/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా ప్రముఖుల నివాళులు.. Raghu ram reddy
రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా ప్రముఖుల నివాళులు..

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కొనియాడారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారని, కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని, దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని, నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.

మంత్రి సవిత మాట్లాడుతూ.. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రతన్ టాటా వెన్నుముక అని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ విప్లవం సృష్టించిన పారిశ్రామిక వేత్త అని, దేశం కోసం... ప్రజల కోసం... పనిచేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అని.. సేవా కార్యక్రమాల్లోనూ రతన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి సవిత వ్యాఖ్యానించారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. రతన్ టాటా మృతి యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాదని, పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. నేడు దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. ఎన్నో పరిశ్రమలు నెలకొని ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని ఈ సందర్భంగా రతన్ టాటా చేసిన సేవలను అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటని, ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఈ దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని అన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని అన్నారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రతన్ టాటా మృతి పట్ల మంత్రి అనగాని సంతాపం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో రతన్ టాటాది కీలక పాత్రని, నిజమైన మానవతావాది రతన్ టాటా అని వ్యాఖ్యానించారు. రతన్ టాటా మరణం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.

తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా సన్స్‌.. రతన్‌ నావల్‌ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

పట్టాలెక్కబోతున్న కొత్త రైలు...

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ 2014లో బాధ్యతలు స్వీకరించారు. 2024లో మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. దాదాపు ఈ 11 సంవత్సరాల కాలంలో ఆయన విదేశాంగ విధానం, హోంశాఖతోపాటు రైల్వేకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అతి తక్కువ ఖర్చుతో సాధ్యమైనంత ఎక్కువ దూరం ప్రయాణించేలా చేయాలన్నదే ఆయన విధానం.

అందుకనుగుణంగా ఈ దశాబ్దకాలంలో భారతీయ రైల్వే అనేక మార్పులకు గురైంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు ప్రయాణికులకు విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈకోవలో ఇటీవలే పట్టాలెక్కిన రైలు వందేభారత్. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా రూపొందించిన సెమీ హైస్పీడ్ రైళ్లు ఇవి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోందికానీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

దీంతో కొన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లు ఖాళీగా నడవాల్సి వస్తోంది. త్వరలో వందేభారత్ స్లీపర్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే వందేభారత్ కు మించిన రైలును భారతీయ రైల్వే తీసుకురాబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. ఈ ఏడాది చివరలో ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. జర్మనీకి చెందిన టీయూవీ- ఎస్‌యూడీ కంపెనీకి కేంద్రం బాధ్యతలు అప్పగించింది.

రూ.80 కోట్ల వ్యయంతో తయారయ్యే ఈ హైడ్రోజన్ రైలుకు నాలుగు కోచ్ లు ఉంటాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. తొలిదశలో 35 రైళ్లను తీసుకురాబోతున్నారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు నడవబోతోంది. ఈ రైళ్ల వల్ల ఎటువంటి కాలుష్యం వెలువడదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చైనా, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. ఐదో దేశంగా భారత్ నిలవబోతోంది. వీటిని ఎక్కువగా ప్రకృతి సౌందర్యాలను వీక్షించడానికి అనువుగా ఉండే ప్రాంతాలైన డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మార్గాల్లో నడపడానికి ప్రయత్నిస్తున్నారు.

రతన్ టాటా వారసుడు అతడేనా ? సమర్ధ నాయకుడు, ట్రస్టీల్లో ఒకరు..!

వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతావాదిగా కీర్తి సంపాదించుకున్న రతన్ టాటా మరణం భారత పారిశ్రామిక వర్గాల్లో విషాదం నింపింది. భారత పారిశ్రామిక రంగానికి రతన్ టాటా చేసిన సేవలు, టాటా సామ్రాజ్యాన్ని విలువలతో నిర్మించిన తీరు, ఆయన నిస్వార్ధ ఆలోచనలు ఇప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఆయన వారసుడిగా రాబోతున్నది ఎవరన్న చర్చ కూడా మొదలైంది.

రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరిన రతన్ టాటా రెండు రోజుల్లోనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు మారడం, అక్కడే తుది శ్వాస విడవడం జరిగిపోయాయి. దీంతో ఆయన స్ధానంలో అంత పెద్ద టాటా సామ్రాజ్యాన్ని నడిపించేదెవరన్న చర్చ మొదలైంది. దీంతో రతన్ టాటా సవతి సోదరుడు అయిన నోయల్ నావల్ టాటాకు ఆయన తర్వాత పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నావల్ టాటా, సిమోన్ టాటాల కుమారుడైన నోయల్ నావెల్ టాటా.. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ కూడా అయిన రతన్ టాటాకూ, అతని సోదరుడు జిమ్మీ టాటాకు సవతి సోదరుడే. టాటా కుటుంబంలో కూడా ఆయన ఓ భాగం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రతన్ టాటా తండ్రి నావెల్ టాటాకు ఆయనతో పాటు జిమ్మీ టాటా మొదటి భార్య సూనీ కమిషరియట్ కుమారులు. నోయల్ నావెల్ టాటా రెండో భార్య కుమారుడు

నావెల్ టాటా రెండో భార్య కుమారుడైన నోయల్ నావెల్ టాటా తమ టాటా గ్రూపులో 40 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. అంతే కాదు వివిధ టాటా గ్రూప్ కంపెనీల బోర్డులోనూ, టైటాన్ కంపెనీ లిమిటెడ్ లోనూ పనిచేస్తున్నారు. అలాగే సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీగా కూడా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీగా సంస్ధ టర్నోవర్ ను 500 మిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ నుండి 3 బిలియన్ డాలర్లకు చేర్చిన ఘనత కూడా ఉంది. అలాగే టాటా సంస్ధకు చెందిన పలు ట్రస్ట్ లలోనూ సభ్యుడిగా ఉన్నారు.

ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

మదర్‌ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.

మదర్‌ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. సోమవారం హయత్‌నగర్‌ మదర్‌డెయిరీ కార్యాలయంలో జరిగిన చైర్మన్‌ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యతో కలిసి నూతన చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం మిఠాయి తినిపించి కూర్చిలో కుర్చోబెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న మదర్‌డెయిరీని లాభాల్లో తీసుకురావడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఉద్యోగులు, కార్మికులు కలిసికట్టుగా పని చేస్తే మదర్‌డెయిరీ లాభాల బాటలో పయనిస్తుందన్నారు. మదర్‌డెయిరీ ఉత్పత్తులు నాణ్యతకు మరోపేరు అని అన్నారు. తెలంగాణాలోని దేవాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్ధలకు పాలు, నెయ్యి సరఫరా చేస్తామన్నారు. మదర్‌ డెయిరీ విషయంపై మరో మారు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని తెలిపారు.

చైర్మన్‌, పాలకవర్గం సభ్యులు కష్టపడి రైతులకు మేలు జరిగేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌, మదర్‌డెయిరీ ఎండీ కృష్ణ, పాలకవర్గం సభ్యులు జయశ్రీ, సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, జలేందర్‌రెడ్డి, అలివేలు, శ్రీధర్‌రెడ్డి, పాండు, రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, నర్సింహులు, జంగయ్య, నర్సింహారెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బెజవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం...

రాజస్థాన్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన టూర్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్ళే మార్గంలో వీరు ప్రయాణించిన బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ న్యాయవాది, అఖిల భారత లాయర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సుంకర రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి స్థానిక అధికారులు తరలించారు. ఈ ప్రమాదంలో సుంకర రాజేంద్ర ప్రసాద్‌కు కంటి మీద గాయాలు అయ్యాయి.

మరోవైపు రాజస్థాన్‌లో జరిగిన బస్ ప్రమాదం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేంద్ర మంత్రుల దృష్టికి టీడీపీ నేత, సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తీసుకువెళ్ళారు. వెంటనే ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది. అజ్మీర్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, రాజస్థాన్ చీఫ్ సెక్రటరీలతో ఏపీ ఉన్నతాధికారులు మాట్లాడారు. తీవ్రంగా గాయపడిన వారిని అజ్మీర్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. సీనియర్ న్యాయవాది ఎస్‌ఆర్‌పీకి బలమైన గాయాలు అయ్యాయని.. ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చంద్రబాబు మార్క్ పాలన: విజయసాయిరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన విమర్శించారు.

రూ. 400 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని... ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసిందని అన్నారు. టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్ లు నడిచాయని చెప్పారు. 

