/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz విమానాలకు బాంబు బెదిరింపులు.. రామ్మోహన్ నాయుడు సీరియస్ Raghu ram reddy
విమానాలకు బాంబు బెదిరింపులు.. రామ్మోహన్ నాయుడు సీరియస్

దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు వస్తుండటం తీవ్ర ఆందోళనకరంగా మారిన వేళ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాలకు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. అవసరమైన చట్టాలు మార్చేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో విమానాలకు బాంబు హెచ్చరికలు వస్తుండటం అటు ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సంస్థలతోపాటు ఇటు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. అవి ఎవరు చేస్తున్నారు.. అందులో ఎంతవరకు నిజం ఉంది అని కనుక్కోవడం ప్రస్తుతం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన బెదిరింపులు అన్నీ నకిలీవి అని గుర్తించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా విమానాలకు బెదిరింపులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సీరియస్‌ అయ్యారు.

విమాన ప్రయాణికులకు భద్రత కల్పించడమే తమ ప్రభుత్యానికి మొదటి ప్రాధాన్యత అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇక విమానాలకు బెదిరింపులు చేసేవారిని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చేలా ఇప్పటివరకు ఉన్న విమానయాన చట్టాలను సవరిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వచ్చిన విమాన బెదిరింపులు అన్నీ ఫేక్ అని తేలిందని చెప్పారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్‌ ఉందని.. దాన్నే అనుసరిస్తున్నట్లు పేర్కొ్న్నారు. అయితే విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినపుడు పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ విధివిధానాలను కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు.

అక్టోబర్‌ 14వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ బెదిరింపులపై సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. విమానయాన భద్రతా నిబంధనలను సవరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1982 సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ చట్టం సవరణకు వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. విమానాలకు బెదిరింపులు రావడంతో వాటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రతి బెదిరింపును క్షుణ్ణంగా విశ్లేషించి వేగంగా, అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

అయితే ఇవి తప్పుడు బెదిరింపు కాల్స్‌ అయినా.. ప్రయాణికుల భద్రత, సురక్షిత విషయంలో రాజీ పడటం లేదని.. ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విమానాలకు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రోజున 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఆదివారం మరో 24 విమానాలకు అలాంటి బెదిరింపులు వచ్చాయి.

ఇక ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌ సహా దాదాపు అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలతోపాటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ కూడా ఈ బెదిరింపులు వచ్చిన విమానాల జాబితాలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇండిగో, విస్తారా, ఎయిరిండియాకు చెందిన ఆరు చొప్పున విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ బాంబు హెచ్చరికల గురించి అధికారులకు తెలిపామని.. వారి ఆదేశాల మేరకు భద్రతా విధానాలను పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్‌ అని అధికారులు గుర్తించారు.

తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్నదర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏడుకొండలవాడిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దర్శించుకున్నారు.

అనంతరం తిరుమాడ వీధుల్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...తిరుమలలో స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల జారీ చేసే సిఫార్స్ లేఖలు అనుమతించకపోవడం బాధాకరమన్నారు. డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో సైతం టీటీడీ ఈవో సైతం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖను అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు.

అయితే తమ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాచలంలో దేవుడు దర్శనానికి వచ్చే ఆంధ్ర ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలను తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ తమ తెలంగాణ విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని టీటీడీ అధికారులను ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తాం.. రూమ్ ఇప్పించండి అంటే.. ఇప్పించలేని దుస్థితి నేడు నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారని పేర్కొన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం కొలువు తీరితే.. వైసీపీ వాళ్లు హైదరాబాద్‌ వచ్చి ఉంటారన్నారు. ఏపీ వాళ్లు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా.. తెలంగాణ వాళ్లు ఏనాడు ఒక్క మాట కూడా వాళ్లని అనలేదన్నారు.

