స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)లో ‘సమగ్ర కులగణన - సామాజిక న్యాయం’పై రాష్ట్ర స్థాయి అఖిల పక్ష సదస్సు జరిగింది. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఫౌండేషన్ సెక్రెటరీ జనరల్ రాపోల్ జ్ఞానేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎ్‌స రాములు తదితరులు మాట్లాడారు.
బీసీలపై కనిపించని వివక్ష, దోపిడీ కొనసాగుతున్నదని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి, సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అన్నారు. బీసీ రాజ్యాధికారం సాధించడానికి మహా ఉద్యమం రావాలన్నారు. మన కలలు సాకారం అయినప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.
గుజ్జ సత్యం మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్థమే జరుగుతుందని హెచ్చరించారు. సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. సదస్సులో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, లాల్ కృష్ణ, సురేష్, కిరణ్, శ్రీకాంత్ గౌడ్,మునుగోడు మాజీ జెడ్పీటీసీ బొల్లి శివకుమార్, వేముల రామకృష్ణ, వివిధ బిసి కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Sep 26 2024, 11:56