జీవో విడుదలైనా... నిధులు మాత్రం హుళక్కి అయ్యాయని విజయసాయి దుయ్యబట్టారు. చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయని విమర్శించారు. సమగ్ర శిక్షణలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేవని అన్నారు. ప్రాణాలు రక్షించే 108, 104లో పని చేసే 6,500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదని చెప్పారు.

వీరే కాదు అనేక డిపార్టుమెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా, దీపావళి పండుగలు వస్తున్నా... చిమ్మ చీకట్లు తొలగిపోలేదని అన్నారు. 'ఇదీ చంద్రబాబు మార్కు పాలన... దీన్ని మార్పు అనాలంట' అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

హరియాణా ఓట్ల లెక్కింపు.. నుహ్‌లో కాంగ్రెస్ విజయం

జమ్మూ కాశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ 46. కానీ, హరియాణాలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకుంది.

గతేడాది మత ఘర్షణలతో వార్తల్లో నిలిచిన హరియాణాలోని నుహ్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్ధి అఫ్తాబ్ అహమ్మద్ ఘన విజయం సాధించారు. ఐఎన్ఎల్డీ అభ్యర్ధిని ఆయన దాదాపు 47 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడ, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతోంది. మొత్తం 90 స్థానాలలకు గానూ ఆ కూటమి 7 స్థానాల్లో విజయం సాధించి.. మరో 43 చోట్ల ఆధిక్యంలో ఉంది. పదేళ్ల తర్వాత, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. కశ్మీర్ లోయలో ఎన్సీ తన పట్టును నిలుపుకుని.. జమ్మూ ప్రాంతంలోనూ సత్తా చాటింది. జమ్మూలో ఎక్కువ స్థానాలు దక్కుతాయని బీజేపీ వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయి.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితలు వెలువడ్డాయి. బీజేపీకి ఓటమి తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కానీ, వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ గెలుపు ముంగిట బోర్లాపడింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుకోవడంలో విఫలమైంది. తాజా విజయంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. జాట్‌లు వ్యతిరేకతను అధిగమించి గెలుపు బావుటా ఎగురువేసింది. మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు.

హరియాణాలోని జింద్ నుంచి బీజేపీ అభ్యర్ధి డాక్టర్ కృష్ణలాల్ మిధ్దా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి మహావీర్ గుప్తాపై ఆయన 15860 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు, ఓట్ల లెక్కింపు జాప్యంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లెక్కింపు జాప్యం చేశారని ఆరోపించింది. అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుందని మండిపడింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయం సాధించారు. జులానా నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్ధి బీజేపీ అబ్యర్ధి యోగేశ్ కుమార్‌ను 6,015 ఓట్ల తేడాతో ఓడించారు. తొలి రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న ఆమె తర్వాత వెనుకబడ్డారు. చివరి రౌండ్లలో మళ్లీ ముందంజలోకి వచ్చి.. విజయాన్ని అందుకున్నారు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల చేపట్టిన ఆందోళనకు వినేశ్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక, పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరినా.. 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని అనర్హురాాలిగా ప్రకటించారు.

జమ్మూ కశ్మీర్‌లోని ఒసోహ్లి స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధి దర్శన్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధిపై ఆయన 16 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ ఖాన్.. గురేజ్‌లో 1,132 ఓట్ల విజయాన్ని అందుకున్నారు. కథువాలో బీజేపీ అభ్యర్ధి డాక్టర్ భరత్ భూషణ్ ముందంజలో ఉన్నారు. కశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి 36 శాతం, బీజేపీ 26 శాతం, ఇతరులు 29 శాతం ఓట్లు సాధించారు.

హరియాణా ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 10 నుంచి 12 రౌండ్ల లెక్కింపు పూర్తయితే అధికారిక వెబ్‌సైట్‌లో ఈసీ 4, 5 రౌండ్లే అప్‌డేట్ చేసిందని, దీనిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇది అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చే ఎత్తుగడ అని ఆయన మండిపడ్డారు. తమ ప్రశ్నలకు ఈసీ సమాధానం చెబుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

2019 ఎన్నికల్లో పది స్థానాల్లో విజయం సాధించి, కింగ్ మేకర్‌గా అవతరించిన జననాయక్ జనతా పార్టీ.. ప్రస్తుతం మాత్రం చతికిలబడింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ ఆదిక్యం చూపలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉచ్నానాకలాన్‌ స్థానంలో... ఆరో స్థానంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. కనీసం జేజేపీకి డిపాజిట్ కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది. జులానాలో వెనుబడిన కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక్యంలోకి వచ్చారు. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి ఆమె.. బీజేపీ అభ్యర్ధి యోగేశ్ కుమార్‌పై 2 వేలకుపైగా ఓట్ల లీడ్‌లో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫోగట్ మళ్లీ తిరిగొచ్చారు.

జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషేరా స్థానంలో వెనుబడ్డారు. ఆయనపై నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురేంద్ర కుమార్ చౌదురి 11 వేల ఓట్లకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికి బయటకొచ్చిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్.. సొంతంగా పార్టీ పెట్టి జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో పోటీచేసి చేదు ఫలితాలను ఎదుర్కొన్నారు. ఆయన పార్టీ డెమొక్రాటిక్ ప్రోగెస్ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ కశ్మీర్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ ఓటమి చవిచూశారు. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ నుంచి శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీచేసిన ఆమె.. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి బషీర్ అహ్మద్ షా వీర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఇల్తీజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు, కాంగ్రెస్ కూటమి అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.

జమ్మూ కశ్మీర్, హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కనీసం ప్రభావం చూపలేకపోయింది. రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. హరియాణాలో కాంగ్రెస్‌తో కలిసి పోటీపై చివరి నిమిషంలో వైదొలగిన ఆ పార్టీ.. అక్కడ బొక్కబోర్లా పడింది. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. దాని ప్రభావం కనిపించలేదు. ఇక, జమ్మూ కశ్మీర్‌లోనూ అదే పరిస్థితి. రెండు చోట్ల బొక్కబోర్లా పడింది.

కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం దిశగా సాగుతోంది. ఇండియా కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్సీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికలు కావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకుంది. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిసి సభ్యుల సంఖ్య 95కు చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 48.

హరియాణా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యేలా ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, ఫలితాలు మాత్రం అందకు విరుద్దంగా వెలువడుతున్నాయి. అంచనాల భిన్నంగా భీజేపీ ఆధిక్యంలో వచ్చింది. హరియాణాలో వరుసగా ఏ పార్టీ మూడోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని బీజేపీ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి రౌండ్లలో కాంగ్రెస్ భారీ ఆధిక్యం చూపగా.. ప్రస్తుతం బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. దీంతో విజయం ఎవర్ని వరిస్తుందోనని ఆసక్తి రేపుతుంది. ఇక, జులానాలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకబడ్డారు. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి ఆమె 1200 ఓట్ల వెనుబడి ఉన్నారు. హిస్సార్‌ నుంచి బరిలో నిలిచిన బీజేపీ రెబల్ సావిత్రి జిందాల్.. కాంగ్రెస్ అభ్యర్ధిపై 3 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ కూటమి మ్యాజిక్ మార్క్‌ను దాటింది. ఇక, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ రెండు చోట్ల ఆధిక్యంలో ఉండగా... ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ మాత్రం వెనుకబడ్డారు. ఆమెపై ఎన్సీ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. పుల్వామాలో పీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉంది. కేవలం నాలుగు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. 1999 తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆ పార్టీ అత్యంత దారుణమైన పరాజయాన్ని చవిచూస్తోంది.

హరియాణాలో ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత భారీ ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం వెనుకంజ వేసింది. అనూహ్యంగా బీజేపీ మందంజలోకి వచ్చింది. ఇప్పటి వరకు వెల్లడైన ట్రండ్స్ బట్టి బీజేపీ 48, కాంగ్రస్ 37, ఐఎన్ఎల్డీ 3 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హరియాణాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. నిమిష నిమిషానికి ట్రెండ్ మారుతోంది. దీంతో హరియాణా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సత్తాచాటేలా ఉంది. ఇప్పటి వరకూ వెలువడిన జమ్మూ కాశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాల సరళిని బట్టి రెండు చోట్ల ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సంబరాలు మొదలయ్యాయి. హరియాణాలో ఆ పార్టీ బంపర్ విక్టరీ కొట్టే దిశగా వెళ్తోంది.

