TSNews

Jun 24 2020, 13:51

పోలీస్ స్టేష‌న్‌కు క‌రోనా సెగ‌...! 
 
 కామారెడ్డి జిల్లా 
By Sridhar Dasari

కామారెడ్డి జిల్లాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది... ఒకే రోజు 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది.. ఇక‌, కామారెడ్డి జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 22కు చేరింది... అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే ప‌నిలోప‌డ్డారు... 46 మంది నుంచి శాంపిల్స్ సేక‌రించారు.. మ‌రోవైపు‌, బాన్సువాడ పోలీస్ స్టేష‌న్‌కు క‌రోనా సెగ త‌గ‌లింది... పీఎస్‌కు వ‌చ్చిన ఓ యువ‌కుడి త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో.. అల‌ర్ట్ అయిన పోలీసులు.. బాన్సువాడ పోలీస్ స్టేషన్ ద‌గ్గ‌ర బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, బాన్సువాడలోని చైతన్య కాలనీలో నివాసం ఉండే ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు.. ఈ క్రమంలో ఆ మహిళకు ప్రైమరీ కాంటాక్టు అయిన ఆమె కుమారుడు తనకు కూడా కరోనా పరీక్షలు చేయాలని ఆస్పత్రికి వెళ్తే.. కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్ష చేస్తామని వైద్యులు స్ప‌ష్టం చేశారు.. ఇక‌, వైద్యులపై ఫిర్యాదు చేసేందుకు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు ఆ యువ‌కుడు.. పీఎస్‌లో హంగామా సృష్టించాడ‌ని తెలుస్తోంది.. అయితే, యువకుడు త‌ల్లికి క‌రోనా సోక‌డం.. ఆ యువ‌కుడు ప్రైమరీ కాంటాక్టు కావడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై.. బారికేడ్లు ఏర్పాటు చేశారు.

TSNews

Jun 24 2020, 13:22

ఇంట‌ర్ బోర్డ్‌లో క‌రోనా క‌ల‌క‌లం... 
 రీ వాల్యుయేష‌న్‌, రీకౌంటింగ్‌పై ప్ర‌భావం 
 
By Sridhar Dasari

తెలంగాణ‌లో ఈ మ‌ధ్యే ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేశారు.. అయితే... అనుమానాలు ఉన్న విద్యార్థులు రీ వాల్యుయేష‌న్‌, రీ కౌంటింగ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది ఇంట‌ర్మీయ‌ట్ బోర్డు... ఇదే స‌మ‌యంలో ఇంట‌ర్ బోర్డులో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది... కార్యాల‌యంలో ఇద్దరు ఉన్నతాధికారుల‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది... ఓ జాయింట్ డైరెక్టర్, ఒక డిప్యూటీ డైరెక్టర్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది... దీంతో.. ఇంటర్ బోర్డ్ ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది... ఇక‌, ఎగ్జిమినేష‌న్ బ్రాంచ్‌లో ప‌నిచేసే అధికారుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం సాగుతోంది... దీంతో.. సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి ఇవ్వ‌ని బోర్డు అధికారులు.. ఇంటర్ ఫ‌లితాల‌పై సందేహాలు ఉంటే.. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాల‌ని సూచిస్తున్నారు.. రీ వాల్యుయేష‌న్‌, రీ కౌంటింగ్‌పై క‌రోనా ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

TSNews

Jun 24 2020, 13:16

తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం...

By Sridhar Dasari

  దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం రేపింది. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేరే..
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం రేపింది. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేరే ఇంకెవరికైనా వైరస్ సోకుతుందన్న భయంతో కార్యాలయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శానిటేషన్ చేశారు.

  మరోవైపు కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు వారిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఎవరెవరనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు వారందరినీ ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తాజాగా వైరస్ సోకిన వ్యక్తితో కలిపి తెలంగాణ భవన్‌లో మొత్తం ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.

TSNews

Jun 24 2020, 11:39

బుల్లితెర షూటింగ్‌లో కరోనా కలకలం...

