గ్రేటర్ ఎన్నికల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం - నాలుగు ముక్కలు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధి పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని విస్తరించనుంది. నాలుగు ముక్కలుగా మారనుంది. ఔటర్ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేయాలని భావిస్తోంది. నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్ కాకుండా ఒకేసారి నాలుగు కార్పొరేషన్లుగా ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటుగా ఓఆర్ఆర్ లోపల ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు..30 మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిని మొత్తంగా నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసర త్తు ప్రారంభించింది. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సైతం పక్కనే ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. సుమారు 51 గ్రామపంచాయతీలను విలీనం చేసినట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలంతో పాటు శివారు ప్రాంతాల్లోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలకు ఈ ఏడాది చివరి వరకు గడువు ఉండటంతో ఈ లోపే గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు భాగాలుగా మార్చాలని భావిస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌ను 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, నలుగురు మేయర్లు వస్తారని ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చింది. తాజా ఆలోచన మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, శంషాబాద్ పేర్లతో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పా టు చేస్తే అన్ని విధాలా సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కి.మీలు ఉండగా, ఓఆర్‌ఆర్ వరకు విస్తరించడంవల్ల ఒకేసారి దాని పరిధి సుమారు 2500 చదరపు కి.మీ మేర అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జనాభా ప్రాతిపదికన డివిజన్లు చేసి, 4 కార్పొరేషన్లలో డివిజన్లు సమానంగా ఉండేలా నిర్ణయించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ, 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలన్నీంటినీ ఒక్కటిగా మార్చ డం ద్వారా ఓఆర్‌ఆర్ లోపల నివాసముండే జనాభా ఒకేసారి 1.80 లక్షల నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా నాలుగో నగరంగా శంషాబాద్ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం.
Oct 07 2024, 08:24