జమ్మూ కాశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గానూ 50 చోట్ల కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి, 30 చోట్ల బీజేపీ, 6 చోట్ల పీడీపీ ఉన్నాయి. ఇక, హరియాణాలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం పార్టీ సాగుతోంది. అధికార బీజేీపీకి మింగుడపడని ఫలితాలు వెలువడుతున్నాయి.

కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీచేసిన రెండు చోట్లా ఆదిక్యంలో ఉన్నారు. గందెర్‌బల్, బుద్గాంలో ఆయన ముందంజలో ఉన్నారు. నౌషిరాా స్థానంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్సుడు రవీందర్ రైనా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

హరియాణాలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాలు బట్టి కాంగ్రెస్ పార్టీ 60కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గర్హి-సంప్లాయ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, జులానాలో వినేశ్ ఫోగట్ లీడ్‌లో ఉండగా.. హరియాణా సీఎం నాయిబ్ సింగ్ షైనీ తాను పోటీచేసిన ల్వాడ్వా స్ఘానంలో ముందంజలో ఉన్నారు.

⍟ జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైయ్యింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో రెండు చోట్ల కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. హరియాణాలో కాంగ్రెస్ 40 స్థానాలు, బీజేపీ 16, ఇతరుల రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హరియాణాలోని జూలానాలో రెజ్లర్ వినేశా ఫోగట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి 34, బీజేపీ 25, పీడీపీ 4, ఇతరులు 6 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఫలితాలను సరళిని బట్టి హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను తెరిచి లెక్కింపు చేపడతారు. తొలి రౌండ్ ఫలితం 9 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్‌లో 28 కేంద్రాల్లోనూ, హరియాణాలో 93 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్పష్టత రానుంది. ఇక, ఎగ్జిట్ పోల్స్‌ విషయానికి వస్తే హరియాణాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నాయకులు ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే మొత్తం 95 కు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 48.

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడనున్నాయి. పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014లో చివరిసారిగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగ్గా.. ఐదేళ్ల తర్వాత 2019లో జరగాల్సి ఉండగా ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తదితర పరిణామాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు సెప్టెంబరు 30 లోగా ఎన్నికలు జరిపించాల్సిందేనని ఆదేశించింది. దీంతో నియోజకవర్గా పునర్‌విభజన పూర్తిచేసి ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్-ఎన్సీ కూటమి, పీడీపీ, బీజేపీల మధ్యే సాగింది. పునర్‌విభజనతో జమ్మూ ప్రాంతంలో సీట్లు పెరగడం బీజేపీకి లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీకి అనుకూలంగా ఉంది.

ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రమైన హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. అక్టోబరు 5 ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1071 మంది బరిలో నిలిచారు. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని కమలం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తమదే గెలుపని, బీజేపీని హరియాణా ప్రజలు ఇంటికి సాగనంపుతారని కాంగ్రెస్ చెబుతోంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఆ పార్టీకే మొగ్గు ఉందని అంటున్నాయి. దీంతో హస్తం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.

పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంలో సాధారణంగా అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకర్షించడంతోపాటు, జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయే కాసేపట్లో తేలిపోనుంది. హరియాణాలో కుల సమీకరణాలు, పార్టీల విభేదాలు ప్రధానాంశంగా మారాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాలకు గానూ ఐదింటితోనే సరిపెట్టుకుంది.

ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటుచేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి, లెక్కింపు చేపడతారు. మూడు నాలుగు గంటల్లో ఎవరికి మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? హంగ్ వస్తుందా? అనేది స్పష్టత వస్తుంది.

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతుండగా.. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించదని, హంగ్‌ ఏర్పడవచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటులో ఐదుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. వీరిని నియమించే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌కు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మొత్తం 90 స్థానాలున్న హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీ 46. ఈ సంఖ్యను చేరుకునే పార్టీ అధికారం చేపడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోన్న బీజేపీకి ఈసారి హరియాణాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జాట్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు దూరం కావడంతో ఆ పార్టీ ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టింది.

కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..

నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే.

నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే. అయితే మెట్రో స్టేషన్ల నుంచి తమ ప్రాంతాలకు రవాణా కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక చార్జీలు వెచ్చించి బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లు(Bikes, autos, cabs) బుక్‌ చేసుకుని వెళ్తున్నారు. మెట్రోకు అనుసంధానంగా ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని మెరుగుపరుస్తామని, స్టేషన్ల నుంచి తక్కువ చార్జీతోనే రవాణా సౌకర్యం కల్పిస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

నగర ప్రజలకు మెట్రో ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు నాలుగేళ్ల క్రితం అధికారులు ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ మేరకు ఉదయం ఇంటి సమీపంలోని మెట్రో స్టేషన్‌కు సులువుగా వెళ్లడం, తిరిగి రాత్రి సమయంలో తక్కువ చార్జీతో ఇంటికి చేరుకునే విధంగా ఆటోలు, బైక్‌లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. దీంతోపాటు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ కింద రాత్రి 9 లోపు ప్రధాన స్టేషన్లలో మెట్రో దిగిన ప్యాసింజర్ల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం తొలుత ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించారు.

అయితే స్టేషన్ల నుంచి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే రవాణా సేవలందించాల్సి ఉండడంతో.. రేటు గిట్టుబాటు కాదని అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. రెండేళ్ల క్రితం మెట్రో రైడ్‌ సంస్థ ముందుకొచ్చినప్పటికీ కేవలం ఐటీ సంస్థలు అధికంగా ఉండే హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల వద్దనే ఎలక్ర్టిక్‌ ఆటోలు, బైక్‌లను అందుబాటులో ఉంచింది. మిగతా చోట్ల ఈ కనెక్టివిటీ లేకపోవడంతో ఆయా స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు వందలాది రూపాయలతో ఆటోలు, క్యాబ్‌లు బుక్‌చేసుకుని ఇళ్లు, ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. అదే ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ ఉంటే నాలుగు కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 చెల్లిస్తే సరిపోతుంది.

మూడు మెట్రో కారిడార్ల పరిధిలో మొత్తం 57 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతం 15 చోట్ల మాత్రమే ఫీడర్‌ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఫీడర్‌ సర్వీసుల సేవలను గుర్తించిన మెట్రో రైలు అధికారులు గతంలో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి మెట్రో స్టేషన్‌కు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీలను ఫీడర్‌ సేవల ద్వారా అనుసంధానం చేయొచ్చు. అయితే చిన్న బస్సులు అందుబాటులో లేవంటూ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. బోరబండ, మోతీనగర్‌, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్‌కాలనీ, వెంగళరావునగర్‌ కాలనీలను ఫీడర్‌ సర్వీసుల ద్వారా యూసుఫ్‏గూడ మెట్రోస్టేషన్‌కు.. గచ్చిబౌలి, కొండాపూర్‌, జేఎన్‌టీయూ, హఫీజ్‌పేట ప్రాంతాలను హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేస్తే ఆయా ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఎంతటి దుర్మాగం.. హెచ్చరించనా లెక్క చేయక.. 50 ఏళ్ల చెట్టును

తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు.

వృక్షో రక్షితి రక్షిత వృక్షాలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయనేది దీని అర్థం. మనుషులు వదిలిన కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి వృక్షాలు. అంతేకాక వృక్షాల వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. చెట్లు మనకు నీడని ఇవ్వడంతో పాటు.. పండ్లు, పూలు, వేర్లు, ఆకులు ఇలా అనేక రకాలుగా చెట్లు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కానీ మారుతున్న కాలంలో చెట్లను నరికివేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇళ్ల కోసం, రోడ్ల కోసం ఇలా అనేక విధాలుగా చెట్లు అడ్డుగా ఉన్నాయంటూ వాటిని నరికివేస్తున్నారు. ఒకచోట నరికివేసిన చెట్లను మరోచోట నాటితే బాగుంటుంది.. కానీ అలా జరగడం లేదు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను కొట్టివేడయంతో వర్షపు నీరు భూమికి చేరదు. దాని ఫలితంగా త్రాగు నీరు, జీవాధారమైన తిండి , పీల్చేందుకు స్వచ్చమైన గాలి కరువై మానవుడే కాదు.. ప్రతీ జీవి మనుగడ కష్టతరంగా మారిపోతుంది. ఇప్పటికే అడవులను నరికివేడయంతో మన దేశంలో చాలా అడవులు తరిగిపోతున్నాయి కూడా. ఇక పట్టణాల్లో అయితే చెట్ల పెంపకం చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. భవనాలు, రోడ్లు, వ్యాపార సముదాయాల కోసం ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తూ వస్తున్నారు. దీంతో చాలా చోట్ల చెట్లు కనిపించకుండా పోతున్నాయి. తాజాగా వ్యాపారానికి అడ్డువస్తుందనే కారణంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మహా వృక్షాన్నే నరికివేసిన వైనం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 50 ఏండ్లు ఉన్న చెట్టును నరికివేయడం పట్ల పర్యవరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ మహావృక్షం ఎక్కడ ఉంది.. ఎవరు నరికి వేశారో ఇప్పుడు చూద్దాం.

