Andrapradesh

Oct 12 2021, 16:58

విజయవాడ

దుర్గగుడి కి చేరుకున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

ఆలయ మర్యాదలు తో స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు

సిఎం రాగానే... ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలలో భారీ వర్షం

సరస్వతి దేవి అలంకారం లో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న జగన్మోహన్ రెడ్డి

అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో .. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్

క్యూలైన్లు అన్నీ నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు

ఉచిత దర్శనం కూడా అనుమతి ఇవ్వని అధికారులు

వర్షంలో తడుస్తూనే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు 

Andrapradesh

Oct 12 2021, 14:41

విశాఖ ఏజెన్సీ

ముగ్గురు మావోయిస్టుల మృతి

AOB లో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు
జరిగాయి..

మందుపాతర పేల్చిన మావోయిస్టులు
పోలీసులకు గాయాలు...

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మల్కన్ గిరిజిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు...

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్ మృతిచెందినట్లు  ఒరిస్సా డిజిపి ప్రకటించారు...

మృతి చెందిన మావోయిస్టు AOB ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు గా ప్రాధమికంగా నిర్ధారణ...

ఎస్ ఒ జీ జవాన్ కు గాయాలు కావడంతో హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..... 

Andrapradesh

Oct 12 2021, 12:35

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్.

తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి

తిరుమల

ఉదయం తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర‌స్వామి దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

సీఎంకు ఆలయం వద్ద స్వాగతం పలికిన టీడీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి.

శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి వారిని దర్శించుకున్న సీఎం వైయస్‌.జగన్‌.

అనంతరం ఆలయంలోని తులాభారం మొక్కు తీర్చుకున్న సీఎం

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును ప్రారంభించిన సీఎం

ఎస్‌వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌) కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 

Andrapradesh

Oct 12 2021, 12:35

విజయవాడ

ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం..

విజయవాడ

 ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో నిలిపివేసిన పోలీసులు..

స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ అసహనం..

తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించిన నడిచి కిందకు వచ్చిన ఎంపీ కేశినేని నాని

వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహించిన ఎంపీ సహాయకులు..

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు... 

Andrapradesh

Oct 12 2021, 12:32

లారీలో రంగుల డబ్బాల మాటున మద్యం తరలింపు.. మొత్తం రూ.42 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం చేసుకున్న ఎస్ ఈ బీ అధికారులు...!!

గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో రంగుల డబ్బాలతో వెళుతున్న లారీలో అక్రమ మద్యం తరలిస్తున్నారని సమాచారంతో  ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహించారు.గోవా నుంచి గుంటూరు జిల్లా పొత్తూరు రంగుల డబ్బాల మధ్యలో పెట్టుకుని 1200ల మద్యం సీసాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం సీసాల తో పాటు రంగులు, లారీ తో కలిపి మొత్తం రూ 42 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నారు...!! 

Andrapradesh

Oct 12 2021, 08:55

ఒకే కుటుంబానికి చెందిన..3చిన్నారులు చెరువులో గల్లంతు...

అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలక వారి పల్లి ఎగువ తండాలో 3చిన్నారులు చేరువులోగల్లంతైంనసంఘటన విషాదం చోటుచేసుకుంది. తాండ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్ళింది. ముగ్గురు చిన్నారులు తన తల్లిఅరునాబాయ్ కుమారుడు 7వతరగతి చదువుతున్న లల్లు ప్రసాద్ నాయక్.మరో తల్లి శాంతిబాయ్ కుమారులు.పురుషోత్తమ్ నాయక్ హేమంత్ నాయక్ తో పాటు చెరువు వద్దకు వెళ్లారు.

తల్లి పిల్లలను గమనించకుండా బట్టలు వుతుకు తుండగా పిల్లలు ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయారు .అటుగా వెళ్తున్న గొర్రెలకాపరి మీ పిల్లలు చెరువులోకి దిగుతున్నారు అని తెలపగా పిల్లలకోసం వెతక సాగారు.