తెలంగాణ ఎమ్మెల్యే అంతా ఏపీ వాళ్లను తమ రాష్ట్రానికి రావొద్దని ఓ తీర్మానం చేసుకుంటే.. ఆ బాధేమిటో మీకు తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు టీటీడీ అనుమతించక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము తీసుకునే నిర్ణయంతో బాధ పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే అనిరుధ్ హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములన్నారు. అలాగే ఉందాం. కేవలం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు రాకండీ.. నిజమైన అన్నదమ్ముల వలే ఉందమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్ రాజు ఛార్లెస్ 3కి ఘోర అవమానం

గతేడాది మే నెలలో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ 3కి పట్టాభిషేకం జరిగింది. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 2022 సెప్టెంబర్‌లో మరణించడంతో రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్‌ నియమితులయ్యారు. రాజు అయిన తర్వాత తొలిసారి ఆయన కామన్వెల్త్ దేశాల పర్యటనకు బయలుదేరారు. ముందుగా ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అక్కడ పాలన బ్రిటన్ రాణి చేతుల మీదుగానే జరుగుతుంది. అందుకే ఆయన అధికారికంగా ఆ దేశానికి పాలకుడు

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన బ్రిటన్ రాజు సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్‌ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘మా భూమిని తిరిగి ఇచ్చేయండి.. మా నుంచి దోచుకున్న సంపద మొత్తం వెనక్కి ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు’ అని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. దాదాపు నిమిషం పాటు పెద్దపెద్దగా కేకలు వేశారు.

తరుచూ వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ థోర్పే వార్తల్లో నిలుస్తారు. 2022లో పార్లమెంట్‌కు ఎన్నికైప్పుడు బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2ను వలస రాజ్యపాలకురాలని అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నాటి ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ సు లిన్స్‌ అభ్యంతరం తెలిపారు. ‘‘సెనెటర్‌ థోర్పే.. మీరు ప్రమాణస్వీకారం ప్రతిలో ప్రచురించిన అంశాన్ని మాత్రమే చదవాలి’ అని సూచించారు.

ఆస్ట్రేలియాలో పాలన ఇంగ్లాండ్ రాణి పేరు మీదనే జరుగుతోంది. రాణి హోదా నుంచి క్వీన్‌ ఎలిజిబెత్‌-2ను తొలగించి, పార్లమెంట్‌ సభ్యులు ఎన్నుకొన్నవారిని నియమించేలా 1999లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ నిర్వహించగా.. స్వల్ప మెజార్టీతో ఈ తీర్మానం వీగిపోయింది. మరోవైపు, దేశంలో ఆదివాసీ కన్సల్టేటీవ్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా గతేడాది పార్లమెంట్‌‌లో భారీ మెజార్టీతో వీగిపోవడం గమనార్హం.

దాదాపు 100 ఏళ్లకుపైగా ఆస్ట్రేలియా సైతం బ్రిటన్‌ వలస రాజ్యంగా ఉంది. ఈ సమయంలో ఆస్ట్రేలియాలోని వేలాది మంది ఆదివాసీలు హత్యలకు గురయ్యారు. చివరకు 1901లో ఆ దేశం అప్రకటిత స్వాతంత్ర్యం సాధించింది. కానీ, పూర్తిస్థాయి రిపబ్లిక్‌గా అవతరించలేదు. ప్రస్తుతం దానికి కింగ్‌ ఛార్లెస్‌-2 రాజుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటన ప్రారంభించారు. ముందుగా ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించి.. ఆ తర్వాత అక్కడకు వెళ్లనున్నారు.

సిద్దంగా ఉండండి - సీఎం రేవంత్ కీలక ప్రకటన..!!

విధి నిర్వహణలో అసువులుబాసి అమరులైన పోలీసులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. రాష్ట్రం అభివృద్ధి పదంవైపు నడవాలంటే పోలీసులు కీలకమన్నారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని, పండుగల నిర్వహణలో శాంతిభద్రతలను కాపాడడంలో అలసత్వం వద్దని సూచించారు. సైబర్ క్రైం ఛేదనలో తెలంగాణ విధానాన్ని కేంద్రం కూడా మెచ్చుకుందని గుర్తు చేశారు.

శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని.. రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలో క్రైం రేటును నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోందని రేవంత్ వివరించారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేసామని గుర్తు చేసారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

తీవ్రవాదులు, మావోయిస్టు చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమని రేవంత్ ప్రశంసించారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. డ్రగ్స్ మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. పంజాబ్ రాష్టంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు టీజీఎన్‌ఏబీను ఏర్పాటు చేశామని గుర్తు చేసారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఇదే సమయంలో రేవంత్ ప్రార్ధనా మందిరాల పైన దాడులు చేస్తున్న వారిని హెచ్చరించారు.

మందిరాల మీద, మజీద్‌ల మీద దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని రేవంత్ ఆదేశించారు.

నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ హెచ్చరిక

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు. 

సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు.

ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.

వారంలో 90 విమానాలకు బెదిరింపులు

గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

దక్షిణ కొరియా పర్యటనలో తెలంగాణ మంత్రులు (Telangana Ministers), అధికారుల బృందం బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చీయంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ , మూసీ రివర్ ప్రంట్ అధికారులు ఉన్నారు.

కాగా.. రాష్ట్రంలో ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రజారోగ్యం, హైదరాబాద్‌ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రక్షాళనలో ముందుకేసాగాలని ప్రభుత్వం భావించింది. ఖాళీ చేసిన నివాసాల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ విభాగాలు.. మార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిర్వాసితులను ఒప్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉన్నతస్థాయి ఆదేశాల నేపథ్యంలో వేచి చూస్తున్నాయి. ప్రాజెక్టులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తొలినుంచి యోచిస్తున్న సర్కారు వారిని దక్షిణ కొరియా తీసుకెళ్లాలని నిర్ణయించింది. సుందరకీరణ తర్వాత నది రూపు ఎలా మారనుందో అవగాహన కల్పించేందుకు అధ్యయనానికి తీసుకెళ్లనుంది. 21 మందితో కూడిన బృందం పర్యటనకు ఇటీవల సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఉన్నతాధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లింది. అక్కడి చాంగి చియోన్‌లో హన్‌ నది, సియోల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. తిరిగి 25వ తేదీన స్వదేశానికి రానుంది. గతంలో నది, తీరం ఎలా ఉండేది? తర్వాత ఎలా మారాయో ప్రజాప్రతినిధులకు చూపించనున్నట్టు సమాచారం.

తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే.. కావాలంటే రాసి పెట్టుకోండి' .. ప్రశాంత్ కని

2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు..? కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి రేవంత్ రెండోసారి సీఎం అవుతారా..? లేక పడిలేచిన కెరటంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని కేసీఆర్ మూడోసారి సీఎం కుర్చీ ఎక్కుతారా..? ఈ రెండు పార్టీలు కాకుండా కమలం పార్టీ తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందా..? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ చర్చ జరగుతున్న నేపథ్యంలో తెలంగాణకు కాబోయే సీఎం ఆయనే అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కని జోష్యం చెప్పారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఓటమి పాలైంది. మెుత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 64 సీట్లతో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ పూర్తి డీలా పడింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిథ్యం లేకపోవటం ఇదే తొలిసారి

