వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగా స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాధాను వెంటనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయంలో తెలియడంతో అభిమానులు, కూటమి నేతలు పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.
వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై ఆరా తీశారు.. కొందరు ఫోన్‌లు చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
వంగవీటి రాధా స్వల్పంగా నొప్పి వచ్చిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడ్డారని.. గుండెనొప్పి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు.
వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు కచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ, ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే రెండు రోజుల క్రితమే నామినేటెడ్ పదవులు కొన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీలో చేరి.. అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వంగవీటి రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు.. అయితే అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అలాగే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను కలిశారు.. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేదరనే చెప్పాలి. అయితే 2024 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్‌సీపీకి మళ్లీ వెళతారని ప్రచారం జరిగింది.. అలాగే జనసేన పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.
Sep 26 2024, 11:45