బస్సు లైఫ్.. తగ్గుతోంది బాసూ
సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు.
సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సిటీ బస్సులు 13 లక్షల కిలోమీటర్లు తిరగకముందే స్ర్కాప్‌కు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటు న్నారు. సాధారణంగా 45 నుంచి 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో రద్దీ వేళల్లో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రభావం బస్సుల ఫిట్‌నెస్(Fitness)పై పడుతుందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ 2,800 సిటీబస్సులు నడుపుతుండగా 1,653 ఆర్డినరీ, 906 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టక ముందు గ్రేటర్‌జోన్‌లో రోజూ 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సులో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. మహిళల రద్దీ పెరగడంతో టికెట్ తీసుకొని బస్సుల్లో ప్రయాణం చేసేకొంతమంది ఆర్టీసీ బస్సులను వదిలేసి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రద్దీ వేళల్లో బస్సుల్లో ఎక్కేందుకు స్థలం లేకపోవడంతో దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, మియాపూర్, కూకట్‌పల్లి, మెహిదీపట్నం(Dilsukhnagar, Uppal, Miyapur, Kukatpally, Mehidipatnam), ఈసీఐఎల్, సికింద్రాబాద్, కోఠి ప్రాంతాల్లో ప్రైవేట్ ఆటోలకు డిమాండ్ పెరిగింది.
మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, ఏసీ బస్సుల్లో 65 శాతం మించడం లేదు. ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉండటం, కొన్ని రూట్లకే పరిమితం కావడంతో అనుకున్నస్థాయిలో ప్రయాణికులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్ రూట్‌లో నడుపుతున్న 40 పుష్పక్ బస్సుల్లో ఆక్యుపెన్సీ 60 శాతం మించకపోయినా బస్ రూట్లలో మార్పులు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.
ఎలక్ర్టిక్ ఆర్డినరీ బస్సులను పెద్దసంఖ్యలో తీసుకువస్తే కానీ ఆర్డినరీ సిటీ బస్సులపై ఓవర్‌లోడ్ తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. గ్రేటర్‌లో 2024 డిసెంబర్ నాటికి 500 ఎలక్ర్టిక్ బస్సులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ బస్సులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో బస్సుల రాక ఆలస్యం అవుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
Oct 19 2024, 15:15