/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు Raghu ram reddy
జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు

ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ వివాదం జాతీయ అవార్డు రద్దు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

తనను లైగింక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.

2022లో తిరుచిత్రబలం(తెలుగులో తిరు) చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది.

అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జానీ మాస్టర్‌ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు నార్సింగి పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో జానీ మాస్టర్ ఏం జరుగుతుందో చూడాలి.

చంద్ర‌బాబు ఉదార‌త‌.. స్వ‌గ్రామంలో అమ్మ‌వారి ఆల‌యానికి దారి చూపిన సీఎం

సీఎం చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఉదార‌త చాటారు. త‌న స్వ‌గ్రామంలోని అమ్మ‌వారి ఆల‌యానికి రాక‌పోక‌లు సాగించే భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా దారి చూపారు. ఏపీలోని తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి మండ‌లం కందుల‌వారిప‌ల్లె పంచాయ‌తీ నారావారిప‌ల్లెలోని నాగాల‌మ్మ ఆల‌యంలో గ్రామ‌స్థులు నిత్యం పూజ‌లు చేస్తుంటారు. 

ఇక ప్ర‌తియేటా సంక్రాంతి సంద‌ర్భంగా కుటుంబ‌స‌మేతంగా స్వ‌గ్రామానికి వెళ్లే చంద్ర‌బాబు కూడా అమ్మ‌వారికి పూజ‌లు చేయ‌డం ఆన‌వాయతీ. అయితే, ఈ ఆల‌యానికి వెళ్లేందుకు స‌రైన దారి లేదని స్థానికులు ఇటీవ‌ల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

దాంతో వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు తానే 90 సెంట్ల స్థ‌లాన్ని కొనుగోలు చేశారు.

ఆ స్థ‌లం గుండా రాక‌పోక‌ల‌కు దారిని ఏర్పాటు చేశారు. దాంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ చంద్ర‌బాబు ఉదార‌త‌ను కొనియాడుతున్నారు.

సెక్రటేరియట్‌ ఎఫ్‌టీఎల్‌లో ఉంటే లేని ఇబ్బంది.. పేదల ఇండ్లు ఉంటే ఏంటి?: అసదుద్దీన్ ఒవైసీ

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్‌ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది తొలగిస్తారా అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌, సెక్రటేరియట్‌, ప్రముఖుల ఘాట్‌లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయి.

వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్‌ అయ్యారు. ఎవ్వరు అడ్డొచ్చిన మూసీ సుందరీకరణ ఆగదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్‌లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దని చెప్పారు.

సెక్రటేరియట్‌తో పాటు బాపు ఘాట్ ఇలా మరెన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పరిపాలన విభాగం ఎఫ్‌టీఎల్‌లో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇండ్లు ఉంటే ఇబ్బంది ఏమిటని అని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము మద్దతు ఇస్తామని, కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ప్రధాని మోడీ పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

ఆయన ప్రసంగాలు వినే ఉద్దేశం లేకనే తాను పార్లమెంటుకు వెళ్లలేదని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రిబుల్ తలాక్, సీఏఏ లాంటి చట్టాలు తెచ్చారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర, కశ్మీర్, హర్యానాలో ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు.

కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాల కోసం.. వేల మంది భారతీయుల క్యూ

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను కండ్లకు కడుతున్నది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

మేఘ్‌ అప్‌డేట్స్‌’ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది. కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్‌ వెయిటర్‌, సర్వెంట్‌ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇదని అందులో పేర్కొన్నారు.

ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్తున్నది. మాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు ఏడో నిజాం మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా.. అసలు వివాదం ఏంటంటే..?

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. నకిలీ పత్రాలు సృష్టించి తన తాత ఆస్తులు కాజేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని రూ.121 కోట్ల విలువైన ఆస్తులు కాజేసేందుకు ఫ్లాన్ చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ మనవరాలు ప్రిన్సెస్‌ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో కుమారుడు హైనస్‌ వాల్షన్‌ ప్రిన్స్‌ మౌజ్జమ్‌ ఝా బహదూర్‌ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం వారసులమంటూ తెరపైకి వచ్చారు. తమ పేరిట నిజాం జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) చేశారంటూ 150 మంది సాక్షులతో కోర్టు ద్వారా వారసత్వ పత్రం పొందారు.