జూబ్లీహిల్స్‌ 
By Sridhar Dasari

  బుల్లితెరలో కరోనా కలకలం చెలరేగింది. ఓ ఛానెల్‌లోని సీరియల్‌లో నటిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడం.. ఆయన గత అయిదు రోజుల్లో మూడు వేర్వేరు షూటింగుల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. అతను సోమవారం అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం పాజిటివ్‌గా తేలింది. దీనిపై దృష్టి సారించినట్లు టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజయ్‌ యాదవ్‌ తెలిపారు. షూటింగ్‌ల్లో అతనితో కలిసి పనిచేసిన నిపుణులకు, నటులకు, కార్మికులకు కరోనా పరీక్షలు చేయిస్తామన్నారు.

TSNews

Jun 24 2020, 11:21

తెలంగాణ ఉద్యోగులకు  శుభవార్త...

By Sridhar Dasari

  తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూన్‌ పూర్తి వేతనం చెల్లిస్తామని ప్రకటించారు.

  రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతున్న మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈనెల ఉద్యోగులకు పూర్తి వేతనాలు, పెన్షనర్లకు పూర్తి పింఛన్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు.

  పూర్తి జీతం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. 3 నెలలుగా కోత విధించిన వేతనాలు కూడా త్వరలో చెల్లించాలని, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని జేఏసీ ప్రతినిధులు కారం రవీందర్‌రెడ్డి, మమత ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

TSNews

Jun 24 2020, 10:46

ఇప్పట్లో అంతరాష్ట్ర సర్వీసులు లేనట్లేనా...!

By Sridhar Dasari 

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పట్లో అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకలు సాగేలా కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేకపోవడమే మేలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడిపే విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒక దఫా చర్చించారు. మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు.

అయితే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది.

అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో బస్సు సర్వీసులను ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రారంభించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

TSNews

Jun 24 2020, 10:29

తాజాగా కరోనా వైరస్ సోకిన 70 మంది అదృశ్యం 

By Sridhar Dasari

   దేశంలో కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. దీంతో అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు అధికార వర్గాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా వుంటే, కరోనా వైరస్ సోకిన వారిలో పలువురు అధికారులు, వైద్య సిబ్బందిని నానా తిప్పలు పెడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన 70 మంది కనిపించకుండా పోయారు.

   పైగా, పరీక్షల సమయంలో ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాను తప్పుగా ఇవ్వడం వల్ల అదృశ్యమైన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సాయం కోరింది. అదృశ్యమైన వారందరూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మలాడ్‌కు చెందిన వారని అధికారులు గుర్తించారు.
 
   కరోనా రోగుల అదృశ్యంపై మంత్రి అస్లామ్ షేక్ స్పందిస్తూ, ఆ రోగులంతా ఎక్కడికీ పారిపోయి ఉండరని, వారి ఫోన్ నంబర్లు, చిరునామాను నమోదు చేసుకునే క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

TSNews

Jun 23 2020, 23:03

మీకా ఈ-మెయిల్ వచ్చిందా...? జాగ్రత్త...! 

 ఇంటర్నెట్‌ డెస్క్‌: 

 కొవిడ్‌ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్టు మీకేదైనా ఈ-మెయిల్‌ వచ్చిందా? అయితే జాగ్రత్తండోయ్‌..! అలాంటి మెయిల్స్‌ను తెరిస్తే సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కినట్టేనని హెచ్చరిస్తున్నారు సైబర్‌ సెక్యూరిటీ రంగ పేరుతో వచ్చిన ఈ-మెయిల్‌ను ఎట్టిపరిస్థితుల్లో తెరవొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి హానికరమైన ఈ- మెయిళ్లను తెరిస్తే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకున్నట్టేనని, మీ వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్ల చేతిలో పెట్టినట్టేనంటోంది  ద ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (Cert-In). ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఓ నోడల్‌ ఏజెన్సీ. 
ఓ వైపు కరోనా వైరస్‌ జనాన్ని వణికిస్తుంటే.. ఇదే అదనుగా భావిస్తున్న సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటికే దేశంలో అనేకమంది వ్యాపారులు, వ్యక్తులు ఈ మోసాలకు గురవుతున్న వేళ అలాంటి ఈ-మెయిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వస్తే వాటిని తక్షణమే డిలీట్‌ చేయాలంటున్నారు సైబర్‌ నిపుణులు. ప్రపంచమంతా కరోనా భయంలో కొట్టుమిట్టాడుతుంటే... ఈ సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖలు పంపినట్టుగా ఇలాంటి ఫిషింగ్‌ మెయిల్స్‌ను పంపిస్తూ అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. 

