రమంలో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులోని పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

అయితే, తన భార్య టార్చర్ తట్టుకోలేకనే హత్య చేసినట్లు వేణుగోపాల్ చెప్పాడు. తన భార్య తనను టార్చర్ చేసేదని ఆరోపించాడు. విడిపోయేందుకు విడాకులు ఇవ్వాలని కోరానని, డబ్బులు కూడా ఇస్తానని చెప్పినట్లు తెలిపాడు. అయితే, ఎక్కువ డబ్బులకు ఆశ పడి తనపై చిత్తూరు, మంగళగిరిలో కేసులు పెట్టిందని.. తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా హింసించిందని ఆరోపించాడు. భార్య టార్చర్ తట్టుకోలేకనే భార్యను హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Andrapradesh

May 31 2022, 14:21

బైకు ఢీకొని.. ఎగిరిపడ్డ కారు.. ఏంటిదని షాకయ్యారా..!

సార్‌.. నా భర్త బైకు మీద వెళుతుంటే ఓ కారు ఢీకొట్టింది. మా ఆయనకు కాలు, చెయ్యి విరిగింది. ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు కట్టలేదు. పైగా బైకు ఢీకొట్టినందుకు కారు ఎగిరి పడిందని మా ఆయనపైనే కేసు కట్టారు. మీరే న్యాయం చేయాలి’ అని ఓ మహిళ ఎస్పీ ఫక్కీరప్పను వేడుకున్నారు. కారు ఢీకొంటే బైకు ఎగిరిపడాలిగాని, కారు ఎగిరిపడటం ఏమిటి..? అనుకోకండి..! అప్పుడుప్పుడు ఇట్ల జరగొచ్చు.బైకు ఢీకొని.. ఎగిరిపడ్డ కారు.. ఏంటిదని షాకయ్యారా..!అసలేం జరిగిందంటే..!జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. మొత్తం 77 మంది బాధితులు వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. వీరిలో రాయదుర్గం పట్టణానికి చెందిన చిట్టెమ్మ ఒకరు. మార్చి 3న తన భర్త అనిల్‌ కుమార్‌ బైక్‌పై వెళుతుండగా కళ్యాణదుర్గం మండలం ఉల్లికల్లు వద్ద కారు ఢీ కొందని, ఈ ప్రమాదంలో తన భర్తకు కాలు, చెయ్యి విరిగిందని ఆమె ఎస్పీకి తెలిపారు. ఈ ప్రమాదంలో తన భర్త తప్పు లేదని, కారు రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీ కొందని అన్నారు.

కారులో గుమ్మఘట్ట ఎస్‌ఐ తిప్పేనాయక్‌ ఉన్నారని, దీనిపై కళ్యాణదుర్గం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, ఎస్‌ఐ సుధాకర్‌ కేసు కట్టలేదని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పైగా, ఎస్‌ఐ తిప్పేనాయక్‌ తన కారు డ్రైవర్‌ పేరిట తన భర్త అజాగ్రత్తగా బైక్‌ నడిపినట్లు, బైకు ఢీకొట్టడంతో కారు ఎగిరి గుంతలో పడినట్లు ఫిర్యాదు చేయించారని, ఈ మేరకు తన భర్తపై కేసు కట్టారని బాధితురాలు వాపోయారు. దీనిపై విచారించి, తమకు న్యాయం చేయాలని ఆమె ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం విలేకరులను కలిసి తన ఆవేదన చెప్పుకుని, కన్నీటి పర్యంతమయ్యారు.


Andrapradesh

May 31 2022, 12:49

APSRTC బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు

డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, యూపీఐలతో టికెట్లు

బస్సుల్లో టికెట్ల జారీకి టిమ్స్‌ స్థానంలో ఈ–పోస్‌ యంత్రాలు

పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోల ఎంపిక

చిల్లర ఇబ్బందులకు చెక్‌ 

అమరావతి : ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ యంత్రాల(టిమ్స్‌) స్థానంలో ఈ–పోస్‌ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్య ఉండదు. పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్‌ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్‌ కం కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు. *వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్‌ యంత్రాలు ప్రవేశపెడతారు. దశలవారీగా అన్ని డిపోల్లోనూ, నిర్దేశిత బస్టాండ్లు, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్‌ బుకింగ్‌ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్‌ యంత్రాలను సమకూర్చనున్నారు.