అయితే ఆ పత్రాలు, సాక్షులు నకిలీవి అని.. అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించినవని ఫాతిమా ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేయటంతో పాటుగా.. ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ముస్లిం పర్సనల్‌ చట్టం ప్రకారం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు దుల్హాన్‌ పాషా ఒక్కరే భార్య అని చెప్పారు. ఆయన భార్యలుగా చెప్పుకొంటున్న వారికి చట్టప్రకారం ఆ అర్హత లేదని అన్నారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టులను మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమిళనాడులో రూ.121 కోట్ల విలువైన ఎస్టేట్‌ ఉందని.. దాన్ని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా కుట్రపన్నుతున్నారంటూ ఫాతిమా ఫౌజియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసినా కేసు పోలీసులు నమోదుచేయకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా.. సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వ పత్రాలు రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు.

కాగా, అప్పట్లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. లెక్కకు మించిన విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వ తీసుకున్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరుతోనే ఉండగా.. వాటిపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతేడాది ఎనిమిదో నిజాం రాజు ముకర్రమ్ ఝా బహదూర్ టర్కీలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన.. విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటు పడి దివాలా తీశారు. చివరి రోజుల్లో టర్కీలోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అక్కడే కన్నుమూశారు.

రైల్వే నియామకాలపై కేంద్రం యూటర్న్-కీలక నిర్ణయాలు..!

2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా 2019 సమయంలో అమల్లోకి తెచ్చిన రైల్వే అధికారుల నియామకాల నిబంధనలపై యూటర్న్ తీసుకుంది. వీటి స్ధానంలో తిరిగి పాత విధానాన్నే అమలు చేయాలని రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ కింద ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణుల నియామకం కోసం యూపీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ఒకటి కాగా.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) రెండవది. అయితే 2019లో ఇంజనీరింగ్ పరీక్షను తొలగించి కేవలం సీఎస్ఈ రాస్తే సరిపోతుందని నిబంధనలు సవరించింది. కొత్త విధానంలో రెండు రిక్రూట్ మెంట్లు కూడా నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తోడు ఏడాదికి ఐఆర్ఎంస్ కింద 150 మందినే తీసుకోవాలన్న మరో నిర్ణయం ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడింది. రైల్వేలో ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక విభాగాల్లో అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్లనే ఈ పోస్టులకు ప్రమోట్ చేయడం లేదా సబార్డినేట్ ర్యాంక్ అధికారుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ వచ్చీ రాగానే వీటిపై దృష్టిసారించారు. పాత నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో మళ్లీ యథావిథిగా రిక్రూట్ మెంట్లు జరగబోతున్నాయి. కేంద్రం యూటర్న్ తర్వాత సివిల్ ఇంజినీరింగ్ (75), మెకానికల్ ఇంజినీరింగ్ (40), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (50), సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ (40), స్టోర్స్ (20) కేటగిరీల కింద 225 పోస్టులను ఐఆర్‌ఎంఎస్ కింద భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ రిక్రూట్ మెంట్ కు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్రం టెలికాం శాఖ యూపీఎస్సీకి సమాచారం ఇచ్చింది.

ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు.

కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు.

అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజుకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమనిస్తుంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్తారు. దుర్గాష్టమితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. మ‌రోసారి ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారని, ఆయ‌న‌ను ఎవ‌రైనా ఉప‌యోగించుకుంటార‌ని తెలిపారు. 

ఆయ‌న చెబుతున్న‌ట్లు స‌నాత‌న ధ‌ర్మం, హిందూ మ‌తం ప్ర‌మాదంలో లేవ‌ని అన్నారు. కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ఇబ్బందుల్లో ఉంద‌ని పేర్కొన్నారు. 

"న‌టుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్ర‌లు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాద‌ని ఆయ‌న తెలుసుకోవాలి. ఓ స్థిర‌మైన ఆలోచ‌న ఉంటే బాగుంటుంది" అని ప్ర‌కాశ్ రాజ్ హిత‌వు ప‌లికారు. 

