విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబర్‌లో భూమిపూజ !
ఉత్తరాంధ్ర ప్రజల కల రైల్వేజోన్ సాకారం కోబోతోంది. డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రైల్వేజోన్ కు అవసరమైన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం చివరి రోజు వరకూ ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే స్థలం రెడీ చేసింది. . వివాదాలు లేకుండా ముడిసర్లోవలో 52 ఎకరాలను రైల్వేకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర మంద్రి పీయూష్ గోయల్ త్వరలో రైల్వేజోన్ ఏర్పాటవుతుందని ప్రకటించారు.
2018లో కేంద్ర కేబినెట్ రైల్వేజోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 2019లో వైసీపీ గెలిచింది. ఒక్కటంటే ఒక్క సారి కూడా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని వైసీపీ కేంద్రాన్ని అడగలేదు. ఐదేళ్ల పాటు స్థలం కూడా రైల్వేకు అప్పగించకుండా తాత్సారం చేశారు.
అడిగి మరీ రైల్వేజోన్ పెట్టాల్సిన అవసరం ఏముందిలే అని కేంద్రం కూడా లైట్ తీసుకుంది. రైల్వే జోన్ కు కావాల్సిన స్థలంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రెడీ కావడంతో కేంద్రానికి జోన్ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ప్రభుత్వం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఫాలో అప్ చేశారు. మరో ఏడాదిలో రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకటి, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకుని రైల్వే జోన్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే వాల్తేరు డివిజన్ ను కూడా విశాఖ రైల్వే జోన్ లో నే కొనసాగించడం.
ఇప్పటి వరకూ విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదని ప్లాన్ రెడీ చేశారు . శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్‌లో ఉన్నాయి. వాటితో కొత్త డివిజన్ కూడా అలాగే ఉంచనున్నారు. మొత్తం జోన్ పై మరో నెలలో స్పష్టత వస్తుంది. డిసెంబర్‌లో భూమిపూజ జరగడం ఖాయం అనుకోవచ్చు.
Oct 08 2024, 12:57