ఆత్మకూరు(M) మండల కేంద్రంలో CPI పార్టీ ,ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి
యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు ఐలమ్మ (చాకలి ఐలమ్మ) 129 వ జయంతి సందర్భంగా వీరనారి ఐలమ్మకు విప్లవ జోహార్లు* ఆత్మకూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం *సిపిఐ మండల కార్యదర్శి మారుపాక వెంకటేష్, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి సంయుక్తంగా మాట్లాడుతూ* కామ్రేడ్ ఐలమ్మ తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ ,చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత వీరు 1919లో జన్మించి 10, సెప్టెంబర్ 1985లో పరమ పదించారు 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు నాలుగో సంతానముగా చాకలి ఐలమ్మ జన్మించింది పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్య తో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది (అప్పటికి ఆమె వయస్సు 13 ఏడ్లు) వీరికి 5 గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కులవృత్తి వారికి జీవనాధారం 1940-1944 మధ్యకాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ అగ్రకులాల స్త్రీలు దొరసానులు కూడా దొర అని పిలవకపోతే ఉత్పత్తి కులాలతో పాటు అనేక పీడన రూపాలు విరుచుకు పడేవి తమను దోర అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీ మీద తమ భర్తలను ఉసి గొల్పి దగ్గరుండి అఘయిత్యం చేయించేవారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరేవ్వాడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించు కోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడ బగ్నీలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది అందులో నాలుగు ఎకరాలు సాగు చేశారు పాలకుర్తి పట్వారి వీరమనేని శేషగిరిరావు కు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది బట్టలు ఉతికే ఐలమ్మ కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటుంది అని విసునూరు దొర గుండాలతో ఐలమ్మ పై దాడి చేయించారనీ అన్నారు ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలుగా చేరిందని. కక్షగట్టిన పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టు ల్లో చేరిందని విసునూర్ దేశ్ ముఖ్ రామ్చంద్ర రెడ్డికి ఫిర్యాదు చేశాడు కేసులో అగ్ర నాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా వచ్చింది ఐలమ్మ కుటుంబాన్ని ధాన్యం తమదేనని పంటను కోసుకు రమ్మని వంద మందిని దేశ్ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరికట్టలు కట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరి లు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది రజాకారుల ఉపసేనాధిపతి అయినా దేశ్ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు ధనాన్ని ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు, ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారి ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్రజెండను వీడలేదు ఈ దొర గాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరోడు ఏం చేస్తాడు రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేత బూని గుండాలను తరిమికొట్టింది కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఐలమ్మ భూ పోరాటంలో విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంలో మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటంలో చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు 10 లక్షల ఎకరాలు భూ పంపిణీ జరిగింది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు జల్ది రాములు, జక్క దయాకర్ రెడ్డి, సుల్తాన్ పురుషోత్తం,యాస బుచ్చిరెడ్డి,బొబ్బల్ లాల్ రెడ్డి, మారుపాక అంజయ్య, పంజాల చంద్రమౌళి,కసర బోయిన సత్తయ్య, పంజాల వెంకటేష్, మారుపాక మల్లేష్, శ్రీరామోజు యాదగిరి, అంబోజు చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు మారుపాక లోకేష్, మేకల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Sep 27 2024, 18:42