మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం, జూన్ 28 : *జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా గట్టి నిఘా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్, లాంటివి సాగు, రవాణా చేయకుండా చూడాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో గతేడాది జూన్ నుంచి నవంబర్ వరకు కెనాబీస్, ఆల్కహాల్, గంజాయిలాంటి కేసులు నమోదు కాగా, వైజాగ్, శ్రీకాకుళం నుంచి వస్తున్న, అనంతపురం మీదుగా బళ్లారి వెళుతున్న ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేయాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రయాణికులను కూడా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలలు, హైస్కూల్ లలో కమ్యూనిటీ డ్రైవ్ చేపట్టాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద, సరిహద్దు ప్రాంతాలలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణాపై నిఘా ఉంచాలని, ఎక్కడి నుంచి రవాణా జరిగే అవకాశం ఉందో పరిశీలించి ముఖ్యమైన బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. జిల్లాలో ఎక్కడ గంజాయి సాగు చేయడానికి వీలు లేకుండా చూడాలని, మారుమూల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో పలు చోట్ల పోస్టర్లను, ఐఈసీ మెటీరియల్ ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ కళాశాలలలో సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అన్నిచోట్ల సౌకర్యాలు బాగా కల్పించాలన్నారు. జిల్లాలోని రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో మత్తు పదార్థాలు ఉపయోగించకుండా అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా నశాముక్త భారత్ లో భాగంగా ఎన్హెచ్ఎం ఐఈసీ యాక్టివిటీల కింద "JUST SAY NO TO DRUGS" మరియు "SAY NO TO DRUGS" అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.* - *ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, డిటిసి వీర్రాజు, అనంతపురం ఆర్డిఓ గ్రంధి వెంకటేష్, డిఎంహెచ్ఓ డా.ఈ బి.దేవి, డీఈఓ వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్, జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డివీఈఓ వెంకటరమణ నాయక్, ఏసిఐఓ శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 26 2025, 20:03