/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz చెరువుల రక్షణ కోసం హైడ్రా కీలక నిర్ణయం Raghu ram reddy
చెరువుల రక్షణ కోసం హైడ్రా కీలక నిర్ణయం

హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు.

హైడ్రా ఈ ఏడాది జూలై‌లో ఏర్పడిందని.. అర్బన్ డిజాస్టర్స్, ఎంక్రోచ్‌ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇవాళ(శుక్రవారం) బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కమిషనర్ రంగనాథ్ కీలక సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఈఎన్సీలు, ఇరిగేషన్ సీఈలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను అధికారులు నిర్ణయించారు.

ఇకపై చెరువులు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఐఎండీ 1875లో ఏర్పడింది. హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదు. ఇది వరకు ఈవీడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో భాగంగా ఉండేది.. అప్పుడు ఐఏఎస్‌లు, కమిషనర్లు ఉండేవారు. ఇప్పుడు సెపరేట్ వింగ్‌గా ఏర్పడింది. హైడ్రాకు మొదటి కమిషనర్‌గా ఉండటం సంతోషంగా ఉంది.దేశంలోనే మొదటి సారి హైడ్రా తీసుకొచ్చారు. కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది.. వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, లేక్స్ ఆక్రమణలకు గురవుతున్నాయి.. వాటికోసం హైడ్రా పనిచేస్తుంది. హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులు.. ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేది..ఇప్పుడు కనెక్టివిటీ లేదు. నాలాలు కూడా సరిగా లేవు. గట్టి వర్షం పడితే ముంపుకు గురవుతాయి..దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు 10వేల మంది చనిపోయారు. పేదరికం వల్ల చాలామంది ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఐఎండీ వల్ల ముందే ఊహించగలుగుతున్నారు.. డిజాస్టర్ట్స్‌లో కూడా మార్పులు వస్తున్నాయి..దేశంలో అర్బనైజేషన్ పెరుగుతుంది.తెలంగాణలో అర్బనైజేషన్ పెరుగుతుంది. వెహికిల్ పాపులేషన్ 80 లక్షలుగా ఉంది. సిటీ ట్రాఫిక్ అడిషినల్ సీపీగా కూడా ఉన్నాను. 2, 3 సెంటిమీటర్ల వర్షం పడితే మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మెట్రో సిటీలలో వాతావరణ మార్పులు ఎక్కువగా ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్స్ కూడా పెరుగుతున్నాయి. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి.. వర్షం పడినప్పుడు వరద నీరు ఇంకడానికి చాలా సమయం పడుతుంది. సాయంత్రం 4, 5 గంటలకు వర్షం పడితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.. ఆ నీరు ఇంకడానికి మార్గాలు లేవు.. సిటీలో 150 వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. అర్బన్ డిజాస్టర్‌ల మీద ఫోకస్ పెట్టాలి.157 ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ ఉన్నాయి.. ఇంకా కావాలి. ప్రతి 15నిమిషాలకు బెంగుళూరులో ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌ల నుంచి డేటా కలెక్ట్ చేస్తారు.. మనం కూడా దీనికి మారాలి.

సిటీలో వెదర్ రెడర్స్ కావాలి..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హిల్ ఏరియాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. వెదర్ అలర్ట్స్ స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇక్కడ వర్షం పడుతుందని కాకుండా ఇక్కడ పడదని చెప్పేలా వెదర్ అలర్ట్స్ ఉండాలి. వర్షాలు పడుతున్నపుడు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్ల ఎకనామికల్ లాస్ కూడా ఏర్పడుతుంది..హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుంది. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుంది. నేను మెకానికల్ ఇంజనీర్‌ని, అయినా వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలు వెదర్ అలర్ట్స్‌ని సీరియస్‌గా తీసుకునేలా హైడ్రా పని చేస్తుంది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

కర్నాటకలో వక్ఫ్ బోర్డు ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రజలలో ఆగ్రహం,వీధుల్లోకి సాధువులు మరియు రైతులు

కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా ఆస్తులపై వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. దీని ఫలితమే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావడం ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు ఆక్రమణలకు వ్యతిరేకంగా సాధువులు, రైతులు మరియు బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేసిన కలబురగిలో తాజా కేసు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెగిలయోగి స్వాభిమాన్ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మఠాల హిందూ సాధువులు, భాజపా నాయకులు, రైతు అనుకూల సంఘాల సభ్యులు వక్ఫ్‌ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మూడు రోజుల పాటు “వక్ఫ్‌ను తొలగించండి, అన్నదాతను రక్షించండి” అని నిరసన ప్రదర్శన చేపట్టారు. బోర్డు. నిరసన సందర్భంగా, సాధువులు మరియు బిజెపి నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి BZ జమీర్ అహ్మద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలబురగిలోని నాగేశ్వర్ స్కూల్ నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు తమ చేతుల్లో జమీర్ హటావో, జమీన్ బచావో, రైతు దేశ ఆస్తి, వక్ఫ్ హఠావో, అన్నదాత బచావో నినాదాలతో కూడిన ప్లకార్డులను పట్టుకున్నారు.

