Andrapradesh

May 21 2021, 14:07

రఘురాజుకి జనరల్ ఎడిమా, కాలివేలికి ఫ్రాక్చర్.. ఆర్మీ ఆసుపత్రి నివేదిక వెల్లడి! 
 


 సీల్డ్ కవర్ ను తెరిచిన జస్టిస్ వినీత్ శరన్ 

 రఘురాజుకు ఫ్రాక్చర్ అయినట్టు రిపోర్టులో ఉందన్న న్యాయమూర్తి 

 మధ్యాహ్నం 2.30కు విచారణ వాయిదా 

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు జరిపిన వైద్య పరీక్షల రిపోర్టును, వీడియో రికార్డింగును సుప్రీంకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో అందజేసింది. ఈ సీల్డ్ కవర్ ను జస్టిస్ వినీత్ శరన్ ఈ రోజు తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించిన నివేదిక, ఎక్స్ రే, వీడియో కూడా పంపించారని ఈ సందర్భంగా జస్టిస్ శరన్ తెలిపారు. రఘురాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్టు కూడా రిపోర్టులో ఉందని చెప్పారు.

విచారణ సందర్భంగా రఘురాజు తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తూ... ఒక సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో రఘురాజును చిత్ర హింసలకు గురి చేశారనే విషయం తేలిపోయిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ... ఆ గాయాలను రఘురాజు స్వయంగా చేసుకున్నారా? లేదా? అనే విషయం తెలియదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దవే వాదనపై ధర్మాసనం స్పందిస్తూ... సీఐడీ కస్టడీ నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురాజు గాయాలు చేసుకున్నారని మీరు అంటున్నారా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

రిపోర్టులో రఘురాజు కాలికి ఫ్రాక్చర్ అయిందనే విషయం కీలక అంశంగా మారింది. కేసు విచారణ ఈ అంశం చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andrapradesh

May 21 2021, 13:06

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నాం: పవన్ కల్యాణ్.
 

_
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు హర్షణీయమని పవన్ అన్నారు. 

స్థానిక స్వపరిపాలనకు ఈ తీర్పు ఊపిరిపోసిందని చెప్పారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలను రద్దు చేశారని తెలిపారు. అయితే అదే నోటిఫికేషన్ పై ఏడాది తర్వాత ఎన్నికలను నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కినట్టేననని అన్నారు.

ఏప్రిల్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టినప్పుడే... జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని పవన్ చెప్పారు. ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని... పోటీ చేసే అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. 

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు వెళ్లిందని... మొండిగా ఎన్నికలకు వెళ్లడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా... తగిన సమయంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు

Andrapradesh

May 21 2021, 12:05

Big Breaking....
 

అమరావతి:


రాష్ట్రంలో ఎంపీటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు

ఎన్నికలకు కొ
నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టుసుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని హైకోర్. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు .ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు .ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు.

Andrapradesh

May 21 2021, 11:51

అమరావతి
 


సుప్రీకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసిన రఘురామ తనయుడు భరత్‌

కస్టడీలో తన తండ్రి మీద దాడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి

సీబీఐ లేదా ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలన్న భరత్‌

ప్రతివాదులుగా సీఎం జగన్‌, సీబీసీఐడీ అధికారులను చేర్చిన భరత్

దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్‌
న్యాయమూర్తులు వినీత్‌శరణ్‌, బీఆర్‌ గగాయ్‌ నేతృత్వంలో విచారణ..

Andrapradesh

May 21 2021, 10:07

ప్రస్తుతం... కృష్ణపట్నంలోని ఆనందయ్య తోటలో ఉన్న జనసందోహం.
 


కృష్ణపట్నం లోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి... వేలాది మంది కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు....

 పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు..

... కృష్ణపట్నం లో కి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో తీసుకుంటున్నారు...

 మరోవైపు ఇప్పటికే కృష్ణపట్నం లోని ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉండిపోయారు.....

Andrapradesh

May 21 2021, 08:35

రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు మధ్యాహ్నం కీలక విచారణ 
 


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక విచారణ జరపనుంది. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయిలతో కూడిన ధర్మాసనం ఎదుట కేసు జాబితాలో 25 నంబర్‌ ఐటమ్‌ గా ఈ కేసు విచారణకు రానుంది. రాజద్రోహం, తదితర కేసులను మోపి సీఐడీ అరెస్టు చేసిన రఘురామ కృష్ణం రాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వైద్యపరీక్షలకు సంబంధించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు రూపొందించిన నివేదిక... తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు... తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు వేసిన ఎస్‌ఎల్‌పీకి (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) కౌంటర్‌ గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ కూడా కోర్టు పరిశీలనలో ఉంది. మొత్తం ఉదంతంలో వైద్య పరీక్షల నివేదిక, ఆయనపై మోపిన సెక్షన్లు కీలక పాత్ర పోషించనున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.

Andrapradesh

May 21 2021, 08:34

ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు 


ఏపీలో రెండు నెలల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికలు.  

ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు. 

ఎన్నికలు జరిపి కౌంటింగ్ ఆపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు.  

నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.

Andrapradesh

May 20 2021, 18:16

'సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎమ్మెన్వో సాంబ శివుడిని తొలగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు 
 


అనంతపురము, మే 20

అనంతపురము క్యాన్సర్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎమ్మెన్వోగా పనిచేస్తున్న సాంబ శివుడు అనే వ్యక్తిని విధుల నుంచి తొలగించాలని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంటును ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. 

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు అనుమతి లేకుండా కరోనా పాజిటివ్ వ్యక్తులను బలవంతంగా అడ్మిట్ చేసి, ఆసుపత్రి వైద్య సిబ్బంది మధ్య అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించారని ఎమ్మెన్వో మీద ఆరోపణలు రాగా, ఆరోపణలపై విచారణ చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్ అధికారి సదరు ఎమ్మెన్వోను తొలగించాలని సిఫార్సులు చేస్తూ నివేదిక ఇచ్చారు. 

నివేదిక ప్రకారం ఎమ్మెన్వో సాంబ శివుడుని విధుల నుంచి తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంటును ఆదేశించారు.

Andrapradesh

May 20 2021, 18:16

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు: సీఎం
 


ప్రాణం విలువ తనకు బాగా తెలుసని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు.. ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించానని తెలిపారు. రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశామని పేర్కొన్నారు. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించామన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ప్రాణం విలువ తెలుసుకాబట్టే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని ప్రకటించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ‘‘ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించాం. ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం. నాడు- నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. ప్రపంచానికే కొవిడ్‌ పెద్ద సవాల్‌గా మారింది. గత ఏడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో శాంపిల్స్‌ పుణె పంపాల్సిన పరిస్థితులు ఉండేవి.. ఇప్పుడు ఏపీలో 150కి పైగా ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. తొలి వేవ్‌లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్‌ వేవ్‌లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు మనకు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు రాష్ట్రంలో లేవు. కొవిడ్‌ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం’’ అని జగన్‌ తెలిపారు.

Andrapradesh

May 20 2021, 18:15

విద్యావ్యవస్థలో మార్పులు: సీఎం
 


 విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చామని సీఎం జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదు.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచిన తొలిరాష్ట్రం ఏపీ అని చెప్పారు. రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయంపై బతుకుతున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం అన్నారు. రైతులకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలపై నీలం- ఆకుపచ్చ రంగుల్ని.. కుట్రలు పన్ని తుడిచేశారు కానీ జనం గుండెల్లో తీసేయలేకపోయారని జగన్‌ పేర్కొన్నారు.