NLG: సీఎం కప్ 2026 జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నల్లగొండ: ఈనెల 15, 16, 17 తేదీలలో 2026 సీఎం కప్ క్రీడోత్సవాలను 44 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఎండి అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుంటూ, ఎడిషన్ 2 జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ ను ప్రదర్శించిన క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని తెలిపి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. హాకీ, బేస్బాల్, టైక్వాండో క్రీడలను కలెక్టర్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇమామ్ కరీం, ఆర్థిక కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, చెస్ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శులు యాకస్వామి, యునుస్, అనిల్, సుధాకర్, బేస్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు చివుట జ్యోతి, ఎండి అలీమ్, కవిత, అష్రఫ్ అహ్మద్, కోచ్ లు, క్రీడాకారులు క్రీడల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
10 hours ago
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.3k