ఇక ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ ప‌లుమార్లు జ‌న‌సేనానిపై సెటైర్లు వేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో పోస్టు పెట్టిన విష‌యం తెలిసిందే. ఎంజీఆర్‌పై ప‌వ‌న్ ట్వీట్ చేయ‌గా... దానికి స్పందించిన ప్ర‌కాశ్ రాజ్‌.. ఉన్న‌ట్టుండీ ఎంజీఆర్‌పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేసిన విష‌యం తెలిసిందే.

రేపే తిరుమలలో గరుడ సేవ: 2 లక్షల మందికి పైగా భక్తులు: పార్కింగ్ స్థలాలు ఇవే: టీటీడీ నిర్ణయాలు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమ‌లలో శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు బకాసుర వధ అలంకారంలో దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవితో కలిసి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు.

బ్రహ్మోత్సవాల్లో కీలకమైనది గరుడ సేవ. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల గరుడ వాహనారూఢుడై దర్శనం ఇస్తారు శ్రీమలయప్ప స్వామివారు. ఈ వైభవాన్ని తిలకించడానికి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సారి ⁠దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గరుడ సేవ దర్శనం కోసం గ్యాలరీలతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఆయా పాయింట్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను ఈ రాత్రి 9 గంట‌ల నుంచి అక్టోబ‌రు 9వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రద్దు చేశారు. తిరుమలలో వాహనాల రద్దీని నివారించడంలో భాగంగా ప్రజారవాణాను వినియోగించుకోవాలి.

దాదాపు మూడు లక్షల మంది భక్తులను తరలించేలా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడువేల ట్రిప్పులను నడిపించనున్నారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందిస్తారు. తిరుమలలోని బాలాజీ నగర్, కౌస్తుభం ఎదురుగా, రామ్‌బగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే- తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్‌ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు, వినాయకనగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిపల్‌ పార్కు, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కార్లు, బస్సులను పార్క్ చేయవచ్చు.గరుడ సేవ నాడు తిరుమలకు వచ్చే భక్తులకు వైద్య సేవలను అందించడానికి మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. 12 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గరుడసేవను తిలకించడానికి మాడవీధులు, భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రామ్ బగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.గరుడ సేవను పర్యవేక్షించడానికి 1,250 మంది టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది, 5,000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలను సిద్ధం చేశారు. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, క్యూలైన్లు సహా భక్తులు వేచివున్న ప్రతి చోటా అల్పాహారం, మంచినీరు, పాలు అందిస్తారు.

గ్రేటర్ ఎన్నికల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం - నాలుగు ముక్కలు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని విస్తరించనుంది. నాలుగు ముక్కలుగా మారనుంది. ఔటర్‌ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్‌ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేయాలని భావిస్తోంది. నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్‌ కాకుండా ఒకేసారి నాలుగు కార్పొరేషన్లుగా ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటుగా ఓఆర్ఆర్ లోపల ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు..30 మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిని మొత్తంగా నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసర త్తు ప్రారంభించింది. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సైతం పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. సుమారు 51 గ్రామపంచాయతీలను విలీనం చేసినట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉండటంతో ఈ లోపే గ్రేటర్‌ హైదరాబాద్‌ను నాలుగు భాగాలుగా మార్చాలని భావిస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి గ్రేటర్‌ హైదరాబాద్‌ను 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, నలుగురు మేయర్లు వస్తారని ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చింది. తాజా ఆలోచన మేరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌, శంషాబాద్‌ పేర్లతో నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పా టు చేస్తే అన్ని విధాలా సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కి.మీలు ఉండగా, ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించడంవల్ల ఒకేసారి దాని పరిధి సుమారు 2500 చదరపు కి.మీ మేర అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన డివిజన్లు చేసి, 4 కార్పొరేషన్లలో డివిజన్లు సమానంగా ఉండేలా నిర్ణయించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలన్నీంటినీ ఒక్కటిగా మార్చ డం ద్వారా ఓఆర్‌ఆర్‌ లోపల నివాసముండే జనాభా ఒకేసారి 1.80 లక్షల నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా నాలుగో నగరంగా శంషాబాద్‌ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.