నైజాం నవాబును తరిమికొట్టింది కమ్యూనిస్టులు; గోదా శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి
వేములకొండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం సాయంత్రం 7:00 గంటలకి సభాధ్యక్షులు కామ్రేడ్ పులి పలుకుల మల్లేశం గారి అధ్యక్షతన జరిగినది ఈ బహిరంగ సభకి *ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గోద శ్రీరాములు పాల్గొని ప్రసంగించారు* భారతదేశానికి సంవత్సరాల తరబడి పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాదులని భారతదేశం నుంచి తరిమి కొట్టిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు 15-1947లో సిద్ధించింది అప్పటి భారత దేశంలో సుమారు 500 సంస్థానాలు ఉండేవి. అందులో హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద ధనవంతమైన సంస్థానం ఇట్టి సంస్థానం నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సైన్యాధ్యక్షులు ఖాషీం రజ్వీ, ఉపాధ్యక్షులు విసునూరు రామచంద్రారెడ్డి, భూస్వాములు ,పెతందారులు జాగిర్దారులు, మిలటరీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని. తెలంగాణ ప్రాంతంలో ప్రజలపై అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ అన్ని కులాల వారిలో వెట్టిచాకిరి చేయిస్తూ నిరంకుశంగా వ్యవహరించేవారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి సంబరాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ ప్రజలకు తిప్పలు తప్పలేదు అట్టి నిరంకుశత్వాన్ని కల్లారా చూసిన రావి నారాయణరెడ్డి, మగ్డూం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారు ఆంధ్ర మహాసభలో ఖాసీ,ఆకృత్యాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు సెప్టెంబర్ 11-1947న సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్య పరిచి అందిన ఆయుధాలు గుతపలు రోకలిబండలు కారంపొట్లాలు ఒడిశాలలో తీసుకొని తిరగబడ్డారు మిలిటరీ సైన్యం జరిపిన కాల్పుల్లో, దాడుల్లో 4000 మంది మృతి చెందిన వెరవకుండా సాయుధ పోరాటాన్ని ఉదృతం చేశారు దాదాపు 3వేల గ్రామాల పైచిలుకు విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమి ని పేదలకు పంచారు కాసిం రాజ్వి క్యాంపు లపై సాహిదులు తిరగబడే నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 17న నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతీ యూనియన్ లో విలీనం చేయటం జరిగినది అని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ గ్రామంలో గొప్ప బహిరంగ సభలో అన్నారు హైదరాబాదు నుండి వలిగొండ మండలం మీదగా పారుతున్న మూసి నదిని ప్రక్షాళన చేసి శుద్ధమైన నీరు అందించాలని అన్నారు వేములకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాటి స్వతంత్ర సమరయోధులను సన్మానించారు గంగుల కృష్ణారెడ్డి, తాతయ్య, బందారపు అంజయ్య, కోమటిరెడ్డి అండాలు,జక్కిడి లక్ష్మమ్మ లను జిల్లా కార్యదర్శి సన్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పులిపలుపుల ఆనందం, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, ఉప్పల ముత్యాలు,కల్లం కృష్ణ,వలిగొండ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎలగందుల అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చలిగంజి వీరస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఆత్మకూరు మండల కార్యదర్శి మారుపాక వెంకటేష్, రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కల్లపల్లి మహేందర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, వలిగొండ మండల మరియు వేములకొండ గ్రామ శాఖ నాయకులు కొయ్యకురా రాంమల్లు, అంబటి అంజయ్య, చంద్రగిరి చంద్రయ్య,నరిగే యాదయ్య, నార్కట్పల్లి మచ్చ గిరి, సల్వాద్రి రవీందర్, చొప్పర్ వెంకటేష్, బొడిగ సుదర్శన్,ఆకుల శ్రీను, పొలమైన శంకరయ్య , వడ్డేగానిశంకరయ్య, బీస్ రమేష్, చేగురి పాపయ్య, భీమ గాని శ్రీను, సలిగంజి కృష్ణకుమార్, యాస జనార్దన్ రెడ్డి, రాపోలు పవన్, ఎర్ర కిరణ్, మారోజు నరసింహ చారి, ఎల్లంకి చంద్రశేఖర్, కనబడిన పృథ్వీరాజ్, వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున బహిరంగ సభకు హాజరైన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Sep 19 2024, 16:30