 అప్రమత్తమైన తల్లి చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించకపోవడంతో గ్రామస్తులకు తెలియజేసింది. కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి గల్లంతయ్యారా? లేదా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో సీతాఫలం పళ్ళ కోసం వెళ్లారా? అన్న అనుమానంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొన్న గ్రామస్తులు చెరువులోకి దిగి గగాలిస్తున్నారు అటవీ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

ఒక్కసారిగా గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు కనిపించకపోవడంతో ఆగ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలో ప్రజలు గల్లంతైన 3పిల్లల కోసం అంత వెతుకుతూ విలపిస్తున్నారు.
గల్లంతైన చిన్నారులు.
1.లాలు ప్రసాద్ నాయక్-(9)

2.పురుషోత్తం నాయక్-(11)

3.హేమంత్ నాయక్-(12) 

Andrapradesh

Oct 11 2021, 22:00

n*ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సన్నాహాలు*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో 14 ఎమ్మెల్సీకి స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల నుండి 11 ,ఎమ్మెల్యేల కోటా నుండి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది.గత ఆరు నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ప్రధానంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఖాళీల భర్తీ నిన్నటి వరకు కోర్టు అడ్డంకి ఉండేదికోర్టు నుండి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాలో ఎంపిపి,జెడ్పిటిసి స్థానాలు భర్తీ పూర్తి అయింది. అయితే శాసనమండలిలో 58 స్థానాలు ఉండగా,అధికార వైకాపా పార్టీకి ఇప్పటికే 18 స్థానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 14 స్థానాలు భర్తీ చేస్తే అన్ని కూడా వైకాపా ఖాతాలో పడనున్నాయి. దింతో వైకాపా బలం మండలిలో పెరిగి చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకోనుంది. అయితే ఖాళీగా ఉన్న 14 స్థానాల కోసం ఆయా జిల్లాలలో వైకాపా పార్టీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లను వై. యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1.మర్రి రాజశేఖర్ (చిలకూలురుపేట,గుంటూరు జిల్లా) 2 .ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు జిల్లా) 3 .బీద మస్తాన్ (నెల్లూరు జిల్లా ) 4 .భరత్ (కుప్పం,చిత్తూరు జిల్లా) 5 .వరుదు కళ్యాణి (విశాఖపట్నం జిల్లా) 6 .యార్లగడ్డ వెంకట రావు (కృష్ణ జిల్లా) 7 .హరిప్రసాద్ రెడ్డి (చిత్తూరు జిల్లా) 8 .వై లక్ష్మీదేవి (ఉరవకొండ,అనంతపురం జిల్లా) 9 .ఆమంచి కృష్ణమోహన్ (చీరాల,ప్రకాశం జిల్లా) వీరు కాకుండా ఇంకా కొన్ని పేర్లు పరిసినలో ఉన్నట్లు తెలుస్తోంది.బద్వేల్ ఉపఎన్నిక అనంతరం ఈ ఎమ్మెల్సీకి స్థానాలు భర్తీ చేయనున్నారు.

Oct 11 2021, 21:43

nహెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేతహెటిరో సంస్థలో రూ.142 కోట్ల నగదు సీజ్ రూ.550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించిన అధికారులు 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్థల్లో ఐటీ దాడులు పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్న అధికారులు వందలకొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారు బీరువాల్లో రూ. 500 నోట్ల కట్టలే పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలు సీజ్ చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తింపు ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారు ఇనుప బీరువాల్లో డబ్బును కుక్కి పెట్టారు ఒక్క బీరువాలో రూ. 5 కోట్ల నగదు దాచారు డబ్బు లెక్కపెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టింది *ఐటీ అధికారులు*

Andrapradesh

Oct 11 2021, 20:42

n*పోలీస్ కానిస్టేబుల్ పై దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు ముద్దాయిలు అరెస్టు::*
కృష్ణాజిల్లా, మచిలీపట్నం. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ నిర్లక్ష్యంగా ఉండకూడదని ,మాస్కు పెట్టుకోమని తన వంతు బాధ్యతగా హెచ్చరించి నందుకు కు కానిస్టేబుల్ నాగరాజు తో గొడవపడి అతనిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు ముద్దాయిలు తబ్రేజ్ ,జానీ మరియు అబ్దుల్ అజీం లను అరెస్టు చేయడం జరిగిందని పై ముగ్గురుని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసుం భాష తెలిపారు.. ఈరోజు ఉదయం మచిలీపట్నం లోనే రైతు బజార్ వద్ద మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేసిన ఘటనను జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగిందని వెంటనే కేసు నమోదు చేసి ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. *వారిపై రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని డీఎస్పీ షేక్ మాసుం భాష తెలిపారు.*