సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరిక
డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ
రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నా
హాజరైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తదితరులు..
బీఆర్ఎస్ పార్టీ కొంత ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. రైతుల తరపున కేటీఆర్ ధర్నా చెయ్యడం అనేది ప్రతిపక్షానికి మంచి అంశం అంటున్నారు. మరి కేటీఆర్ ఏమన్నారో తెలుసుకుందాం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. 2 లక్షల రుణం తీసుకోమని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా.. కందుకూరులో.. రైతుల తరపున ధర్నాకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
రైతుల ధర్నా కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. 10 నెలలైనా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు.
సెక్రటేరియట్‌కి లంకె బిందెల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి.. దొంగ లాగా తయారయ్యారని కేటీఆర్ సెటైర్ వేశారు. కనిపించిన దేవుడికల్లా ఓటు వేస్తారు గానీ.. రుణమాఫీ మాత్రం అమలు చెయ్యట్లేదు. ఆయనకి చిట్టి నాయుడు అనే పేరు సరైనది అని సెటైర్ వేసిన కేటీఆర్.. ప్రజలు రాజకీయ నేతల చేతిలో మోసపోతూనే ఉంటారని రేవంత్ రెడ్డి ఓ వీడియోలో చెప్పారన్న కేటీఆర్.. ప్రజలు నిజంగానే మోసపోయారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్షయాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడన్న కేటీఆర్… డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అన్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారనీ… ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారని సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. “సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లను కూడా కూల్చుతామన్నారు. అసలు సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించు చిట్టినాయుడు” అని కామెంట్స్ చేశారు కేటీఆర్.. కేపి
Oct 05 2024, 18:49