ఈ సందర్భంగా కర్ణాటక శాసనమండలి నేత చలవాడి నారాయణస్వామి మాట్లాడుతూ.. పరిస్థితి చూస్తుంటే. రైతుల భూములు లాక్కుంటున్నారు. కలబురగిలో ఈ నిరసన జరుగుతోంది. మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం.

అంతకుముందు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రీతమ్‌గౌడ మాట్లాడుతూ, తమ ఫిర్యాదులను అందించడానికి రోజంతా వేలాది మంది బాధిత వ్యక్తులు మరియు రైతులను వేదికపైకి ఆహ్వానించారు. జిల్లాల వారీగా సమస్యల తీవ్రతను సమీక్షిస్తున్నాం. ఈ ఆందోళనల పరిష్కారానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఇప్పటికే మూడు బృందాలను ప్రకటించారు. ఈ బృందాలు రైతులు, మత సంస్థలు మరియు ప్రజల ఫిర్యాదులను వినడానికి జిల్లాలకు వెళ్తాయి మరియు వారి పరిశోధనలు రాబోయే బెలగావి అసెంబ్లీ సమావేశంలో చర్చించబడతాయి.

మండిన హనుమంతుడి విగ్రహం

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఆలయంలో అగ్నికీలలు వ్యాపించాయి. హనుమంతుడి విగ్రహం మంటలబారిన పడింది. భగభగమంటూ మండిపోయింది. పూర్తిగా దగ్ధమైంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడం పట్ల స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

జిల్లాలోని మహాదేవ్‌పూర్ మండలం అంబటిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత అమరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది ఈ గ్రామంలోనే. రోజూ భక్తులు ఆలయానికి వస్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కార్తీకమాసం కావడం వల్ల భక్తుల తాకిడి రోజువారీ కంటే అధికంగా ఉంటోంది.

ఈ ప్రాంగణంలో గల ఉపాలయాల్లో ఒకటైన ఆంజనేయ స్వామి గర్భగుడిలో అంతుచిక్కని విధంగా అగ్నికీలలు వ్యాపించాయి. హనుమంతుడి విగ్రహం పూర్తిగా దగ్ధమైంది. మంటలు చెలరేగినట్లు సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.

మంటల వల్ల గర్భగుడి మొత్తం పొగచూరింది. అక్కడి వస్తువులు, పూజా సామాగ్రి అగ్నికి మొత్తం అహూతి అయింది. స్వామివారి వస్త్రాలు కాలిపోయాయి. ఇది ప్రమాదమా? లేక కుట్రా అనేది తేలట్లేదు. ఉద్దేశపూరకంగా ఎవరైనా నిప్పంటించి ఉంటారా? లేక దీపాల వల్ల మంటలు అంటుకుని ఉంటాయా? అనేది నిర్ధారణ కావట్లేదు.

హనుమంతుడి విగ్రహం మాత్రమే ఉన్నట్టుండి మంటల బారిన పడటం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంజన్న విగ్రహం దగ్ధం కావడం ఊరికి అరిష్టం అనే ఆందోళన నెలకొంది. కాగా ఈ ఘటనపై గ్రామస్తులు, ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ

గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అమెరికా జ‌డ్జి ఆ ఆదేశాలు ఇచ్చారు. మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్ స్కామ్‌లో గౌతం అదానీని దోషిగా తేల్చారు. సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం జ‌రిగిన బాండ్ల సేక‌ర‌ణ‌లో అదానీ ముడుపులు ఇవ్వ‌చూపిన‌ట్లు తెలుస్తోంది.