క్లిక్‌ చేస్తే.. హుళక్కే..

▪️ ఇలాంటి నకిలీ ఈ- మెయిల్స్‌ మిమ్మల్ని నకిలీ వెబ్‌సైట్ల వైపు తీసుకెళ్తాయి.
▪️ ఈ నకిలీ వెబ్‌సైట్‌లు హానికర ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ కావడంతో పాటు వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడతాయి.
▪️ ఇప్పటివరకు దాదాపు 20లక్షల ఈ మెయిల్‌ ఖాతాలకు ఇలాంటి హానికరమైన మెయిల్స్‌ వెళ్లినట్టు సమాచారం. 
▪️ దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఈ-మెయిల్స్‌ వస్తున్నాయని ఈ నోడల్‌ ఏజెన్సీ తెలిపింది. 

మరేం చేయాలి? 

▪️ కీలకమైన డాక్యుమెంట్లు/ సమాచారాన్ని అత్యంత సురక్షితంగా ఉంచుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీ వైరస్‌ టూల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఈ మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 
▪️ అసాధారణ విషయాలకు సంబంధించిన మెయిల్స్‌ వస్తే వెంటనే http://bit.ly/2hopPKH సమాచారం పంపండి.
▪️ అనుచితంగా ఉండే ఇలాంటి సందేశాలను, ఈ మెయిల్స్‌ను తెరవొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. 
▪️ ఒకవేళ ఇలాంటి ఈ మెయిల్స్‌ మీకు తెలిసిన వారి నుంచి వస్తే మాత్రం వాటిని తెరిచే ముందు జాగ్రత్త. వీలైతే పంపిన వారితో మాట్లాడటం మంచిది.
▪️ రివార్డులు, బహుమతులు, కరోనా ఉచిత పరీక్షలు అంటూ వచ్చే ఈ మ 

 • TSNews
   @TSNews 
  ▪️ రివార్డులు, బహుమతులు, కరోనా ఉచిత పరీక్షలు అంటూ వచ్చే ఈ మెయిల్స్‌తో చాలా అప్రమత్తంగా ఉండాలి. 
TSNews

Jun 23 2020, 22:53

తెలంగాణలో ఒక్కరోజే 879 కేసులు

 హైదరాబాద్‌ 
By Sridhar Dasari

    తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ తీవ్ర కలవర పెడుతోంది. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9వేల మార్కును దాటేసింది. మంగళవారం తాజాగా 879 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9553కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్‌ పరిధిలో 112 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
220కి చేరిన మరణాలు
ఈ రోజు 3006 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. 879 పాజిటివ్‌ కేసులు వచ్చాయని బులిటెన్‌లో వెల్లడించింది. కొవిడ్‌ బాధితుల్లో 219మంది ఈ రోజు డిశ్చార్జి కాగా.. కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 9వేలకు పైగా కేసుల్లో 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ప్రస్తుతం  5109మంది చికిత్సపొందుతున్నారు.

TSNews

Jun 23 2020, 19:53

అనవసరంగా కరోనా పరీక్షలు చేయొద్దు...!

ప్రైవేటు డయాగ్నోస్టిక్స్‌ ప్రతినిధులతో ఈటల 

 హైదరాబాద్‌ 
By Sridhar Dasari

 కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ నిర్వాహకులను కోరారు. పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలూ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షలు చేస్తున్న డయాగ్నోస్టిక్స్‌ ప్రతినిధులతో హైదరాబాద్‌లో మంత్రి సమావేశం నిర్వహించారు. అనవసరంగా ఎవరికీ పరీక్షలు నిర్వహించొద్దనీ.. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలని డయాగ్నోస్టిక్స్‌ను ఆదేశించారు. కొవిడ్‌ పరీక్షలకు వచ్చే ప్రతిఒక్కరూ ఐసోలేషన్‌లో ఉండేలా సూచించాలన్నారు. 
అందరికీ పరీక్షలు అసాధ్యం
కరోనా పరీక్షలపై అనవసర ప్రచారాలు చేయొద్దన్న మంత్రి.. విమానాల్లో వచ్చినవారికి లక్షణాల్లేకపోయినా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం టెస్టింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉందని తెలిపారు. అనుమానం, భయంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు వద్దనీ.. దేశంలో అందరికీ పరీక్షలు నిర్వహించడం అసాధ్యమన్నారు.