Andrapradesh

May 30 2022, 07:18

పల్నాడు జిల్లా రెంటచింతలలో ఘోర రోడ్డు ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన దాదాపు 38 మంది వ్యవసాయ కూలీలు మొక్కు తీర్చుకోవడం కోసం శ్రీశైలం వెళ్లారు. మొగ్గు తెచ్చుకుని తిరిగి వస్తుండగా మరొక ఐదు నిమిషాల్లో తమ ఇళ్లకు చెరుకోబోయే సమయంలో రెంటచింతల శివారు ప్రాంతంలో ఉన్న సిమెంట్ లారీ ను టాటా ఏసీ ట్రాలీ ఢీకొంది. దీంతో ఒక్కసారిగా టాటా ఏసీ బోల్తా పడింది. ర్యాలీ లో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదరై రోడ్డు పక్కన పడిపోయారు. సంఘటన స్థలంలో ఐదుగురు మృతి చెందారు. హాస్పిటల్ కి తరలిస్తుండగా మొదటి వ్యక్తి మృతి చెందాడు 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగే సమయానికి టాటా ఏసీ లో దాదాపు 38 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన నీతినేని కోటేశ్వరమ్మ,కురిచేటి రమాదేవి,అన్నవరపు కోటమ్మ,మకేరమణమ్మ,రోశమ్మ,లక్ష్మీనారాయణలు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు


Andrapradesh

May 29 2022, 15:06

సైలెంట్ గా రెడ్డి వర్గానికి మరో సలహాదారు పదవి !

సామాజిక న్యాయం చేశామని ఓ వైపు మంత్రులను రోడ్డెక్కించిన ప్రభుత్వం సైలెంట్‌గా పదవుల్ని మాత్రం రెడ్డి వర్గానికి కట్టబెడుతోంది. అసలే సలహాదారులు ఎక్కువైపోయారని విమర్శలు వస్తున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బత్తుల బ్రహ్మానందరెడ్డి అనే మరో వ్యక్తికి సలహాదారు పదవి ఇచ్చేసింది. పర్చూరు, చీరాల రాజకీయాలను సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్న హైకమాండ్ అక్కడ పార్టీ కోసం చాలా ఏళ్ల నుంచి ఖర్చులు పెట్టుకుని చాన్స్ కోసం చూస్తున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి అర్జంట్‌గా ఏదో ఓ పదవి ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని గుర్తించింది.

వెంటనే నెలకు. ఓ నాలుగైదు లక్షల జీత భత్యాలతో పదవి క్రియేట్ చేసింది వ్యవసాయ మార్కెటింగ్‌, కోఆపరేటివ్‌ సలహాదారుడిగా నియమించేశారు. ఇది జరిగి వారం అవుతోంది. ఆయన సైలెంట్‌గా బాధ్యతలు తీసుకునే వరకూ ఎవరికీ తెలియదు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఈ రెడ్డి నేతే చూసుకున్నారు. అయితే తర్వాత ఆయనను జగన్ పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఆయన జంప్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారని సమాచారం రావడంతో వెంటనే ప్రజాధనాన్ని జీతంగా ఇస్తూ ఓ పదవి ఇచ్చేశారు.

ఏపీ ప్రభుత్వానికి ఉన్న అనేక మంది సలహాదారుల్లో సగానికిపైగా ఇలా వైసీపీ రెడ్డి నేతలే ఉన్నారు. వారు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటారు తప్ప. ఎలాంటి సలహాలు ఇవ్వరు. ఇచ్చినా తీసుకునేవారు ఉండరు . ఇలాంటి పదవులు భర్తీ చేసేటప్పుడు కూడా సామాజిక న్యాయాన్ని పాటించేందుకు వైసీపీ సర్కార్ ఏ మాత్రం ఆలోచన చేయదు. కానీ బయట మాత్రం తమ కంటే ఎవరూ ఎక్కువ పదవులు ఇవ్వలేదని ప్రచారం చేసుకుంటూ ఉంటారు.