అదానీ గ్రూపు సంస్థ ఓన‌ర్ గౌతం అదానీ( Gautam Adani)కి.. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. 265 మిలియ‌న్ల డాల‌ర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్ల‌లో దాదాపు రెండు బిలియ‌న్ల డాల‌ర్ల లాభం వ‌చ్చే సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భార‌తీయ ప్ర‌భుత్వ అధికారుల‌కు గౌతం అదానీతో పాటు మ‌రో ఏడు మంది ముడుపులు ఇవ్వ‌చూపిన‌ట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగ‌ర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగ‌ర్ అదానీ అరెస్టు వారెంట్‌ను జ‌డ్జి జారీ చేశారు. ప్రాసిక్యూట‌ర్లు ఆ వారెంట్‌ను .. విదేశీ న్యాయ‌శాఖ‌కు అంద‌జేయ‌నున్నారు.

అమెరికా డాల‌ర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియ‌న్ల డాల‌ర్లు స‌మ‌కూర్చాల‌ని అదానీ గ్రీన్ ఎన‌ర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్‌ను ర‌ద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీ నేప‌థ్యంలో.. అదానీ గ్రూపు ఆ ప్లాన్‌ను ర‌ద్దు చేసింది.

అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎన‌ర్జీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అమెరికా పెట్టుబ‌డీదారుల‌ను, అధికారుల‌ను మోసం చేసిన‌ట్లు గౌతం అదానీపై అభియోగాలు న‌మోదు అయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ క‌మీష‌న్ ఆ అభియోగాలు చేసింది.

రంగుమారుతున్న తుంగభద్ర జలం

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‏లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీ పంటలో కూడా దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‏లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీ పంటలో కూడా దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు. కొప్పాళ, విజయనగర, బళ్లారి, రాయచూరు(Koppal, Vijayanagara, Bellary, Raichur) జిల్లాలకు కూడా ఈ జలాశయం నుంచి తాగునీరు అందుతుంది.

కలుషిత నీటి వల్ల ఎక్కడ అనారోగ్యానికి గురవుతామోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైతు సంఘ నాయకులు సింధిగేరి గోవిందప్ప మాట్లాడుతూ జలాశయానికి పైభాగంలో ఉండే హరప్పనహళ్లి, హగరి బొమ్మనళ్లి, తదితర ప్రాంతాల్లోని కర్మాగారాలు వ్యర్థ పదార్థాలను జలాశయంలోకి వదులుతుండటం వల్ల నీరు కలుషితమై పచ్చరంగులోకి మారుతున్నాయన్నారు.

దీని వల్ల ఇటు రైతులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. అలాగే వేసవి సమయంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు తాగునీటికి ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి జలాశయంలో నీరు కలుషితం కాకుండా చూడాలని కోరారు. లేకపోతే జలాశయం ఎదుటనే నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి సేవలు ఉన్నాయి.

వర్చువల్ సేవా టికెట్లు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్‌ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అంగ ప్రదక్షిణం టోకెన్లు

అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఫిబ్రవరి కోటాను నవంబరు 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

శ్రీవాణి ట్రస్టు టికెట్లు

శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్ల ఫిబ్రవరి నెల కోటా నవంబరు 23న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ఫిబ్రవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 25న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

తిరుమల, తిరుపతి గదుల కోటా

తిరుమల మరియు తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

బుకింగ్ కోసం సూచనలు

శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, మరియు గదుల కోటాలను బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ సూచించింది.

భక్తులు నిర్దిష్ట తేదీలను గమనించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తగ్గేదేలే అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

గ్రేటర్‌లో ఫుడ్‌‌సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో హోటళ్లలో, రెస్టారెంట్లలో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ, ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

గ్రేటర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నాయి. ఆహారం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటళ్లపై వరుసగా దాడులు చేస్తున్నారు. ఆహార నాణ్యత విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ, ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దారుణమైన విషయాలు బయటపడుతున్న పరిస్థితి. చికెన్, మటన్, ఫిష్‌తో పాటు పన్నీర్ చెడిపోకుండా కెమికల్స్ కలుపుతున్నట్లు గుర్తించారు.

రెస్టారెంట్ల నిర్వాహకులు.. ఫార్మలిన్ కలిపిన చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. వంటకాల్లో సింథటిక్ కలర్లు కలిపిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పొట్టుతో పాటు కుళ్లిన అరటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. బట్టల రంగుల్లో వాడే ప్రమాదకరమైన కాస్టిక్ సోడాను కూడా ఫుడ్ కలర్స్‌గా వినియోగిస్తున్నట్లుగా తనిఖీల్లో బయటపడింది. సిటీలో 64% హోటల్స్ , రెస్టారెంట్స్ కల్తీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు అధికారులు. హోటల్స్‌తో పాటు మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నజర్ పెట్టారు.

