కొండా సురేఖపై నాగార్జున పిటీషన్ విచారణ.. కోర్టు కీలక ఆదేశాలు!
అక్కినేని కుటుంబంపై నాగచైతన్య సమంతల విడాకులపైన కొండా సురేఖ చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున కొండ సురేఖ వ్యాఖ్యల విషయంలో చాలా సీరియస్ గా స్పందిస్తున్న విషయం తెలిసిందే.
నాగార్జున పిటీషన్ పై విచారణ
అయితే తాజాగా సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపైన నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపు న్యాయవాది ఈరోజు కోర్టులో తమ వాదన వినిపించారు. సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో తమ వాదనను వినిపిస్తూ నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తమ కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున
గత గురువారం నాడు నాంపల్లి కోర్టులో మంత్రి కొండ సురేఖ పైన నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు . క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన నాగార్జున తమ కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబం పైన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నారు.
నాగార్జున పిటీషన్ విచారణ రేపటికి వాయిదా
నిజా నిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఆమె పైన చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నేడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు రేపు నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని ఆదేశించి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కొండా సురేఖపై నాగార్జున ఫైర్
అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న నాగార్జున తన కుటుంబం విషయంలో తాను చాలా బలవంతుడిననీ ఎవరైనా సరే తన కుటుంబం జోలికొస్తే తాను ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. మంత్రి కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో తమ కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తీవ్ర అసహనంలో నాగార్జున
మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు మమ్మల్ని వాడుకోవద్దంటూ కొండా సురేఖ పై అసహనం వ్యక్తం చేసిన నాగార్జున ఆమె పైన 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు . అంతే కాదు క్రిమినల్ పరువు నష్టం దావా కూడా వేసి సురేఖ పైన సమర శంఖం పూరించారు.
Oct 07 2024, 17:51