/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ Raghu ram reddy
నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

దేశంలో రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వానలు కురుస్తాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

దేశంలో రుతుపవనాల పరిస్థితి చూస్తుంటే, ఇంకా తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం(rains) ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం కూడా ప్రారంభమైంది. దీంతో పెరిగిన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. హిమాచల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. ఈ క్రమంలో నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.

సెప్టెంబరు 28న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల, తూర్పు యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని టెరాయ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే నేడు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వర్ష సూచనలు లేవు. సెప్టెంబరు 28న పంజాబ్-హర్యానా, చండీగఢ్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. బీహార్‌లో బాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కోసి, గండక్‌లు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్‌లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్‌లకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

మరోవైపు జమ్మూ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది, వర్షం సంకేతాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ఎల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే తూర్పు, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు త్వరలో విడిచిపెట్టబోతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వాతావరణం స్పష్టంగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన బెంగాల్‌లోని డార్జిలింగ్ పరిస్థితి భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కొండ ప్రాంతాలలో సామాన్య ప్రజల ఇబ్బందులు పెరగడమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక ఆగిపోయింది. శనివారం కూడా ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం కూడా పర్వతాలు, మైదానాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైడ్రా' భ‌యంతో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఏమ‌న్నారంటే..!

హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇల్లును రాసిచ్చారు. 

అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. 

స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్..

ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

హైడ్రా ఎవ‌రికీ నోటీసులు ఇవ్వ‌లేద‌న్న రంగ‌నాథ్‌.. శివ‌య్య దంప‌తులు త‌మ కూతుళ్ల‌కు రాసిచ్చిన ఇళ్లు కూక‌ట్‌ప‌ల్లి చెరువుకు స‌మీపంలోనే ఉన్న‌ప్ప‌టికీ ఎఫ్‌టీఎల్ ప‌రిధికి దూరంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇక కూల్చివేత‌ల‌కు సంబంధించి మూసీ ప‌రిధిలో చేప‌ట్టిన ఏ స‌ర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. 

మూసీ న‌దిలో శ‌నివారం భారీగా ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేయ‌బోతున్న‌ట్లు ఫేక్ న్యూస్ ప్ర‌చారం అవుతోంది. కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని రంగ‌నాథ్ మండిప‌డ్డారు. కూల్చివేత‌ల గురించి ప్ర‌జ‌లు అనవ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. కూల్చివేత‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఇబ్బందులు ప‌డ‌కుండా హైడ్రాకు ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు.

పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తోంది.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు.

15 బృందాలు

జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్‌లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు, బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇన్ ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 15 బృందాలు తనిఖీలు చేపట్టింది.

ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంటిలో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది. నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు‌ను రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దీనికి సంబంధం లేదని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు జరుగుతున్న రైడ్స్ దానికి కొనసాగింపు అని తెలుస్తోంది.

పొంగులేటి హర్ష పేరుతో భారీగా ఆస్తులు

పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి చిన్న వయస్సులోనే బిలియనీర్‌గా మారారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్ష రెడ్డి పేరుతో రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చానీయాంశం అవుతుంది. ఆ క్రమంలో వరసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారితీస్తోంది.

మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్

మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి. ఒక్కో టీమ్ లో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు.

మూసీ (Musi) నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి. ఒక్కో టీమ్ లో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ నిర్మాణాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు ఇళ్ళతో పాటు నష్టపరిహరం చెల్లించేందుకు ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. అయితే పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు

మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించినట్లు దాన కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.

దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దాన కిషోర్ తెలిపారు. రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. బఫర్ జోన్‌కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇస్తామన్నారు. ఆ తరువాత మాత్రమే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని దాన కిషోర్ తెలిపారు. మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని, అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌(Somajiguda Press Club)లో ‘సమగ్ర కులగణన - సామాజిక న్యాయం’పై రాష్ట్ర స్థాయి అఖిల పక్ష సదస్సు జరిగింది. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఫౌండేషన్‌ సెక్రెటరీ జనరల్‌ రాపోల్‌ జ్ఞానేశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బీఎ్‌స రాములు తదితరులు మాట్లాడారు.

బీసీలపై కనిపించని వివక్ష, దోపిడీ కొనసాగుతున్నదని ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి, సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అన్నారు. బీసీ రాజ్యాధికారం సాధించడానికి మహా ఉద్యమం రావాలన్నారు. మన కలలు సాకారం అయినప్పుడే కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నిజమైన నివాళి అని కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్థమే జరుగుతుందని హెచ్చరించారు. సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. సదస్సులో సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, లాల్‌ కృష్ణ, సురేష్‌, కిరణ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌,మునుగోడు మాజీ జెడ్పీటీసీ బొల్లి శివకుమార్‌, వేముల రామకృష్ణ, వివిధ బిసి కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగా స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాధాను వెంటనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయంలో తెలియడంతో అభిమానులు, కూటమి నేతలు పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.

వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై ఆరా తీశారు.. కొందరు ఫోన్‌లు చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

వంగవీటి రాధా స్వల్పంగా నొప్పి వచ్చిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడ్డారని.. గుండెనొప్పి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు.

వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు కచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ, ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే రెండు రోజుల క్రితమే నామినేటెడ్ పదవులు కొన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీలో చేరి.. అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వంగవీటి రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు.. అయితే అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అలాగే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను కలిశారు.. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేదరనే చెప్పాలి. అయితే 2024 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్‌సీపీకి మళ్లీ వెళతారని ప్రచారం జరిగింది.. అలాగే జనసేన పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ జూన్‌ 7న సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

జూలై 22న ఆ చార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు జరుగుతుండగా బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా చార్జిషీట్‌ పై విచారణ నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే.. చార్జిషీట్‌లో పేజీలు సరిగా లేవని, కొన్ని పేజీల్లో అక్షరాలు స్పష్టంగా లేవని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావు న్యాయమూర్తికి తెలిపారు.

మోహిత్‌ రావుతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చార్జిషీట్‌ ను సరైన పద్ధతిలో ఫైల్‌ చేసి కాపీని అందజేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 4కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు

మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.

ఆ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు. మోహన్ బాబు వద్ద నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ స్కెచ్ వేశాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ. 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత గణేశ్ కనిపించలేదు. అనుమానం వచ్చి చూడగా రూ. 10 లక్షలు మాయమైనట్టు గుర్తించారు. దీంతో పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు... గణేశ్ కోసం గాలించారు. చివరకు తిరుపతిలో అరెస్ట్ చేశారు.

దసరా లోగా రైతుల ఖాతాల్లో నిధుల జమ..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా లోగా నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధుల జమ పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో రైతు రుణమాఫీ మూడు విడతలు గా అమలు చేశారు. ఇంకా అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ పూర్తికాలేదు. దీంతో నాలుగో విడత రుణమాఫీగా వీరందరికీ నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవటం, ఆధార్ తప్పులు కారణంగా రుణమాఫీ పలువురికి నిలిచిపోయింది. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెలాఖరులోగా డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నారు.

దసరా పండుగలోగా 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు నిధుల సర్దుబాటు పైన దృష్టి పెట్టింది. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం దాదాపు 22 లక్షల మంది రైతులకు రూ 17,934 కోట్ల రుణమాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులు 4.28 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల సంఖ్య 1. 26 లక్షల వరకు ఉంది. మొత్తం కలిపి 5.54 లక్షల మంది రైతుల ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి.

దీనికి సంబంధించి ఆగస్టు 29 న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల నాలుగో తేదీ వరకు వీటిని స్వీకరించారు. ఏ బోలో క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపు పోలికి వచ్చింది. 4.28 లక్షల మంది రైతుల్లో 3.10 లక్షల మంది రైతులకు సంబంధించి ఫ్యామిలీ గ్రూప్ ఇన్ పూర్తయింది. ఈ మొత్తం లెక్కల పైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం దసరా లోగా వీరికి నాలుగో విడత రుణమాఫీ చేయాలని ఆలోచన చేస్తుంది.

మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హైడ్రా (Hydra) బుల్డోజర్లు (Bulldozers) ఈసారి మూసీ (Musi) వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై (Demolition) హైడ్రా ఫోకస్ పెట్టింది. శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ (Target) నిర్దేశించుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్.. మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. కాగా మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కాగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించిన క్రమంలో నిర్వాసితుల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మూసీ పరీవాహక ప్రాంతంలో పదివేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుందని.. సుమారు 16 వేల కుటుంబాలుండొచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్లందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారుల బృందం బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. తొలి విడతలో రివర్‌ బెడ్‌లోని 1600 ఇళ్లను తొలగించే ప్రక్రియ వెంటనే మొదలవుతుందని చెప్పారు. తర్వాత బఫర్‌ జోన్‌లోని నిర్మాణాలను తొలగిస్తామన్నారు.

కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల ఇళ్లతో పాటు చెరువులు, నాలాల వద్ద ఉంటున్న పేద కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఒక్క పేద కుటుంబం కూడా రోడ్డున పడకూడదని, అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కమాండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారుచేయాలన్నారు. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు విధిగా పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.