అంతకుముందు కేసీఆర్ తుంటి ఎముక విరగటం, ఆయన ఇంటికే పరిమితం కావటం, కవిత జైలుకు వెళ్లటం, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, ద్వితయశ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. కేడర్‌ పూర్తి నిరాశంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనైనా ఆ పార్టీ పుంజుంకుంటుందా..? కేసీఆర్ మరోసారి సీఎం అవుతారా..? బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటనేది తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తిర చర్చ జరుగుతోంది. ఇక రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ? బీజేపీకి అవకాశాలు ఉన్నాయా..? అనే చర్చ కూడా నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తన ప్రిడిక్షన్ ఇచ్చారు ప్రస్తుతం పొలిటికల్‌గా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని జోతిష్యం చెప్పారు. ఆయనకు త్వరలోనే శుభ గడియలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ మేరకు ఆయన్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తాట తీయాల్సిందే, అదే లాస్ట్ డే - చంద్రబాబు ఆదేశం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు కీలక దిశా నిర్దేశం చేసారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. లైంగిక వేధింపుల కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల రిక్రూట్ మెంట్ ను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు కావాల్సిన ఆధునిక వ్యవస్థను అందిస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరి రక్షణే బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశంలోనే ఏపీ పోలీసు వ్యవస్థ ఒక బ్రాండ్ నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి కేసును సవాల్‌గా తీసుకుంటాం.. ఛేదిస్తామని వెల్లడించారు. ఆడబిడ్డలు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. నేరస్థులకు చట్టపరమైన శిక్షపడేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

హిందూపూర్ గ్యాంగ్ రేప్, కడపలో యువతి హత్య కేసులో నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఏటా రూ.20 కోట్లు పోలీసు శాఖకు అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుదామని చెప్పారు. అమరావతిలో శాశ్వత అమరవీరుల సంస్మరణ స్థూపం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ నమోదు కావాలని చంద్రబాబు సూచించారు.

శాంతి, భద్రతలు మొదటి ప్రాధాన్యతగా పనిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. నేరస్థులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే పోలీసులు పాత టెక్నాలజీ వాడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇకపై టెక్నాలజీ పరిజ్ఞానం అందిస్తామని... ఆధునిక పరికరాలు సమకూరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు.

ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బెజవాడలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల వ‌ద్ద భారీ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ (Dinesh Kumar) ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు. 10 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు ప్రత్యేక బాధ్యత‌లు అప్పగించారు. ఏర్పాట్లను డ్రోన్ కార్పొరేష‌న్ అధికారులు నిరంత‌రం ప‌ర్యవేక్షిస్తున్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024’ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. సదస్సు జరిగే ప్రాంతాన్ని వివిధ శాఖల కార్యదర్శులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఐఅండ్‌ఐ కార్యదర్శి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న డ్రోన్ల సమ్మిట్‌కు వివిధ శాఖల నుంచి 10 మంది ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమ్మిట్‌ ఏర్పాట్లను వివరించారు.

డ్రోన్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు.

22న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్‌ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి.

సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు.

డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి.

డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటాయి.

వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలల ఏర్పాటు.

2030 నాటికి భారత్‌ను గ్లోబల్‌ డ్రోన్‌ హబ్‌గా రూపొందించడం, డ్రోన్‌ నిబంధనలపై బృంద చర్చలు.

ప్రజాభద్రత, విపత్తుల నిర్వహణ, డ్రోన్‌ సాంకేతికత అప్లికేషన్ల వినియోగం, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్ల ఆవిష్కరణలు తదితర అంశాలపైనా చర్చలు ఉంటాయి.

వ్యవసాయం, ఆరోగ్యం, లాజిస్టిక్‌ రంగాల్లో డ్రోన్ల వినియోగం, డిజిటల్‌ భూరికార్డుల రూపకల్పనలో డ్రోన్ల వినియోగంపై బృంద చర్చలు జరుగుతాయి.

రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్‌

అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు.

అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు.

ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టి, ఉన్న రూ.10 వేలను కూడా ఊడగొట్టారని ఫైరయ్యారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమేనని చెప్పారు. కాంగ్రెస్‌ రైతు ద్రోహి అని, ఆ పార్టీ చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని తెలిపారు.

ఇప్పుడు పంట పెట్టుబడి మరొకటని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతుబంధు కావాలా.. రాబందు కావాలా.. అంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా ఎక్స్‌ వేదిగా ప్రశ్నించారు. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని చెప్పారు.