/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ Raghu ram reddy
ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ

తెలంగాణ‌లోని ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దాడుల్లో అవ‌నీతికి పాల్ప‌డే అధికారులు చిక్కుతున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణం ఎస్ఆర్‌సీ నీటి పారుద‌ల శాఖ అసిస్టెంట్ ఇంజ‌నీర్ న‌ర్సింగ‌రావును ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్య‌క్తి నుంచి లంచం డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

రూ.20,000 తీసుకుంటుండ‌గ

కాంట్రాక్ట‌ర్‌కు ఓ బిల్లు విష‌యంలో ఏఈ న‌ర్సింగ‌రావుకు లంచం డిమాండ్ చేశారు.

దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్ట‌ర్ రూ.20,000లు అంద‌జేశారు. అక్క‌డే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో సిబ్బంది దాడి చేసి ప‌ట్టుకున్నారు.

అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయ‌న్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాల‌యంలో రికార్డుల‌ను ప‌రిశీలిస్తున్నారు.

పవన్ కు ఢిల్లీ పిలుపు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరు కానున్నారు.

ఉప ముఖ్యమంత్రి..జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారింది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ ముఖ్యుల సూచన మేరకు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ చర్చలు రాజకీయంగా కీలకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేసారు. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్ పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బిజెపి కూటమి గెలుపొందింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.

ఇప్పుడు బీజేపీ జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో, పవన్ సేవలను దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా దక్షిణాదిన పవన్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించటం ద్వారా పవన్ గురించి పలు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చ కొనసాగింది. తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ అన్నామలై బీజేపీ కోసం శ్రమించినా..తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. దీంతో, పవన్ కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ రేపు (మంగళవారం) ముంబాయి చేరుకోనున్నారు. మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించి న బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. ఎన్డీఏ భాగస్వామి గా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. మహారాష్ట్ర లో కొత్త సీఎం ఖరారు పైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీలో మకాం వేసారు. ఈ సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎం గా ఫడ్నవీస్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, త్వరలో ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

మణిపూర్‌లో మరో దారుణం

మణిపూర్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల పలువురు మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత హత్య చేసిన ఘటన.. మరోసారి మణిపూర్‌లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ మహిళలు, చిన్నారుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించగా.. అందులో డాక్టర్లు సంచలన విషయాలు వెల్లడించారు. నదిలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే షాక్ అయ్యారు.

ఏడాదిన్నరకు పైగా మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య చోటు చేసుకుంటున్న తీవ్ర హింసాత్మక ఘటనల్లో ఇటీవల జరిగిన మహిళలు, చిన్నారుల.. కిడ్నాప్, హత్యలు మరోసారి తీవ్ర సంచలనం రేపుతున్నాయి. గతేడాది ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపగా.. తాజాగా కొందరు మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేసి.. అతి కిరాతకంగా చంపి.. నదిలో పడేసిన ఘటన మరింత తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అంతేకాకుండా ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఆ నివేదికలో వెల్లడైన విషయాలు చూసి అంతా షాక్ అవుతున్నారు. అత్యంత దారుణంగా మహిళలు, చిన్నారులను చంపేశారని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది.

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు.. ఇటీవల కిడ్నాప్‌కు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వారి మృతదేహాలు.. నదిలో కొట్టుకువచ్చాయి. ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం చేయగా.. సంచలన విషయాలు బయటికి వచ్చాయి. వారిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది. 3 ఏళ్ల బాలుడు సహా మహిళల మృతదేహాలపై కాల్పులు, గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. వారిలో 3 ఏళ్ల బాలుడికి అసలు కన్నే కనిపించలేదు. అంతేకాకుండా అతడి పుర్రెలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని.. అతడి ఛాతిపై దెబ్బలు, కత్తిపోట్లు, నుదిటిపైనా గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఇక ఆ బాలుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉన్నట్లు గుర్తించారు.

ఇక ఆ 3 ఏళ్ల బాలుడి తల్లి మృతదేహంపై 3 బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు తేలింది. ఆ బాలుడి నానమ్మ(60) మృతదేహంపై మొత్తం 5 బుల్లెట్‌ గాయాలు ఉన్నాయని.. తలలో ఒకటి.. ఛాతిలో 2.. కడుపులో ఒకటి.. భుజంలో బుల్లెట్ గాయాలు అయినట్లు గుర్తించారు. ఈ ఇద్దరు మహిళల శరీరాలపై చాలా చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇక మరో మహిళ, ఇద్దరు చిన్నారుల పోస్టుమార్టం రిపోర్ట్‌లు బయటికి రావాల్సి ఉంది.

ఇక మైతీ వర్గానికి చెందిన 9 మంది మృతుల్లో ఆరుగురు ఈనెల 11వ తేదీన కిడ్నాప్ అయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల ఉన్నారు. వారి మృతదేహాలు నదిలో కొట్టుకురావడం పెను సంచలనంగా మారింది. వారి మృతదేహాలను అస్సాంలోని సిల్చర్‌ మెడికల్ కాలేజీకి తరలించి పోస్టుమార్టం చేశారు. అయితే ఆ మృతదేహాలను అధికారులు తీసుకెళ్తుండగా.. బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వారికి న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలనీయమని తేల్చి చెప్పారు. చివరికి అధికారులు వారిని వారిని ఒప్పించి మణిపూర్‌లోని జిరిబామ్‌కు మృతదేహాలను తరలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

కిటకిటలాడుతున్న శబరిమల

భక్తజన సందోహంతో శబరిమల అయ్యప్ప ఆలయం కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకుంటున్నారు. 

నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా, ఈ తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం 3,03,501 మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలిపారు. పోలీసుల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారని చెప్పారు. 

గత ఏడాది రూ.13.33 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటి వరకు రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని తెలిపారు. వండి పెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్ లైన్ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పంబాలోని మనప్పరం ఆన్‌‌లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్పారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. 

 

ఇక పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. నదిని కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టిన గతే తెలంగాణ కాంగ్రెస్‌కు పడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపిందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం.. తెలంగాణ, కర్ణాటకలో పాలనేనని విమర్శించారు.

మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించిందని బండి సంజయ్ అన్నారు. ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహా సత్య దేవాలయం ఆవరణలో ఇవాళ(శనివారం) కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ సాధించిందని అన్నారు. కాంగ్రెస్ సీఎంలు అంతా కలిసి ప్రచారం చేసినా ఆ పార్టీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన చోట కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని మహా ప్రజలు నమ్మలేదని. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని బండి సంజయ్ విమర్శించారు.

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని అన్నారు. మహారాష్ట్రలో విజయ డంక మోగించామని ఉద్ఘాటించారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సిద్ధాంతానికి వ్యతిరేకంగా శివసేన వెళ్లిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని చెప్పారు.తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని ఎద్దేవా చేశారు. తాము కూల్చాలని అనుకోవడం లేదని చెప్పారు. మహా ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో లకలుకలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ట్రెండ్స్ ప్రకారం, మహాయుతికి బంపర్ మెజారిటీ వస్తుంది, 200 కంటే ఎక్కువ సీట్లలో ఆధిక్యం, సంజయ్ రౌత్ ట్రెండ్‌లపై ప్రశ్నలు లేవనెత్తారు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో, మహావికాస్ అఘాడి కూటమి కంటే మహాయుతి కూటమి పెద్ద ఆధిక్యం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీయే సంఖ్య పెరుగుతోంది. దీని సీట్లు 215కి పెరిగాయి.

కాగా, ఎంవీఏ 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, ఏదో తప్పు జరిగిందని శివసేన (యుబిటి)కి చెందిన సంజయ్ రౌత్ అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదు. గెలుపు ఓటములు ఉంటాయి.

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 124, శివసేన 55, ఎన్సీపీ 35, కాంగ్రెస్ 21, శివసేన యూబీటీ 19, ఎన్సీపీ(ఎస్పీ) 13, ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

పార్టీ ధోరణి

బీజేపీ 125

శివసేన (షిండే) 55

NCP 35

SHS(UBT) 17

కాంగ్రెస్ 21

సంజయ్ రౌత్ ట్రెండ్‌లపై ప్రశ్నలు సంధించారు

ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్‌లో మహాయుతి ఆధిక్యంపై, శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, 'ఇది మహారాష్ట్ర ప్రజల నిర్ణయం కాదు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు.

మహారాష్ట్రలో బీజేపీ జోరు

భారత దేశంలో సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు బీజేపీ కూటమి ముందంజలో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూడా గట్టి పోటీ ఇస్తుంది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో కూటమి మెజారిటీ 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. గత రెండు పర్యాయాలు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి.. మూడోసారి మిత్రపక్షాల వెన్నుదన్నుతో కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. అయితే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది. మరోవైపు జమ్ము కశ్మీర్ లో ఎక్కువ ఓట్టు తెచ్చుకున్న పార్టీగా చరిత్ర తిరగరాసింది. బీజేపీ పనైపోయిందన్న వాళ్లు మూయించారు. హర్యారా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలుబడిన వెను వెంటనే మహారాష్ట్రతో పాటు, జార్ఖండ్ కు ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 13, 20న రెండు విడతల్లో జార్ఖండ్ లో పోలింగ్ జరిగింది.

మరోవైపు మహారాష్ట్రలోని 288 సీట్లకు ఈ నెల 20న ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (ఎన్డీయే) కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా కూటమి మొత్తంగా.. మహాయుతి దాదాపు సెంచరీ మార్క్ దాటి మెజారిటీకి చేరువలో 151 సీట్లలో ఉంది. బీజేపీ 55 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు శివసేన 34 సీట్లో ముందుంజలో ఉంది. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 19 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ 84 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తగా కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు.. శివ సేన ఉద్ధవ్.. 10.. ఎన్సీపీ .. 12 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ నేతృత్వంలో మహాయుతి అధికారంలోకి రావడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మొత్తంగా 12 గంటల వరకు మొత్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలవబోతుందో క్లియర్ పిక్చర్ రానుంది.

పోలీసులకు పవన్‌కల్యాణ్ ఆదేశం

తమ ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు.

రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్(ఎక్స్) లో ఓ పోస్ట్ చేశారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలను ప్రాధాన్యం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లు, ఎస్పీలను‌ కోరారు. తమ ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసినట్లుగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా భ్రష్టు పట్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఇటీవల సమీక్షలు నిర్వహించినప్పుడు ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు బయటకు వచ్చాయని, వాటిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారికి 15 రోజుల్లోపు జాబ్‌ కార్డులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేసి 7 కోట్ల పని దినాలు కల్పించామని తెలిపారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20 వేల మినీ గోకులం షెడ్లు, అవసరమైనచోట్ల వాటర్‌ హార్వెస్టింగ్‌ పనులు చేపట్టామని, వచ్చే సంక్రాంతిలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ప్రతి పంచాయతీలో సిటిజన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు ఏర్పాటు చేశామని, జాబ్‌కార్డుల జారీలో అవకతవకలను అరికడతామన్నారు. 100 రోజులు పని కల్పించలేకపోతే పరిహారం చెల్లిస్తామన్నారు. తీరప్రాంత కోత నియంత్రణకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తాం. తద్వారా మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు చేపడతాం’ అని చెప్పారు. కాగా, 25 నుంచి జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన ఎంపీలకు పవన్‌ సూచనలు చేశారు. కాగా, ప్రభుత్వ భూముల అక్రమణలు, దౌర్జన్యంగా భూ దురాక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందినపుడు వెంటనే స్పందించాలని పోలీస్‌ శాఖకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

తుంగభద్రకు 33 గేట్లు ఒకేసారి మార్చేయాలి

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు.

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు. మరో క్రస్ట్‌గేటు కొట్టుకుపోదని గ్యారెంటీ ఇవ్వలేం. అత్యాధునిక డిజైన్‌తో 33 క్రస్ట్‌గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే పరిష్కారం’’ అని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 33 గేట్లు ఏకకాలంలో మార్చడంపై తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు(టీబీపీ బోర్డు) దృష్టి పెట్టింది. ఇలా ఒకేసారి 33 గేట్లు మార్చడం సాధ్యమేనా? ఎంత నిధులు కావాలి? అనే అంశంపై ఆరా తీసింది. దీనికి సంబంధించి డిసెంబరులోగా క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించి, పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు చైర్మన్‌ పాండే అధ్యక్షతన టీబీపీ బోర్డు పేర్కొంది. శుక్రవారం హోస్పెట్‌లో బోర్డు భేటీ జరిగింది. బోర్డు సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్ర సభ్యుడు కులకర్ణి, బోర్డు ఎస్‌ఈ నీలకంఠారెడ్డి, ఏపీ రాష్ట్ర సభ్యుడి తరఫున అనంతపురం జిల్లా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సీఈ నాగరాజు హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున రిచామిశ్ర, తెలంగాణ సభ్యుడు, ఈఎన్‌సీ అనీల్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. జలాశయంలో పూడిక చేరడంతో 30 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. ఆ నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రభుత్వం 31 టీఎంసీలతో నవలీ జలాశయం నిర్మాణానికి ప్రతిపా దిస్తోంది. దీనికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని బోర్డు సమావేశంలో తెలిపింది. డీపీఆర్‌ను అధ్యయనం చేయాల్సి ఉండడంతో నవలీ రిజర్వాయర్‌కు ఏపీ అభ్యంతరం చెప్పింది. రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలు వినియోగించుకునేలా తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా మరో కాలువ నిర్మించే తేల్చాలని పేర్కొంది. కాగా, తెలంగాణ ఈ రెండింటినీ వ్యతిరేకించినట్లు సమాచారం.

తుంగభద్ర బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ కావడంతో ఉద్యోగులు జీతాలు లేకుండా ఎలా పని చేస్తారు? బోర్డు సెక్రెటరీ, ఎస్‌ఈలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే అకౌంట్‌ ఫ్రీజ్‌ తొలగించాలి’’ అని పాండే ఆదేశించారు. తుంగభద్ర దిగువ, ఎగువ కాలువల సీసీ లైనింగ్‌ కోసం రూ.400 కోట్లతో టెండర్లు పిలిచి.. అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన టెండర్ల జీవో(టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసే అధికారం) బోర్డుకు వర్తించదని స్పష్టం చేశారు.

పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. మండలి వేదికగా నిన్నటి రోజున హాట్‌ కామెంట్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..

ఈ రోజు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కారెక్కేందుకు వస్తుండటం చూసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఎదురుగా వెళ్లి పవన్‌ను పలకరించారు.. పవన్ కల్యాణ్‌ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు బొత్స.. మరోవైపు పవన్‌ వస్తుండడాన్ని చూసి పక్కకు వెళ్లిపోయారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు.

అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కారు ఎక్కేందుకు వస్తున్న సమయంలో పవన్ కంటపడి నమస్కారం చేశారు బొత్స సత్యనారాయణ.. ఇక, బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లారు పవన్ కల్యాణ్‌.. అయితే, పవన్ కల్యాణ్‌ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు బొత్స.. అంతే కాదు.. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టి అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కారువైపు వెళ్లిపోయారు.. అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.