'ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'
నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, ముకుందాపురం గ్రామంలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాల పదో తరగతి 2002-2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ మేరకు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అక్కిరెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, దామోదర్, వెంకట్ రెడ్డి, నాగార్జున, సృజన, సరస్వతి, రంజాన్, మహమ్మద్ మరియు విద్యార్థులు అఖిల్ రెడ్డి, మహేష్, శ్రీధర్ రెడ్డి, సుచిత్ర, స్వాతి, దీప్తి, ప్రసన్న, వీణ, శివ, కోటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Jun 02 2026, 12:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2