రాజేంద్రనగర్ కాటేదాన్‌లో పలు కార్ఖానలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం, వెల్లుల్లి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సింథటిక్ కలర్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వచేసిన 1400 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేశారు. దాడుల్లో భాగంగా 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీ‌పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో ఫుడ్ క్వాలిటీ‌లో హైదరాబాద్ చివరిగా నిలిచిన విషయం తెలిసిందే. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి. . 62% హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.

నేను కూడా రాజీనామా చేసి వెళ్ళాలనుకున్నా

శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 8,047 మంది పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణ పొందారని.. ఇందులో 4,100 సివిల్, 3,685 మంది ఏఆర్ 2,028 కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో నుంచి హైదరాబాద్ పోలీస్ శాఖకు 1,128 మందిని ట్రైనింగ్ కోసం కేటాయించినట్లు చెప్పారు. ఇప్పుడు 747 మంది దీక్షత్ పాసింగ్ అవుట్ పరేడ్ చేశారన్నారు. 3,081 మంది మహిళల కానిస్టేబుల్స్ పోలీస్ శిక్షణ పొందారన్నారు.

1992లో నేను ఐపీఎస్ శిక్షణ పొందాను పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అప్పుడు 80 మంది ట్రైనీ ఐపీఎస్‌లు పాల్గొన్నాం. వర్షం పడుతున్నా పరేడ్ పూర్తి చేశాం’’ అంటూ ఆనాటి విషయాలను గుర్తుచేశారు సీపీ. శిక్షణ పొంది పోలీస్ శాఖలో 35 ఏళ్లు గడపబోతున్నారని... శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలని సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపారు.

అలాగే పోలీసులకు సీపీ ముఖ్య సూచన చేశారు. పోలీసులు తాగుడుకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. యువ పోలీసులు ఫిజికల్ ఫిట్‌నెస్‌గా ఉండాలని.. దేనికి ఏ వ్యసనానికి కూడా లొంగకూడదని.. బానిస కాకూడదని తెలిపారు. ‘‘నా 33 ఏళ్ల పోలీస్ సర్వీస్‌లో 75 కేజీల మధ్యలో ఉన్నాను. నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. 30 ఏళ్ల క్రితం నా ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో వేసుకున్న పోలీస్ డ్రెస్ ఇప్పుడు కూడా వేసుకోగలను. మీరు శిక్షణ పొందిన పేట్లబురుజు ఆర్మ్ రిజర్వ్ ఇన్చార్జ్ డీసీపీ దక్షిణామూర్తిని చూడండి ఎంత ఫిట్‌గా ఉన్నారో. ఫిట్‌గా ఉన్న వారిని ఆదర్శంగా తీసుకోండి. పోలీసుల జీతాల విషయంలో ప్రభుత్వం ఎక్కువగా పెంచదు. పోలీసులు అవినీతికి పాల్పడకూడదు. ఐపీఎస్ లాంటి ఉద్యోగంలో కూడా జీతాలు అంతంత మాత్రమే. పోలీస్ శాఖలో మెల్లమెల్లగా జీతాలు పెరుగుతూనే ఉంటాయి. పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది. ఒక పరిస్థితిలో నేను కూడా రాజీనామా చేసి వెళ్ళలనుకున్నా. శిక్షణ తీసుకున్నవారు మీ సేవల ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి’’ అంటూ సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

తెలంగాణా పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్స్ నాలుగవ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్, పోలీసులు ఉన్నతాధికారులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఆర్, సివిల్, ఎస్‌ఏఆర్‌సీపీఎల్, ఐటీ, సీఏఎన్‌పీటీఓ విభాగాలకు చెందిన 8,047 మంది స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ శిక్షణ విజయవంతమైంది. ఫిబ్రవరి21, 2024లో స్టైపెండరీ ట్రైనీ కానిస్టేబుల్స్ శిక్షణ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 19 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ జరిగింది. కానిస్టేబుల్ శిక్షణ పొందిన వారిలో 5709 పురుషులు, 2338 మహిళ అభ్యర్థులు ఉన్నారు. ట్రైనీ కానిస్టేబుల్స్‌కు సమగ్రంగా అన్ని అంశాలపై శిక్షణ పూర్తి అయ్యింది. సివిల్, క్రిమినల్, సైబర్ కేసులు, ఎన్‌డీపీఎస్ యాక్ట్, క్రైమ్, సెల్ఫ్ డిఫెన్స్ ఇలా చాలా అంశాలపై ట్రైనింగ్ జరిగింది. కానిస్టేబుల్స్‌లో గ్రాడ్యుయేషన్ 5470 , పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1361 చదివిన వారు ఉన్నారు. ఇందులో టెక్నికల్1755, నాన్ టెక్నికల్ 5505, లా పూర్తి చేసుకున్న వారు 15 మంది ఉన్నారు. నేడు పాసింగ్ ఔట్ పరేడ్ తరువాత తెలంగాణ పౌరుల సేవలో 8,047 మంది కానిస్టేబుల్స్ పాల్గొననున్నారు.

