వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
బెయిల్ విషయంలో తమకు ఇచ్చిన కండిషన్లను సడలించాలని కోరుతూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో విచారణ భాగంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో తలదూర్చకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెల్లరాదంటూ షరతులు విధించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్‌పై.. భాస్కర్ రెడ్డి రెగ్యులర్ బెయిల్‌పై ఉన్నారు. అయితే ఈ ఇద్దరూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ విషయంలో తమకు ఇచ్చిన కండిషన్లను సడలించాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో విచారణ భాగంగా ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి కేసు దర్యాప్తులో తలదూర్చకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెల్లరాదంటూ షరతులు విధించింది.
మరోవైపు భాస్కర్ రెడ్డికి కూడా దర్యాప్తు అధికారుల అనుమతి లేకుండా ఏపీలో అడుగుపెట్టవద్దని బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ షరతులను సడలించాలంటూ వారు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సీబీఐకు నోటీసులు అందించడంతో కౌంటర్ దాఖలు చేస్తామని గత విచారణలో పేర్కొంది. దీంతో శుక్రవారం విచారణలో భాగంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.
Oct 04 2024, 21:01