నగరంలోని కేబీఆర్‌ పార్క్ (KBR Park) ఎదురుగా జీహెచ్ఎంసీ (GHMC) ఫుట్ పాత్ మీదున్న చెట్టును (Big Tree) రాత్రికి రాత్రే నరికేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు. ఈ చెట్టును నాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే రాత్రి సమయంలో సెలూన్, క్లినిక్‌కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి అనే వ్యక్తులు మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు.

అంతకుముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని వాళ్లను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్టు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఈ దుర్మార్గానికి ఒడి గట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు.

స్టాలిన్ పై గురిపెట్టిన పవన్ కు మోడీ మార్క్ షాక్..!!

ఢిల్లీ టు అమరావతి రాజకీయం మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మిత్రపక్షాల మద్దతులో ముందుకెళ్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ రాజకీయంగా బలం పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. సంచలన నిర్ణయాల అమలుకు ముందే సంఖ్యా పరంగా తమ కూటమిని బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. కొత్త మిత్రులకు ఆహ్వానం పలుకుంది. సనాతన హిందు ధర్మం పరిరక్షణ పేరుతో దయానిధి స్టాలిన్ ను టార్గెట్ చేసిన పవన్ కు తాజాగా బీజేపీ నాయకత్వ నిర్ణయం షాక్ గా మారుతోంది.

కేంద్రంలో మోదీ సర్కార్ జమిలి ఎన్నికలతో పాటుగా కీలక అంశాలకు ఆమోదం పొందేందుకు సంఖ్య పరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్న మిత్రులతో పాటుగా కొత్త వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న కీలక పార్టీలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇండియా కూటమి లో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కాంగ్రెస్ తరువాత సంఖ్య పరంగా బలమైన పార్టీలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం తీరులో మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏలోని ప్రస్తుతం ఉన్న మిత్రుల్లో ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా తమకు నష్టం లేకుండా బీజేపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

తాజాగా డీఎంకే తో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కొత్త చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో మిత్రులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నడపటం మోదీ సమర్థతకు పరీక్షగా మారనుంది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు మిత్రపక్షాల వైఖరి పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, డీఎంకేతో సన్నిహితంగా బీజేపీ అధినాయకత్వం వ్యవహరిస్తోంది. సీఎం స్టాలిన్ తో ప్రధాని మోదీ గతం కంటే భిన్నంగా ఆత్మీయ పలకరింపు తో పాటుగా ఆ పార్టీ నేతలతో బీజేపీ ముఖ్యుల సన్నిహిత సంబంధాలు పెరగటం కూడా ఈ చర్చకు ఊతమిస్తున్నాయి. ఇక, చెన్నై మెట్రో -2 కు వెంటనే అనుమతులు లభించాయి. దీంతో..ప్రధాని మోదీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక, ఇటు ఏపీలో తిరుమల లడ్డూ వివాదం మొదలైన సమయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన హిందూ ధర్మం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో జరిగిన సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. వీటి పైన ఉదయనిధి సైతం వేచి చూద్దామంటూ స్పందించారు. పవన్ వ్యాఖ్యల పైన డీఎంకే సైతం స్పందించింది.

ఇక తాజాగా అన్ని డీఎంకేకు అనుకూలంగా పవన్ ట్వీట్లు చేసారు. ఇలా..డీఎంకే పైన ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పార్టీతో వేస్తున్న తాజా అడుగులు పవన్ కు బ్రేకులు వేసేలా ఉన్నాయనే విశ్లేషణ లు మొదలయ్యాయి. దీంతో, ఇప్పుడు పవన్ ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.