పెరుగుతున్న చలి తీవ్రత తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. వాతావరణపరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా…తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. జాగ్రత్తలను సూచించింది.

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. అయితే వాతావరణంలో మార్పుల దృష్ట్యా తెలంగాణ ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.

ప్రస్తుత సీజన్ లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తీవ్రమైన చలికి గురికావడం వల్ల హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.  

గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు. 

చలి గాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది,సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలని బులెటిన్ లో సూచించారు.

జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

చలి తీవ్రత దృష్ట్యా ఇంట్లో కర్రలు కాల్చడం వంటి పనులు చేయవద్దని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆల్కహాల్ తీసుకోపోవటం మంచిదని బులెటిన్ లో ప్రస్తావించారు. శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు కుప్పకూలిన 10 షేర్లు

అదానీ గ్రూప్ ఛైర్మన్.. దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత ఇప్పుడు మరోసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. అదానీతో పాటు మరో ఏడుగురిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. దీంతో.. అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. గురువారం సెషన్లో చాలా షేర్లు 20 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఆయనకు ఒక్కరోజే దాదాపు రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లింది.

భారత స్టాక్ మార్కెట్లను గతేడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కుదిపేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అదానీ గ్రూప్‌పై బాంబ్ పేల్చగా.. అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కొద్ది రోజులు భారీగా పతనమయ్యాయి. ఇదే విధంగా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలు నమోదు చేశాయి. ఆ దెబ్బ నుంచి అదానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి పిడుగు పడింది. ఈసారి గౌతమ్ అదానీపై ఏకంగా అమెరికాలో కేసు కూడా నమోదైంది. లంచాలు ఇవ్వడంతో పాటు.. ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి మోసం పేరిట నిధుల సేకరణకు పాల్పడ్డారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీతో పాటు ఆయన దగ్గరి బంధువు సాగర్ అదానీ మరో ఏడుగురిపై కేసు నమోదైంది.

ఈ కారణంతో అదానీ గ్రూప్ షేర్లు అన్నీ ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. ఉదయం 10.15 గంటల సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పడిపోగా.. నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది.

అదానీ గ్రూప్ స్టాక్స్ విషయానికి వస్తే.. హోల్డింగ్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ అన్నీ 20 శాతం పడిపోయాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్ స్టాక్స్ కూడా ఇంట్రాడేలో 20 శాతం వరకు నష్టపోయి ప్రస్తుతం 15 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్ 15 శాతం పతనమైంది. ఏసీసీ, ఎన్‌డీటీవీ, అదానీ విల్మర్ స్టాక్స్ ఒక దశలో 15 శాతానికిపైగా పడిపోయి ఇప్పుడు 10 శాతానిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే అదానీ సంపద కూడా క్షణాల వ్యవధిలోనే రూ. 1.06 లక్ష కోట్ల వరకు తగ్గింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఆయన సంపద 12.6 బిలియన్ డాలర్లు తగ్గి మొత్తం 57 బిలియన్ డాలర్లతో ఏకంగా 25వ స్థానానికి పడిపోయారు.

అదానీ దాని సబ్సిడరీలు 20 ఏళ్లలో 2 బి.డాలర్లకుపైగా లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు దాదాపు 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తర్వాత.. అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి.. నిధులు సేకరించే ప్రయత్నం చేసిందని తెలిపారు. మరోవైపు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీపై మరో కేసు నమోదు చేసింది. అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. దీనిపై ఇప్పటివరకు అదానీ గ్రూప్ ఏం స్పందించలేదు.

గతేడాది యూఎస్ షార్ట్ సెల్లర్.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్.. తమ షేర్లను కృత్రిమంగా పెంచుకొని ఇన్వెస్టర్లను మోసం చేసిందని సంచలన రిపోర్ట్ విడుదల చేయగా.. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ అప్పట్లో ఏకంగా 150 బిలియన్ డాలర్లకుపైగా పతనమైంది.