జమిలి ఎన్నికల విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉన్నత స్థాయి కమిటీ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడం వల్ల దేశ ఫెడరల్ విధానానికి విగాథం కలుగుతుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని అందరు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు శుక్రవారం రోజున పులిగిల్ల గ్రామంలో సిపిఎం నాయకులు కళ్ళెం సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామశాఖ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడం వల్ల దేశంలోని ఐక్యతకు ఫెడరల్ స్ఫూర్తికి విగాథం కలిగే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల ఐదు సంవత్సరాలు పరిపాలించవలసిన ప్రభుత్వాలు రెండూ లేదా మూడు సంవత్సరాలు మాత్రమే అవసరమైతే ఒక సంవత్సరం మాత్రమే పదవీకాలంలో ఉంటాయని దీని ద్వారా రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని వారు అన్నారు. జెమిలి ఎన్నికల విధానం ద్వారా ఆర్టికల్ 83, ఆర్టికల్ 172ను సవరించాల్సిన పరిస్థితి వస్తుందని రాజ్యాంగంలోని మార్పులకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమని వారు అన్నారు. గత సంవత్సరం 10 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా మళ్లీ 2020 8 సంవత్సరంలో ఎన్నికలు జరపవలసిన అవసరం వస్తుందని, అప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం అంతకంటే తక్కువ సమయ కాలమే అధికారంలో ఉంటాయని వారు అన్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ పరిస్థితి ఉంటుందని వారు సూచించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తుందని దానిలో భాగంగానే జమిలి ఎన్నికల విధానం అని వారు అన్నారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి,మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకట్ రెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,నాయకులు బుగ్గ ఐలయ్య,వరికుప్పల యాదయ్య,వేముల చంద్రయ్య,వరికుప్పల శంకరయ్య,ఫైళ్ల వీరారెడ్డి,వేముల ఆనంద్,వనం యాదయ్య,వేముల జైలు,కొమ్మిడి సత్రిరెడ్డి, వేముల అమరెందర్,మారబోయిన ముత్యాలు,వడ్డేమని మధు,వడ్లకొండ శంకరయ్య,వడ్డేమని రవి,వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Sep 24 2024, 16:20